కమలాపూర్: కరీంనగర్ జిల్లాలో రైల్లో నుంచి జారిపడి ఓ టిక్కెట్ కలెక్టర్(టీసీ) మృతిచెందాడు. కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న ఇంటర్‌సిటీ రైలు నుంచి టీసీ జారిపడ్డాడు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు.
మృతి చెందిన టీసీని వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన కుమారస్వామిగా గుర్తించారు. ఏడు రోజుల క్రితమే టీసీకి పెళ్లయినట్లు తెలిస్తుంది. ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారాన్ని తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవ వరుడైన కుమారస్వామి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.