కదులుతున్న రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు దాని కిందపడి ఓ మహిళ మృతిచెందింది.
వరంగల్ : కదులుతున్న రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు దాని కిందపడి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన వరంగల్ రైల్వేస్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన మహిళ తన కూతురితో కలిసి వరంగల్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించింది.
రైలు వేగం అందుకోవడంతో.. ప్రమాదవశాత్తు దానికింద పడిపోయింది. చివరి నిముషంలో తన చేతిలో ఉన్న చిన్నారిని విసిరేయడంతో.. గాయాలపాలైన చిన్నారి ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.