అనారోగ్యంతో రైలు ప్రయాణికుడి మృతి | train passenger died with sickness | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో రైలు ప్రయాణికుడి మృతి

Published Mon, Aug 15 2016 12:09 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

అనారోగ్యంతో రైలు ప్రయాణికుడు మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

రైల్వే గేట్‌ : అనారోగ్యంతో రైలు ప్రయాణికుడు మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీర్జాపూర్‌ జిల్లా దన్‌సిరియా ప్రాంతానికి చెందిన రాంకృపాల్‌సింగ్‌(62) పాటలీపుత్ర – యశ్వంతాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి వెళ్తున్నాడు. రైలు వరంగల్‌ సమీపంలోకి చేరుకోగానే అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. రైలు వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఆయన భౌతికకాయాన్ని దింపి, పోలీ సులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును హెడ్‌ కానిస్టేబుల్‌ ముర ళి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement