train passenger
-
రైలు ప్రయాణికుడిని చితకబాదిన టీటీ.. వీడియో వైరల్
లక్నో: రైలు ప్రయాణికుడి పట్ల ఓ టీటీ రెచ్చిపోయాడు. విచక్షణ మర్చిపోయి అతడిని దారుణంగా చితకబాదాడు. వారి మధ్య ఏదో వైరం ఉన్నట్టుగా బాధితుడిని కొట్టాడు. ఇక, దీన్నింతా తోటి ప్రయాణికుడు వీడియో తీస్తుండగా అతడితో కూడా వాగ్వాదానికి దిగాడు. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ సదరు టీటీని సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం.. బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్ రైలులో టీటీ రెచ్చిపోయాడు. రైలు ప్రయాణికుడిపై టీటీ భౌతిక దాడికి దిగాడు. రైలులో 25 ఏళ్ల యువకుడు టికెట్‌తో రైలు నంబరు-15203లో ముజఫర్‌పూర్ నుంచి లక్నోకు ప్రయాణిస్తుండగా టీటీ దాడికి దిగాడు. ప్రయాణికుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అసలు ఎందుకు దాడి చేశాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా, ప్రయాణికుడు నీరజ్ కుమార్ టికెట్ కూడా తీసుకోవడం గమనార్హం. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, టీటీ చర్యపై నెటిజన్లతో సహా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లక్నో డివిజన్ డీఆర్ఎం టీటీని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. This video is said to be of Train number 15203 - Barauni Lucknow Express. You can see the ruthless TT is assaulting the poor passenger without any reason. The victim was repeatedly asking what’s his fault but the TT kept on beating him. .@AshwiniVaishnaw, please take immediate… pic.twitter.com/XKNiQhVqiT — Mahua Moitra Fans (@MahuaMoitraFans) January 18, 2024 -
రైల్వే ప్రయాణికుడి వీరంగం
బొబ్బిలి: విశాఖ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ బోగీ మీదకి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఎక్కి కలకలం సృష్టించాడు. శనివారం సాయంత్రం బొకారో ట్రైన్‌ను విజయనగరంలో రన్నింగ్‌లో ఎక్కిన ఒడిశా వాసి పైన ఉండే విద్యుత్ తీగలను అం దుకోబోతుండటాన్ని గొట్లాం స్టేషన్ వద్ద గమనించిన లైన్‌మన్, టోకెన్ పోర్టర్లు స్టేషన్‌కు సమాచారమందించారు. వెంటనే స్టేషన్ సిబ్బం ది ∙బొకారో ట్రైన్ డ్రైవర్లక సమాచారమందించారు. దీంతో డ్రైవర్లు గరుగుబిల్లి వద్ద ట్రైన్‌ను నిలిపివేసి కిందికి దిగమని కేకలు వేశారు. అయినా మత్తు వీడని ప్రయాణికుడు చేతులు మీదికెత్తుతూ కాసేపు హల్చల్ చేశాడు. చివరకు కొందరు మీదికి ఎక్కి మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడ్ని కిందికి నెట్టేశారు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని బొబిŠబ్లి స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఉండడం వల్ల వివరాలు చెప్పలేకపోతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. -
1.5 కి.మీ భుజాలపై మోసి.. ప్రాణాలు కాపాడాడు
-
మొనతేలిన కంకరరాళ్లపై పరుగుపెడుతూ..
హోషంగాబాద్ : పోలీసులంటేనే కఠినాత్ములనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ వారు కూడా మనుషులే... వారికి మానవత్వం ఉందని నిరూపించుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా పగ్ధల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్ బిల్లోరే అనే పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ రైలు కింద నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడిన ఓ ప్రయాణికుడిని దాదాపు రెండు కిలోమీటర్ల మేర భుజంపై మోసుకు వెళ్లి సకాలంలో వైద్యం అందించాడు. ఓవైపు భుజంపై బరువు, మరోవైపు మొనతేలిన కంకరరాళ్లపై పరుగుతీస్తూ ప్రయాణికుడికి సకాలంలో వైద్యం అందించాడు. దీంతో కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. వివరాల్లోకి వెళితే... యూపీకి చెందిన అజిత్ (35) రైలులో ముంబైకి వెళుతుండగా ప్రమాదవశాత్తూ రైలు నుంచి కిందపడిపోయాడు. ప్రయాణికులు హెల్ప్‌లైన్ నంబర్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా కొండ ప్రాంతం కావడంతో అంబులెన్స్ అక్కడకు చేరుకోలేకపోయింది. దీంతో కానిస్టేబుల్ పూనమ్ బిల్లోరే పట్టాలపై పడివున్న అజిత్‌ను భుజాలపైకి ఎత్తుకుని 1.5 కిలోమీటర్ల దూరంలో పగ్ధల్ రైల్వేస్టేషన్‌కు తీసుకు వచ్చాడు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాడు. మరోవైపు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. -
రైలు దిగబోతూ మృత్యు ఒడిలోకి..
కాజీపేట రూరల్ : రాఖీ పండుగకు చెల్లెలి ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి తిరుగుప్రయాణంలో రైలు దిగబోయి ప్లాట్ఫామ్లో సందులో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కాజీపేట జంక్షన్లో మంగళవారం జరిగింది. ఇతడితోపాటు కాజీపేట సబ్‌డివిజన్ రైల్వే జీఆర్పీ పరిధిలో వేర్వేరు చోట్ల మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రైలు ప్రమాదాల్లో మృతిచెందారు. కాజీపేట జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. కాజీపేట దర్గా గాంధీనగర్‌కు చెందిన బాలకృష్ణ(32) హైదరాబాద్‌లోని తన చెల్లెలి ఇంటికి రాఖీ పండుగకు వెళ్లాడు. తిరిగి సోమవారం రాత్రి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుపయనమయ్యాడు. కాజీపేటలో రైలు దిగబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లాడు. దీంతో నడుము వరకు ఒక కాలు తెగింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. రైలు నుంచి జారిపడి ఒకరు.. రైలు ఢీకొని మరొకరు.. కోమటిపెల్లి–హసన్‌పర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తు గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి పొదల్లో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. అతడు 5.7 ఎత్తు, చామన ఛాయ రంగుతో ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్ట లేకుండా ఉంది. అలాగే కోమటిపెల్లి–హసన్‌పర్తి రైల్వేస్టేçÙన్ల మధ్య మరో గుర్తు తెలియని వ్యక్తి(30) ప్రమాదశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గుర్తు పట్టరాకుండా ఉంది. మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. -
అనారోగ్యంతో రైలు ప్రయాణికుడి మృతి
రైల్వే గేట్ : అనారోగ్యంతో రైలు ప్రయాణికుడు మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లా దన్‌సిరియా ప్రాంతానికి చెందిన రాంకృపాల్‌సింగ్(62) పాటలీపుత్ర – యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి వెళ్తున్నాడు. రైలు వరంగల్ సమీపంలోకి చేరుకోగానే అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. రైలు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఆయన భౌతికకాయాన్ని దింపి, పోలీ సులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును హెడ్ కానిస్టేబుల్ ముర ళి దర్యాప్తు చేస్తున్నారు.