రైలు ప్రయాణికుడిని చితకబాదిన టీటీ.. వీడియో వైరల్‌ | TT Assault Passenger Without Reason In Barauni Lucknow Express | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికుడిని చితకబాదిన టీటీ.. వీడియో వైరల్‌

Published Thu, Jan 18 2024 7:33 PM | Last Updated on Thu, Jan 18 2024 8:00 PM

TT Assault Passenger Without Reason In Barauni Lucknow Express - Sakshi

లక్నో: రైలు ప్రయాణికుడి పట్ల ఓ టీటీ రెచ్చిపోయాడు. విచక్షణ మర్చిపోయి అతడిని దారుణంగా చితకబాదాడు. వారి మధ్య ఏదో వైరం ఉన్నట్టుగా బాధితుడిని కొట్టాడు. ఇక, దీన్నింతా తోటి ప్రయాణికుడు వీడియో తీస్తుండగా అతడితో కూడా వాగ్వాదానికి దిగాడు. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ సదరు టీటీని సస్పెండ్‌ చేసింది. 

వివరాల ప్రకారం.. బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్‌ రైలులో టీటీ రెచ్చిపోయాడు. రైలు ప్రయాణికుడిపై టీటీ భౌతిక దాడికి దిగాడు. రైలులో 25 ఏళ్ల యువకుడు టికెట్‌తో రైలు నంబరు-15203లో ముజఫర్‌పూర్‌ నుంచి లక్నోకు ప్రయాణిస్తుండగా టీటీ దాడికి దిగాడు. ప్రయాణికుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అసలు ఎందుకు దాడి చేశాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా, ప్రయాణికుడు నీరజ్‌ కుమార్‌ టికెట్‌ కూడా తీసుకోవడం గమనార్హం. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే, టీటీ చర్యపై నెటిజన్లతో సహా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లక్నో డివిజన్‌  డీఆర్‌ఎం టీటీని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement