రైలు దిగబోతూ మృత్యు ఒడిలోకి..
Published Wed, Aug 24 2016 12:08 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కాజీపేట రూరల్ : రాఖీ పండుగకు చెల్లెలి ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి తిరుగుప్రయాణంలో రైలు దిగబోయి ప్లాట్‌ఫామ్‌లో సందులో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కాజీపేట జంక్షన్‌లో మంగళవారం జరిగింది. ఇతడితోపాటు కాజీపేట సబ్‌డివిజన్ రైల్వే జీఆర్‌పీ పరిధిలో వేర్వేరు చోట్ల మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రైలు ప్రమాదాల్లో మృతిచెందారు. కాజీపేట జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. కాజీపేట దర్గా గాంధీనగర్‌కు చెందిన బాలకృష్ణ(32) హైదరాబాద్‌లోని తన చెల్లెలి ఇంటికి రాఖీ పండుగకు వెళ్లాడు. తిరిగి సోమవారం రాత్రి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుపయనమయ్యాడు. కాజీపేటలో రైలు దిగబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లాడు. దీంతో నడుము వరకు ఒక కాలు తెగింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.
రైలు నుంచి జారిపడి ఒకరు.. రైలు ఢీకొని మరొకరు..
కోమటిపెల్లి–హసన్‌పర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తు గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి పొదల్లో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. అతడు 5.7 ఎత్తు, చామన ఛాయ రంగుతో ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్ట లేకుండా ఉంది.
అలాగే కోమటిపెల్లి–హసన్‌పర్తి రైల్వేస్టేçÙన్ల మధ్య మరో గుర్తు తెలియని వ్యక్తి(30) ప్రమాదశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గుర్తు పట్టరాకుండా ఉంది. మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు.
Advertisement