ticket collector
-
ఏసీ బెర్త్‌కు రూ.1000.. నాన్ ఏసీకి రూ.500
సాక్షి, హైదరాబాద్: ఏసీ బెర్త్‌కు రూ.1000..నాన్ ఏసీ బెర్త్‌కు రూ.500. ఇవి టికెట్ చార్జీలు కాదు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్తులు కావాలంటే టికెట్ కలెక్టర్లకు (టీసీలకు) సమర్పించుకోవలసిన ఆమ్యామ్యాలు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లు, కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరహా బేరాలు జోరుగా సాగుతున్నాయి. టీసీలే స్వయంగా డబ్బులు తీసుకొని బెర్తులు కట్టబెట్టడంతో వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న వారు నిశ్చింతంగా ప్రయాణం చేస్తున్నారు. నిజానికి టికెట్ నిర్ధారణ అయితే తప్ప ట్రైన్లో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ప్రతి ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రయాణికుల జాబితా విడుదల అవుతుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్లు మాత్రమే రిజర్వేషన్ లభించిన ప్రయాణికులు. కానీ ప్రతి ట్రైన్‌కు వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికులు ఉంటారు. చార్ట్ (జాబితా) సిద్ధమైన తరువాత వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులు వారి ఖాతాలోకి ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతాయి. కానీ కొందరు ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ప్రయాణం చేస్తారు. ఏదో ఒకవిధంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో టికెట్లను రద్దు చేసుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో ఈ తాకిడి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులపైనే కొందరు టీసీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బోగీల్లో బెర్తులకు రూ.500, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో బెర్తులకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.శబరి రైళ్లకు డిమాండ్ ఫుల్... ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు తరలివెళ్తున్నారు. కొంతమంది సాధారణ భక్తులు సైతం దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రత్యేక రైళ్లకు సైతం డిమాండ్ బాగా ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లాలన్నా, ఫ్లైట్‌లో వెళ్లాలన్నా పెద్దమొత్తంలో వెచ్చించవలసి ఉంటుంది. చార్జీల భారం దృష్ట్యా ఏదోఒకవిధంగా రైళ్లలో వెళ్లడమే మంచిదని భావించే వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికుల అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలోని వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాలకు చెందిన నలుగురు స్నేహితులు నవంబర్ 27వ తేదీన 12 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17230)లో సికింద్రాబాద్ నుంచి శబరికి బయలుదేరారు. వాళ్ల ప్రయాణానికి ఇంచుమించు నెల రోజుల క్రితమే సెకండ్ ఏసీ రిజర్వేషన్ కోసం టికెట్లు కొనుగోలు చేశారు. కానీ ప్రయాణ తేదీ నాటికి కూడా టికెట్లు నిర్ధారణ కాలేదు. రిజర్వేషన్ లభించలేదు. చార్ట్ (ప్రయాణికుల జాబితా) సిద్ధమైన తరువాత కూడా ఆ ప్రయాణికులు వెయిటింగ్ జాబితా (5 నుంచి 8 వరకు)లోనే ఉండిపోయారు. అయినప్పటికీ టికెట్లను రద్దు చేసుకోకుండా అదే ట్రైన్లో బయలుదేరారు. రైలు ప్రారంభమైన కొద్దిసేపటికి వెళ్లి టీసీని సంప్రదించారు. ‘మొదట్లో ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోయినప్పటికీ ట్రైన్ తిరుపతికి చేరుకున్న తరువాత ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1000 చొప్పున మొత్తం రూ.4000 తీసుకొని నాలుగు బెర్తులు కేటాయించాడు. సెకండ్ ఏసీలోనే ఆ సదుపాయం లభించడంతో ప్రయాణం నిశ్చింతగా సాగింది.’ అని ఆ ప్రయాణికులు చెప్పారు. తమతో పాటు మరి కొందరికి కూడా రూ.1000 చొప్పున తీసుకొని ఏసీ బోగీల్లో, రూ.500 చొప్పున తీసుకొని స్లీపర్‌లో బెర్తులు ఇచి్చనట్లు వారు చెప్పారు.ఎలా సాధ్యం... ⇒ రిజర్వేషన్లు నిర్ధారణ అయిన ప్రయాణికులు ఆకస్మికంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకో వ చ్చు. అలాంటి వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ట్రైన్లో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్, టికెట్ కలెక్టర్, తదితర సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలను తమ వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ మిషన్లలో నమోదు చేయాలి. ⇒ ఈ క్రమంలోనే కొందరు టీసీలు ఇలాంటి ప్రయాణికుల వివరాలను నమోదు చేయడంలోనే తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.⇒ సదరు ప్రయాణికుల పేరు వద్ద ‘కాన్సిల్’ అని కాకుండా ‘జాయిన్’ అని నమోదు చేసి ఆ బెర్తులను వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు కేటాయిస్తున్నారు. అయితే ఆన్లైన్ టికెట్లపైన ఇది సాధ్యం కాదు. రిజర్వేషన్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే టీసీలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. -
రైలు ప్రయాణికుడిని చితకబాదిన టీటీ.. వీడియో వైరల్
లక్నో: రైలు ప్రయాణికుడి పట్ల ఓ టీటీ రెచ్చిపోయాడు. విచక్షణ మర్చిపోయి అతడిని దారుణంగా చితకబాదాడు. వారి మధ్య ఏదో వైరం ఉన్నట్టుగా బాధితుడిని కొట్టాడు. ఇక, దీన్నింతా తోటి ప్రయాణికుడు వీడియో తీస్తుండగా అతడితో కూడా వాగ్వాదానికి దిగాడు. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ సదరు టీటీని సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం.. బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్ రైలులో టీటీ రెచ్చిపోయాడు. రైలు ప్రయాణికుడిపై టీటీ భౌతిక దాడికి దిగాడు. రైలులో 25 ఏళ్ల యువకుడు టికెట్‌తో రైలు నంబరు-15203లో ముజఫర్‌పూర్ నుంచి లక్నోకు ప్రయాణిస్తుండగా టీటీ దాడికి దిగాడు. ప్రయాణికుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అసలు ఎందుకు దాడి చేశాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా, ప్రయాణికుడు నీరజ్ కుమార్ టికెట్ కూడా తీసుకోవడం గమనార్హం. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, టీటీ చర్యపై నెటిజన్లతో సహా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లక్నో డివిజన్ డీఆర్ఎం టీటీని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. This video is said to be of Train number 15203 - Barauni Lucknow Express. You can see the ruthless TT is assaulting the poor passenger without any reason. The victim was repeatedly asking what’s his fault but the TT kept on beating him. .@AshwiniVaishnaw, please take immediate… pic.twitter.com/XKNiQhVqiT — Mahua Moitra Fans (@MahuaMoitraFans) January 18, 2024 -
పనిలో ఫైర్ బ్రాండ్.. ముక్కు పిండి మరీ రూ.కోటి వసూలు చేసింది!
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తూ సస్పెండ్ అవుతుంటే, మరి కొందరు నిబద్ధతతో పని చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోసలిన్ అరోకియా మేరీ తన పని తీరుతో అందరి మన్ననలు పొందుతోంది. ఇటీవల ఆమె రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రశంసలు అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. రోసలిన్ అరోకియా మేరీ.. ఆమె తన విధుల్లో ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఆమె చేతికి చిక్కితే ఇక వారి పని అయినట్టే, ముక్కు పిండి మరీ వారి నుంచి జరిమానా వసూలు చేస్తుంది. ఇలా టికెట్ లేని ప్రయాణికులు, నిబంధనలు పాటించని ప్యాసింజర్ల నుంచి రోసలిన్ రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసింది. పనిలో నిజాయతీగా ఖచ్చితత్వం ప్రదర్శిస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శంగా మారిన ఈ మహిళా టికెట్ ఇన్ స్పెక్టర్ కు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి. ‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని తెలిపింది. ఈ పోస్ట్ ఆన్లైన్లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, ఎందుకంటే టికెట్ తనిఖీ సిబ్బందిలో ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన మొదటి మహిళ ఆమె గుర్తింపు పొందింది. ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్న మేరీకి నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. -
Video: యువతితో రైల్వే టీసీ అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో రెచ్చిపోయి..
బస్సు, రైలు, విమానం.. ఇలా ప్రతి చోట ప్రయాణికులకు భద్రత కరువవుతోంది. ప్రయాణిస్తున్న వారితో అనుచితంగా ప్రవర్తించడం, మూత్ర విసర్జన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ బెదిరింపు ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న రైల్వే టికెట్ కలెక్టర్.. మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఉదంతం కర్ణాటకలో చోటుచేసుకుంది. కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లోని టికెట్ కలెక్టర్.. అక్కడే నిలబడి ఉన్న మహిళా ప్రయాణికురాలి వద్దకు వచ్చి టికెట్ చూపించాలని అడిగాడు. అయితే ఆ సమయంలో టీసీ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. యువతి తన ఫోన్లో టికెట్ కోసం వెతుకుతుండగా.. ఆమె టికెట్ లేకుండా రైలు ఎక్కిందని టీసీ ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. స్టేషన్లో జరుగుతున్న తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు తమ ఫోనల్లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇందులో.. నన్ను ఎందుకు వేధిస్తున్నారు. నేను టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టే ఇక్కడ ఉన్నానంటూ యువతి టీసీతో గట్టిగా అరవడం కనిపిస్తోంది. దీనిపై టీసీ స్పందిస్తూ.. టికెట్ చూపించి వెళ్లు.. ఇది నా పని అంటూ హిందీలో చెప్పడం చూడవచ్చు. చదవండి: ‘అధికారంలోకి వచ్చాక.. నీ సంగతి చెప్తా’.. కర్ణాటక డీజీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ కాగా తాను టిక్కెట్‌ను బుక్ చేసుకున్నానని, దానిని వేరే టిక్కెట్ కలెక్టర్‌కి చూపించానని యువతి పేర్కొంది. అయినా టీసీ తనపై దుర్భాషలాడుతూ.. తాకేందుకు ప్రయత్నించాడని యువతి ఆరోపించింది. తనతో ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అతన్ని ప్రశ్నించింది. స్టేషన్లో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అక్కడి నుంచి మెల్లగా జారుకుంటున్న టీసీని.. యువతి దగ్గరికి లాక్కొచ్చారు. చివరికి ఈ విషయం రైలే శాఖ వరకు చేరడంతో టీటీఈని నైరుతి రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. Drunk TT pulled her at KJM . While the girl was telling she had her ticket, showed ticket to TT but TT didn't listen anything,pulled her and still misbehave with her.We need explanation for on duty drunk TT.@RailMinIndia@Central_Railway please take strict action against the TT. pic.twitter.com/UUjRcm8X1w — Karishma behera (@karishma_behera) March 14, 2023 -
క్వీన్స్ ఎక్స్‌ప్రెస్
‘టికెట్ కలెక్టర్‌గా అమ్మాయి!’‘ట్రైన్ డ్రైవర్ అమ్మాయట!’‘ట్రైన్ గార్డ్‌గా అమ్మాయి!’... ఇలాంటి ఎన్నో ఆశ్చర్యాలను చూసింది కాలం.వివిధ హోదాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్న వారిని చూసి గర్వించింది కాలం.పరుగెత్తే కాలంలో ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఆరోజు అచ్చంగా అలాంటిదే! కాస్త సరదాగా చెప్పుకోవాలంటే ‘కన్నుల పండగ’ అనేది పండగరోజు మాత్రమే రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేక దినాలలో కూడా రావచ్చు. మొన్నటి మహిళా దినోత్సవం రోజు అలాంటి కన్నుల పండగ జరిగింది.సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ అందరూ మహిళలే ఉన్న బృందానికి ముంబై–పుణె దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించే బాధ్యతను అప్పగించింది. ఆరోజు ఆ ట్రైన్‌లోకి అడుగు పెడితే...డ్రైవర్ సీట్లో దర్జాగా కూర్చున్న లోకో–పైలట్ సురేఖ యాదవ్, టికెట్ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న నీతు, రుబినా, బీనా, సురక్ష, జెన్, దీపలతో రైలు కొత్తగా కనిపించింది.‘ఈరోజు నిజంగా మరిచిపోలేని రోజు. రైలును మహిళలే నడిపిస్తున్నారనే భావన గర్వంగా ఉంది. నా వృత్తిజీవితంలో ఇది గుర్తుంచుకోదగిన రోజు’ అంటుంది లోకో–పైలట్ సురేఖ యాదవ్. లోకో–పైలట్‌గా వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడానికి ముందు...‘అది కఠినమైన వృత్తి. ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. మహిళలకు ఎంతమాత్రం సరిపడని వృత్తి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు.వాటిని పట్టించుకొని ఉంటే ఆమె పేరు పక్కన ‘లోకో–పైలట్’ అనే విశేషణం గర్వంగా కాలర్ ఎగరేసేది కాదు.‘ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావాలి’ అంటుంది అసిస్టెంట్–లోకో పైలట్ లీనా ఫ్రాన్సిస్. చిన్నప్పుడెప్పుడో ట్రైన్ ముందు బోగీలో గంభీరంగా కూర్చున్న డ్రైవర్‌ను చూసిన తరువాత తాను కూడా డ్రైవర్ కావాలనుకుంది.‘అలా కుదరదు. వీలు కాదు’ అనే మాటల మధ్య కూడా తన ఆశను కోల్పోలేదు.వృత్తిజీవితంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ‘హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగం కాకుండా ఈ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు తల్లీ. ట్రైన్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. జాగ్రత్త’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. శుభమా అని ఉద్యోగంలోకి అడుగు పెడుతుంటే ఈ మాటలేమిటని లీనా ఫ్రాన్సిస్ చిన్న బుచ్చుకోలేదు. ‘వాళ్లంతేలే!’ అని మాత్రమే అనుకుంది.సురేఖ యాదవ్ నుంచి రుబినా వరకు తమకు ఇష్టమైన వృత్తిలోకి రావడానికి ముందు ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే ఈ బండి ప్రయాణికులనే కాదు వారి విజయాలను కూడా మోసుకుంటూ వెళ్లింది! -
బరితెగిస్తున్న బ్లేడ్ బ్యాచ్
బ్లేడ్ బ్యాచ్‌లు జిల్లాలో బరితెగిస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైన జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. రాత్రి వేళ కొందరు యాత్రికులు స్టేషన్లలో సేదదీరుతుంటారు. ఈ పరిస్థితులను బ్లేడ్ బ్యాచ్‌లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. చోరీల కోసం దాడులకు తెగబడుతున్నాయి. శనివారం రాత్రి ఇద్దరు ఓ రైల్వే టీటీఈపైనే కత్తితో దాడిచేశారు. ఈ సంఘటన తెలిసిన ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. చిత్తూరు అర్బన్: గతనెల 22వ తేదీ నగరి రైల్వే స్టేషన్లో బరితెగించిన గుర్తుతెలియని వ్యక్తులు నలుగురిపై బ్లేడులతో దాడులకు పాల్పడ్డారు. భిక్షగాళ్లని కూడా చూడకుండా బ్లేడులతో దాడులుచేసి ఉన్న డబ్బును లాక్కుని పారిపోయారు. తీవ్ర రక్తస్రావం మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత నలుగురూ కోలుకున్నారు. ఈ దాడులు చేసింది ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదు. ఇప్పుడు.. రేణిగుంట రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఇద్దరు సైకోలు ప్రయాణికుల్లా నటించారు. ఇక్కడున్న రైల్వే ప్లాట్‌ఫాం వంతెనపై పడుకుని ఉన్న ఓ ప్రయాణికుడి జేబులో డబ్బులు చోరీ చేస్తుండగా విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న టికెట్ కలెక్టర్ ఉమామహేశ్వరరావు అనుమానం వచ్చి ప్రశ్నించారు. వెంటనే జేబుల్లో ఉన్న బ్లేడులను తీసుకుని విచక్షణారహితంగా ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ తరహా దాడులకు పాల్పడుతున్న నింది తులు బ్లేడు బ్యాచ్‌కు చెందిన వారుగా నిర్ధారణ అయ్యిం ది. రేణిగుంటలో జరిగిన దాడిలో నిందితులు చెన్నైకి చెందిన వెంకటేష్, విజయన్‌గా గుర్తించారు. అయితే ఇద్దరు నిందితులను పట్టుకోవడంతో ఇంతటితో ఈ తరహా ఘటనలకు కళ్లెం పడ్డట్లుకాదని పోలీసులు చెబుతున్నారు. బ్లేడ్ బ్యాచ్‌లో ప్రస్తుతం పట్టుబడింది ఇద్దరు నిందితులే. ఇంకా ఈ ముఠాలో ఎందరు ఉన్నారు..? వీరి స్థావరం? వీరి లక్ష్యం ఏమిటని ఇద్దరు నిందితులను విచారించిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు. దురలవాట్లే వ్యసనం ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల బ్లేడుబ్యాచ్‌లు వీరంగం సృష్టించాయి. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు ప్రాంతాల్లో దాదాపు 13 మంది బ్లేడ్‌బ్యాచ్ నిందితులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కేవలం చిల్లర డబ్బుల కోసం, వ్యసనాల కోసమే వీరు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగడానికి, గంజాయి సేవించడానికి డబ్బులు కావాల్సి రావడంతో రద్దీ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే ప్రయాణికులపై వీరు దాడులకు పాల్పడుతుంటారు. ఒక్క చోట ఉండరు ఇప్పటికే పట్టుబడ్డ బ్లేడ్‌బ్యాచ్ నిందితుల్లో ఏ ఒక్కరికీ స్థిరమైన చిరునామా అంటూ లేదు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ దోపిడీలు చేస్తూ వీరు జీవనం సాగిస్తుంటారు. భార్య, పిల్లల్ని వీరితో పాటు ఎక్కడకూ తీసుకురారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అయితే వీరిని అరెస్టుచేసి రిమాండుకు పంపిన తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలిస్తే జామీను ఇవ్వడానికి మాత్రం బయటకొస్తారు. కోర్టుల్లో జరిగే విచారణకు హాజరుకాకుండా మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. న్యాయస్థానాల్లో వీరిపై చాలా వరకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. లోతుగా విచారిస్తే.. రేణిగుంటలో పట్టుబడ్డ నిందితులు ఇద్దరిలో ఒకరి మానసిక పరిస్థితి బాలేదని పోలీ సులు గుర్తించారు. అయితే వీరి అలవాట్లు, ఎక్కడెక్కడ ఉంటారు, వీరి ముఠా నాయకుడు ఎవరైనా ఉన్నారా, బెయిల్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించే వ్యక్తి ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారిస్తే ఆసక్తికర విషయాలు బయటపడుతాయి. -
'జన్మభూమి'లో టీసీ వీరంగం
రాజమహేంద్రవరం : విధుల్లో ఉన్న ఓ రైల్వే టీసీ (టికెట్ కలెక్టర్) మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అకారణంగా ప్రయాణికులతో దుర్భాషలాడుతూ వారిపై దాడికి దిగాడు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహిస్తున్న టీసీ గంగాప్రసాద్ సోమవారం మద్యం మత్తులో హల్చల్ చేశాడు. ప్రయాణికులతో దుర్భాషలాడటంతో పాటు అకారణంగా కొందరు ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు రాజమహేంద్రవరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గంగా ప్రసాద్‌ను రైల్వే ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
రైలు నుంచి జారిపడి టీసీ మృతి
-
రైలు నుంచి జారిపడి టీసీ మృతి
కమలాపూర్: కరీంనగర్ జిల్లాలో రైల్లో నుంచి జారిపడి ఓ టిక్కెట్ కలెక్టర్(టీసీ) మృతిచెందాడు. కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వేస్టేషన్లో కదులుతున్న ఇంటర్సిటీ రైలు నుంచి టీసీ జారిపడ్డాడు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి చెందిన టీసీని వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన కుమారస్వామిగా గుర్తించారు. ఏడు రోజుల క్రితమే టీసీకి పెళ్లయినట్లు తెలిస్తుంది. ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారాన్ని తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవ వరుడైన కుమారస్వామి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
టీసీ రాగానే ట్రైన్ నుంచి దూకేశాడు..
-
టీసీ రాగానే ట్రైన్ నుంచి దూకేశాడు..
వరంగల్ : టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టిక్కెట్ కలెక్టర్ రాగానే భయంతో రైలులో నుంచి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపానికి కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు రాగానే టీసీ వచ్చాడు. అయితే టిక్కెట్ కొనని దారావత్ రమేష్ తనను టీసీ టిక్కెట్ అడుగుతాడేమోనన్న భయంతో నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. కేసముద్రానికి చెందిన దారావత్ రమేష్ వరంగల్‌లో కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. అయితే అతడు ఫుట్ బోర్డులో కూర్చుని ప్రయాణిస్తున్నాడని అందువల్లనే టిక్కెట్ చూపించే క్రమంలో కిందపడ్డాడని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రమేష్ స్నేహితుడి వాదన మరోలా ఉంది.. తన మిత్రుని వద్ద టిక్కెట్ ఉందని, టిక్కెట్ చూపించే విషయంలో టీసీ తమ వద్ద దుర్భాషలాడారని చెప్పాడు. ట్రైన్లు తక్కువగా ఉండటంతోనే రమేష్ ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ప్రయాణికులు అంటున్నారు. అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
ఇక్కడ టీసీయే ‘మాస్టర్’..!
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే పరిధిలో స్టేషన్ మాస్టర్ల కొరత తీవ్రంగా ఉంది. మెయిన్, హార్బర్ మార్గాల్లో ఉన్న 18 స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ల పనులను టికెట్ కలెక్టర్లే నిర్వహిస్తున్నారు. ఆయా స్టేషన్లలో అత్యవసర సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడానికీ, రోజువారీ పర్యవేక్షణకు స్టేషన్ మాస్టర్ లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ లైన్ స్టేషన్ల అయిన చించ్‌పోక్లీ, కర్రీరోడ్, విద్యావిహార్, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్ల పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఈ స్టేషన్ల నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, హార్బర్‌లైన్ స్టేషన్లు అయిన డాక్‌యార్డ్ రోడ్, కాటన్గ్రీన్, చున్నాబట్టీ, ఖార్గర్ రైల్వే స్టేషన్లలో కూడా స్టేషన్ మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్లలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రయాణికులు మొదట స్టేషన్మాస్టర్నే ఆశ్రయిస్తారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ల పరిధిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ మాస్టర్ కీలకపాత్ర పోషిస్తాడు. ప్రయాణికులకు సహకారం అందించడం, అదేవిధంగా అత్యవసర సమయంలో రైళ్లను నిలిపివేయడం వంటి పనులను నిర్వహిస్తూ ఉంటాడు. రైళ్లు నెమ్మదిగా నడవడం, రైళ్లలో, పట్టాల్లో సాంకేతికపరమైన లోపాలు తలెత్తినప్పుడు అందుకు సంబంధించిన నివేదికను స్టేషన్ మాస్టరే తయారుచేయాల్సి ఉంటుంది. అలాగే రెళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడితే ప్రయాణికుల సౌకర్యార్థం ఆ విషయాన్ని మైక్‌లో అనౌన్స్ చేయిం చాల్సి ఉంటుంది. ఏదైనా ఘటన జరిగితే రైల్వే పోలీసులను వెంటనే అప్రమత్తం చేసే బాధ్యత కూడా స్టేషన్ మాస్టర్దేనని నేషనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ మాజీ సభ్యుడు సుభాష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం టికెట్ క్లర్క్‌లు ఈ విధులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ ఒకరు మాట్లాడుతూ.. స్టేషన్ మాస్టర విధులు నిర్వహిస్తున్న టికెట్ క్లర్క్‌లకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒక వేళ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినా, సాంకేతిక లోపం తలెత్తినా సంబంధించిన రికార్డులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలో బాధితుడిని ఆస్పత్రికి తరలించాలని, అటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో సమీప రైల్వే స్టేషన్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికలను తయారుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుంటారని, దాంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన తెలిపారు. కాగా, రైల్వే పరిపాలన విభాగం స్టేషన్ మాస్టర్లను తగ్గించే ప్రయత్నంలో ఉందని ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రితీష్ దుబే ఆరోపించారు. సబర్బన్ సెక్షన్లో ప్రతి రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. -
రైల్లో నుంచి మహిళను గెంటేసిన టీసీ
జల్గావ్: కదులుతున్న బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ప్రయాణికురాలిని టికెట్ కలెక్టర్ నిర్దాక్షిణ్యంగా గెంటేయటంతో రైలు పట్టాల కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. టీసీ మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. గురువారం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. లోక్మాన్య తిలక్ టెర్మినస్-రాజేంద్రనగర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ రైల్లో ఉజ్వలా పాండే(38) ఏసీ బోగీలోకి ఎక్కేందుకు యత్నించింది. పదేళ్ల కుమార్తె కూడా ఆమె వెంట ఉంది. ఆమె వద్ద జనరల్ టిక్కెట్ ఉండటంతో టీసీ సంపత్ సాలూఖే అడ్డుకున్నాడు. రైలు వేగం పుంజుకుని కదలటంతో ఆందోళన చెందిన ఆమె మరోసారి ఏసీ బోగీలోకి ఎక్కేందుకు యత్నించింది. అయితే టీసీ ఆమెను తోసివేయటంతో కదులుతున్న రైలు కింద పట్టాలపై పడిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు వీడ్కోలు పలికేందుకు స్టేషన్‌కు వచ్చిన మేనల్లుడు దీన్ని చూసి అప్రమత్తం చేయటంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు రైలు బోగీలోని వంటగదిలో నక్కిన టీసీని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. టీసీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్లోంచి తోసేసిన టీసీ.. మహిళ మృతి
కదులుతున్న రైల్లోంచి ఓ ప్రయాణికురాలిని టికెట్ కలెక్టర్ కిందకు తోసేయడంతో.. ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. రైలుపట్టాల పక్కన పడిన ఆమె, అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. దాంతో ఆ టికెట్ కలెక్టర్‌పై కేసు నమోదు చేశారు. టికెట్ కలెక్టర్ ఆ సమయంలో బాగా తాగి ఉన్నాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు. జనతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ఆ మహిళ, అందులో రద్దీగా ఉండటంతో ఏసీ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. రైలు ఎక్కేందుకు ఆమె ప్రయత్నిస్తున్న సమయంలోనే టికెట్ కలెక్టర్ ఆమెను తోసేశాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. -
రైల్వే టీటీఈని కొట్టి చంపిన ఇద్దరు ప్రయాణికులు
ఎమ్మిగనూరు : రైల్లో నీటి కోసం జరిగిన చిన్న వివాదం ముదిరి ఓ రైల్వే టీసీ ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్) మరణానికి దారితీసింది. బుధవారం అర్థరాత్రి 12.45 గంటల సమయంలో కర్నూలు జిల్లా మంత్రాలయం (తుంగభద్ర) రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి షిర్డీకి వెళుతున్న ఈ రైలు (నెం.22601)లో ధర్మవరం నుంచి వాడి ప్రాంతం వరకూ విధుల నిర్వహణ బాధ్యత టీసీ సంజీవయ్య (55)ది. ఏసీ కోచ్‌లో నీరు లేదంటూ రాత్రి 12.30 గంటల సమయంలో పలువురు ప్రయాణికులు టీసీతో వాగ్వాదానికి దిగారు. తుంగభద్ర రైల్వేస్టేషన్లో నీరు తెప్పిస్తానని... అప్పటి వరకు ఓపిక పట్టాలని టీసీ వారికి సూచించారు. రైలు తుంగభద్రకు చేరుకున్న సమయంలో సంజీవయ్య కిందకు దిగి స్టేషన్ లోపలికి వెళుతుండగా కొందరు ప్రయాణికులు మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. దాంతో టీసీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా ధర్మవరం వాసి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులు వంశీకృష్ణ , అమ్రేష్బాబులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే టీటీఈ తమను రూ. కోటి రూపాయిలు డిమాండ్ చేశాడనే నెపంతోనే చంపామాంటూ నిందితులిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చెన్నై-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం