Kazipet junction
-
TS, AP: రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు
సాక్షి, కాజీపేట: రైలు ప్రయాణికులకు అలర్ట్. మౌలాలీ - సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో, ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్(ప్రతీరోజు నడిచే) నుండి రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ వెళ్లే ప్రయాణికులకు పలు రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్ సిటీ(17011/12), కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ (12757/58), సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్(17659/60) పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్(17233/14)ను, సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని తెలిపారు. -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ‘భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ట్రైన్ నంబరు 17233 సికింద్రాబాద్ నుంచి బల్లర్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పదమూడు నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతించుచున్నాం.’ ఇదీ నిత్యం స్టేషన్లలో వినిపించే రైల్వే అధికార ప్రకటనలు. కొంతకాలంగా రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యమవుతూ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఎప్పుడొస్తయో తెలియదు బల్లర్షా నుంచి కాజీపేట మధ్య నడిచే కాజీపేట ఎక్స్‌ప్రెస్, సిర్పూర్టౌన్ నుంచి భద్రాచలంరోడ్డు వరకు వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌లు ఏ రోజూ సమయపాలన పాటించడం లేదు. ఉదయం, సాయంత్ర పూట ఆ యా స్టేషన్లలో ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూ స్తున్నారు. రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక సమ యం వృథా చేసుకుంటున్నారు. దీంతో తమ రోజూ వారి కార్యకలాపాల్లోనూ ప్రభావం చూపుతోంది. ‘భాగ్యనగర్’ రోజూ లేటే! బల్లార్షా నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బల్లార్షా మధ్య రోజూ నడుస్తున్న ట్రైన్లు ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆలస్యంగానే నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి 3.35 గంటలకు బయలుదేరి కాగజ్‌నగర్ వరకు వెళ్లాలంటే రాత్రి ఒకటి, రెండు గంటలవుతోంది. దీంతో మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) వరకు వెళ్లాల్సిన ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. రాత్రి పూట రైలు దిగి ఇంటికి వెళ్ళేందుకు రవాణా సౌకర్యం లేక స్టేషన్లోనే పడుకుని తెల్లారి వెళ్తున్నారు. గతంలో 9 గంటలకే వస్తుండగా ప్రస్తుతం తీవ్ర జాప్యం జరుగుతోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లూ ఆలస్యమే సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్సిటీ, కాగజ్‌నగర్ సూపర్‌పాస్ట్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఏపీ, గ్రాండ్ ట్రంక్, నవజీవన్, చెన్నై సెంట్రల్, రాప్తిసాగర్తో పాటు పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు సైతం గంట, రెండు గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి. అన్ని రైళ్లూ ఆలస్యమేనా? దూరం, దగ్గర అని తేడా లేకుండా చవక, భద్రత, సౌకర్యవంతంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ఎక్కువగా పేద, మధ్య తరగతి వారు రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తారు. అయితే సకాలంలో రైళ్లు స్టేషన్లకు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలలుగా ఇదే తీరుగా ఉండడంతో వివిధ అవసరాల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, సికింద్రాబాద్, విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా నడుస్తున్నాయని మైకుల్లో అనౌన్స్ చేసి అసౌకర్యానికి చింతించుచున్నాం అంటూ చెప్పి రైల్వే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న జిల్లా నుంచి కాజిపేట నుంచి కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ప్రయాణం చేస్తుంటారు. వీరితో పాటు వివిధ అవసరాలకు హైదరాబాద్ రాకపోకలు సాగించేవారు ఉన్నారు. పెరిగిన టికెట్ రేట్లు గతంతో పోలిస్తే టికెట్ల రేట్లు సైతం భారీగా పెరిగాయి. కరోనా ప్రభావంతో సీనియర్ సిటిజన్స్, వివిధ కేటగిరీలకు ఇస్తున్న రాయితీలు సైతం ఎత్తేశారు. ప్యాసింజర్ ట్రైన్ల చోట ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. దీంతో టికెట్ రేట్లు సైతం పెరిగాయి. గతంలో ఉన్న టికెట్ ధరలతో పోలిస్తే రూ.15 నుంచి 20 వరకు పెరిగాయి. -
దేశంలో రైలు ప్రమాదం ఎక్కడ జరిగిన ఆ ప్రభావం కాజీపేట జంక్షన్పైనే...
కాజీపేట రూరల్: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. దేశంలో ఎక్కడైనా రైల్వే వ్యవస్థకు ఆటంకాలు, ప్రమాదాలు జరిగితే ఆ ప్రభావం కాజీపేట జంక్షన్‌పై పడుతుంది. చాలారైళ్లు కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ప్రతి రోజూ 200 వరకు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఎలా జరిగింది.. ఎంతమంది చనిపోయారు, అందులో తెలంగాణ వారు ఎవరైనా.. ఉన్నారా.. ఉమ్మడి జిల్లావాసులు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన పలు రైలు దుర్ఘటనలను జనాలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కాపలాలేని రైల్వేగేట్లు కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో రైల్వేశాఖ కాపలా లేని రైల్వేగేట్లను ఎత్తివేసింది. కాజీపేట–ఆలేరు, వరంగల్ రూట్లో, హసన్‌పర్తి రూట్లో రైల్వే లెవెల్‌క్రాసింగ్ గేట్లు సుమారు 30 వరకు ఉన్నాయి. ఈ గేట్ల వద్ద గేట్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశంతో 160 కేఎంపీహెచ్ స్పీడ్‌తో ఈ రైలు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే గేట్ల స్థానంలో ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించి అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేయగా అధికారులు ప్రతిపాదనల పనిలో నిమగ్నమయ్యారు. టార్గెట్, ఎకనామీ పేరుతో రైల్వే ఉన్నతాధికారులు వర్క్ టార్గెట్, ఎకనామీ, రైల్వే యూనిట్ల ఎత్తివేత, రైళ్ల నిర్వాహణ లోపం, ప్రైవేటీకరణ పేరుతో సిబ్బందిని కుదిస్తూ, తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. పెంచిన రైళ్లకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయడంలో రైల్వే విఫలమవుతోందని అంటున్నారు. ఎల్‌హెచ్‌బీ బోగీలు డేంజర్ ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వేశాఖ ప్రవేశపెట్టి నడిపిస్తోంది. ఈ కోచ్‌లు చాలా తేలికపాటిగా ఉంటాయని, ట్రాక్‌పై త్వరగా వేగం అందుకుంటాయని రైల్వే నాయకులు అంటున్నారు. ఏమైన రైలు ప్రమాదాలు జరిగితే బోగీలు చల్లా చెదురైతాయని చెబుతున్నారు. గతంలో రైలు బోగీలు మందపు ఐరన్‌తో తయారు చేసేవని, ట్రాక్‌పై కావాలి్సన వేగంతో వెళ్లేవని, ప్రమాదాలు జరిగినప్పుడు బోగీల ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదని అంటున్నారు. కోరమండల్ ఘటనలో ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉండడం వల్లే తీవ్రత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు వరంగల్, కాజీపేట జంక్షన్ మీదుగా షాలిమార్–హైదరాబాద్ (18045) ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–షాలిమార్ (18046) ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం రద్దు చేస్తున్నట్లు ప్రకటి ంచినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కోరమండ ల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను విజయవాడ అవతల రూట్లోను ంచి దారి మళ్లించి నడిపిస్తున్నట్లు వారు తెలిపారు. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన రైలు దుర్ఘటనలు 1954 సెప్టెంబర్ 27న జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ వాగులో నిజాముదీ్దన్ (దక్షిణ్) ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోగా 300మంది మృత్యువాత పడ్డారు. 1983లో రాళ్లపేట–ఆసిఫాబాద్ మధ్య తమిళనాడు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 640 మంది చనిపోయారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఘటన స్థలికి చేరుకున్నారు. ► 1986లో మంచిర్యాల–రవీంద్రఖని మధ్య బ్రిడ్జి వంతెన తెగడంతో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 300మంది ప్రయాణికులు మరణించారు. ► వరంగల్ రైల్వేస్టేషన్లో 2003 జూలై 2న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ బ్రేక్‌లు ఫెయిల్యూర్ అయి షాండ్హంప్లోకి దూసుకెళ్లగా కంట్రో ల్ కాక అండర్ బ్రిడ్జి కింద చేపల మార్కెట్‌పై బోగీలు పడ్డాయి. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. 110మంది గాయపడ్డారు. ► 2008 జూలై 31న అర్ధరాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ తాళ్లపూసపలి్ల–కేసముద్రం మధ్య అగ్నిప్రమాదానికి గురై 21మంది మరణించారు. ► 2010లో జమ్మికుంట రైల్వేగేట్‌లో స్కూల్ బస్సును భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో విద్యార్థి మృతిచెందాడు. ► 2006లో ఘన్పూర్– నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య వాగు వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే పెట్రోల్మెన్లు సూర్య, చంద్రంలు అప్రమత్తంగా వ్యవహరించి నిలిపి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. -
చావునోట్లోంచి బయటపడ్డాడు..
సాక్షి, కాజీపేట (వరంగల్): కాజీపేట జంక్షన్లో ఆదివారం రాత్రి ఓ రైల్వే ఉద్యోగి రైలు కిందపడి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కాజీపేట జీఆర్పీ ఎస్సై అశోక్‌కుమార్, రైల్వే కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. డీజిల్ లోకోషెడ్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ అనే రైల్వే కార్మికుడు ఎలక్ట్రిక్ లోకోషెడ్ సమీపంలో రైలు పట్టాలు దాడుతుండగా హైదరాబాద్–విశాఖపట్నం వెళ్లే ప్రత్యేక రైలు కింద పడడంతో ఇంజన్ ముందు భాగం క్యాటిల్ గార్డు పట్టాల మధ్య కంకర రాళ్లపై కొద్ది దూరం వరకు లాక్కెళ్లింది. దీంతో రైలు డ్రైవర్ బ్రేక్ వేసి రైలును ఆపడంతో అక్కడే ఉన్న రైల్వే ఉద్యోగులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు గమనించి రైలు చక్రాలు, పట్టాల మధ్య చిక్కుకున్న రైల్వే కార్మికుడిని బయటికి తీశారు. అనంతరం రైలు వెళ్లింది. కాగా ఈ ఘటనలో కార్మికుడు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నిలిచిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, కాజీపేట : ముంబాయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) చక్రాలకు సాంకేతిక సమస్య తలెత్తి బోల్టుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. దీంతో కాజీపేట జంక్షన్లో ఈ రైలు గంటన్నరపాటు నిలిచిపోయింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాల కారణంగా ఉదయం 10 గంటలకు రావల్సిన కోణార్క్ సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంది. మార్గమధ్యలో ఇంజన్ నుంచి 7వ ఏసీ కోచ్ కింద రెండు చక్రాల మధ్య ఉన్న బోల్డుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. కాజీపేట రైల్వే స్టేషన్లోకి ప్రవేశిస్తున్న క్రమంలో రోలింగ్ ఇన్ క్యారియజ్ అండ్ వ్యాగన్ ఇన్స్పెక్షన్ స్టాఫ్ బోల్డుస్టార్ పగిలిపోయిన విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కాజీపేటలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అధికారులు, సిబ్బంది మరమ్మతు చేసి సాయంత్రం 5.35 గంటలకు పంపించారు. సకాలంలో సీ అండ్ డబ్ల్యూ సిబ్బంది గమనించి చూడటం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. లేదంటే మార్గమధ్యలో పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు. -
ఈసారైనా..
జిల్లా వాసుల ఆశలు పట్టాలెక్కేనా.. కాజీపేట రూరల్ : ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు గేట్వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు ఈ సారి రైల్వే బడ్జెట్లో న్యాయం జరగాలని ఈ ప్రాంత ప్రజలు, రైల్వే కార్మికులు ఆశిస్తున్నారు. కాజీపేట జంక్షన్లో మూడు ఫ్లాట్‌ఫాంలు మాత్రమే ఉన్నాయి. అదనంగా మరో మూడు ప్లాట్‌ఫాంలు కావాలనే డిమాండ్ ఉంది. ఈ బడ్జెట్లో అదనపు ప్లాట్‌ఫాంలు మంజూరైతే రైళ్ల సంఖ్య ఇక్కడి నుంచి పెరగడమే కాకుండా వచ్చిన రైళ్లకు ట్రాఫిక్ అంతరాయం ఉండదు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజులు ఉండదు. జిల్లా నుంచి తిరుమలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజుల పాటు పొడిగించితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఎస్కలేటర్ ఎప్పుడో.. ఈ జంక్షన్ నుంచి ప్రతి రోజు సుమారు 15 వేల మంది ప్రయాణికులు వివిధ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కాజీపేటలో చంటి పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు పుట్ఓవర్ బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి. ఇక్కడ ఎస్కలేటర్ నిర్మాణం జరిగితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ల సామర్థ్యం నిర్వాహణ మరింత పెరిగేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు కావాలని కార్మికులు కోరుతున్నారు. అప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్ అయ్యేనా.. కాజీపేటలో ఆక్ట్ అప్రంటీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గత పదేళ్ల నుంచి డిమాండ్ ఉంది. కాజీపేటలో ఎక్కువ శాతం రైల్వే కార్మికుల పిల్లలు ఐటీఐ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక్కడ అప్రంటీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాజీపేట–బెల్లంపల్లికి పుష్పుల్ వచ్చేనా.. కాజీపేట నుంచి బెల్లంపల్లి వరకు పుష్పుల్ ప్యాసింజర్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పాట్నా ఎక్స్‌ప్రెస్ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు భాగ్యనగర్ వరకు ఒక్క రైలు లేదు. ఈ మధ్యకాలంలో పుష్పుల్ వేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌కు చోటు దొరికేనా.. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ను 2006లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ స్టేషన్ నుంచి ఒక్కటే ప్యాసింజర్ రాకపోకలు చేస్తుంది. ఈ టౌన్ స్టేషన్ మీదుగా న్యూఢిల్లీ–విజయవాడ, హైదరాబాద్ మార్గంలో వందల రైళ్లు రాకపపోకలు సాగిస్తాయి. ఇక్కడ కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పలు రైళ్లకు హాల్టింగ్ లభించేనా.. కాజీపేటలో ఆగకుండా వెళ్తున్న సికింద్రాబాద్–కాకినాడ ఏసీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విశాఖ వెళ్లే దురంతో, సికింద్రాబాద్–విశాఖపట్నం వెళ్లే గరీభ్‌రథ్, సికింద్రాబాద్–గౌహతి వెళ్లే గౌహతి, సికింద్రాబాద్–నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కాజీపేటలో హాల్టింగ్ కల్పించాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. -
రైలు దిగబోతూ మృత్యు ఒడిలోకి..
కాజీపేట రూరల్ : రాఖీ పండుగకు చెల్లెలి ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి తిరుగుప్రయాణంలో రైలు దిగబోయి ప్లాట్ఫామ్లో సందులో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కాజీపేట జంక్షన్లో మంగళవారం జరిగింది. ఇతడితోపాటు కాజీపేట సబ్‌డివిజన్ రైల్వే జీఆర్పీ పరిధిలో వేర్వేరు చోట్ల మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రైలు ప్రమాదాల్లో మృతిచెందారు. కాజీపేట జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. కాజీపేట దర్గా గాంధీనగర్‌కు చెందిన బాలకృష్ణ(32) హైదరాబాద్‌లోని తన చెల్లెలి ఇంటికి రాఖీ పండుగకు వెళ్లాడు. తిరిగి సోమవారం రాత్రి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుపయనమయ్యాడు. కాజీపేటలో రైలు దిగబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లాడు. దీంతో నడుము వరకు ఒక కాలు తెగింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. రైలు నుంచి జారిపడి ఒకరు.. రైలు ఢీకొని మరొకరు.. కోమటిపెల్లి–హసన్‌పర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తు గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి పొదల్లో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. అతడు 5.7 ఎత్తు, చామన ఛాయ రంగుతో ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్ట లేకుండా ఉంది. అలాగే కోమటిపెల్లి–హసన్‌పర్తి రైల్వేస్టేçÙన్ల మధ్య మరో గుర్తు తెలియని వ్యక్తి(30) ప్రమాదశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గుర్తు పట్టరాకుండా ఉంది. మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో 14 కిలోల బంగారం పట్టివేత
వరంగల్(ఖాజీపేట): ఖాజీపేట జంక్షన్లో గురువారం బిస్కెట్ల రూపంలో ఉన్న 14 కిలోల 700 గ్రాముల బంగారాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లు పట్టుకున్నారు. స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని బజ్జూరి బులియన్ దుకాణానికి చెందిన గుమస్తాలు పట్టూరి వీరేశం, ఉపేందర్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ దిగి బయటికి వెళ్తున్నారు. రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా... బ్యాగుల్లో ప్యాకింగ్‌లో ఉన్న రూ.4 కోట్ల విలువ చేసే 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బజ్దూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్లు విచారణలో తేలింది. బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చాలన్‌లో ఉందని, కానీ కాజీపేటలో పటుకున్న బంగారం 14.700 కిలోలు మాత్రమే ఉందన్నారు. పట్టుబడిన బంగారం, కాగితాలలో తేడా ఉండడంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి బంగారంను సీజ్ చేసి పంచనామా చేసి కమర్షియల్ టాక్స్, ఐటీ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. -
రైల్వే రవాణావిస్తరణ చేపట్టాలి
కాజీపేట రూరల్ : తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం గా రైల్వే రవాణా విస్తరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన కాజీపేట జంక్షన్‌ను సందర్శిం చారు. రైల్వే స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో కాజీపేట డిజిల్ లోకోషెడ్ సీనియర్ డీఎంఈ లచ్చిరాంనాయక్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ శివప్రసాద్‌తో సమావేశమయ్యూరు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీబీనగర్-నడికుడ మధ్య, జిల్లాలో జనగాం, పాలకుర్తి, కొడకండ్ల, సూర్యపేట మీదుగా రైల్వే లేన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సికింద్రాబాద్-జనగాం, కాజీపేట-కొత్తగూడెం, కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య సిటీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను ప్రవేశపెట్టాలన్నారు. ఆయన వెంట గంట నరేందర్‌రెడ్డి, కొప్పిరాల కృష్ణ, రైల్వే అధికారులు పి.సుధాకర్, బీఆర్.కుమార్, సజ్జన్‌లాల్, విజయరాజు, ధర్మారాజు, సుధాకర్, ఆర్పిఎప్ సీఐ ఇక్బాల్ అహ్మద్, జీఆర్పీ సీఐలు రాజ్‌గోపాల్, రవికుమార్ ఉన్నారు. -
వరంగల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు
మట్టెవాడ, న్యూస్‌లైన్ : చైన్నై రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం జరిగిన జంట బాంబు పేలుళ్లతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యూరు. వరంగల్ రైల్వేస్టేషన్లో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో మూడు ప్లాట్‌ఫాంలపై తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన సూట్‌కేసులు, ప్రయాణికుల వస్తువులను పరిశీలించారు. అలాగే వెరుుటింగ్ హాళ్లు, ప్రతీ రైలులోని బోగిలన్నీ తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, సూట్‌కేసులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులను కోరారు. ఈ తనిఖీల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు రవికుమార్, హరిబాబు, ఎస్సైలు రవిప్రకాష్, శంకరయ్య, స్టాలిన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేట జంక్షన్లో.. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో గురువారం రైల్వేపోలీసులు తనిఖీలు చేపట్టారు. చెన్నై రైల్వేస్టేషన్లో గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స అధికారులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వేపోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కాజీపేట రైల్వే పప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట రైల్వే డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాజీపేట ఆర్పీఎఫ్ ఏఎస్సైలు చంద్రమౌళి, రాజన్న, ఏడుకొండలు హెడ్‌కానిస్టేబుల్ సర్వర్‌ఖాన్ కాజీపేట జంక్షన్లో అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి విచారించి విడిచిపెట్టారు. పోలీసుల తనిఖీలతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ ఎస్కార్ట్ పోలీసులను అప్రమత్తం చేసినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. -
‘ఖర్గే’ రైలు ఆగేనా..?
రేపు పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ కాజీపేట వ్యాగన్షెడ్కు గ్రీన్‌సిగ్నల్ వస్తుందని ధీమా డివిజన్ ఏర్పాటు, కోచ్‌ఫ్యాక్టరీపై చిగురిస్తున్న ఆశలు కొత్త రైళ్లు, పెండింగ్ లైన్లకుమోక్షం లభిస్తుందా.. కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : ఈసారి రైల్వే బడ్జెట్లోనైనా కాజీపేట జంక్షన్‌కు వరాలు కురుస్తాయని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో పనులకు ప్రస్తుత బడ్జెట్లో మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్‌షెడ్ పనుల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని ఆశలు చిగురి స్తుండగా, కాజీపేట డివిజన్ కేంద్రం ఏర్పాటు, కోచ్‌ఫ్యాక్టరీ మంజూరు, పెండింగ్‌లో ఉన్న రైల్వే లేన్లు, ఆర్ఓబీ, ఆర్యూబీ లకు నిధుల మంజూరుతో పాటు కొత్త రైళ్లను ప్రకటిస్తారనే ధీ మా వ్యక్తమవుతోంది. ఇక రైల్వే కార్మికులు, వారి పిల్లలు కూడా తమకు కేంద్ర మంత్రి వరాలు కురిపిస్తారని ఎదురుచూస్తున్నా రు. కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే 2014-2015 సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను బుధవారం పార్లమంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... ప్రజలు, రైల్వే కార్మికుల్లో ఉన్న ఆశలు, ఎదురుచూస్తున్న అంశాలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. వ్యాగన్‌షెడ్ నిర్మాణం.. 2009-10 రైల్వే బడ్జెట్లో కాజీపేటకు వ్యాగన్‌షెడ్ మంజూరు చేశారు. అయితే, ఆ తర్వాత నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టినా సర్వే, ఇతరత్రా పనుల కోసం అరకొరగానే నిధులు మంజూరు చేయడం, రాష్ట్రప్రభుత్వం తరఫున భూసేకరణలో జాప్యం జరగడం, కోర్టు కేసుల వల్ల వ్యాగన్‌షెడ్ అంశంలో అడుగు ముందుకు పడలేదు. ఈమేరకు ప్రస్తుత ‘ఎన్నికల బడ్జెట్’లో రైల్వే మంత్రి వ్యాగన్‌షెడ్ నిర్మాణంపై దృష్టి సారిస్తారని భావన వ్యక్తమవుతోంది. కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమో.. ప్రధానిగా పీ.వీ.నర్సింహారావు ఉన్న సమయంలో కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని వివిధ కారణాలతో పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాకు తరలించారు. ఇక ఆ తర్వాత ఏటా బడ్జెట్లో రెండు లేదా మూడు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేస్తున్నా జిల్లాకు స్థానం దక్కడం లేదు. ఈసారైనా మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారని రైల్వే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ దేశాలను కలిపే ‘గేట్‌వే’ కాజీపేట జంక్షన్‌ను ప్రత్యేక డివిజన్ ఏర్పాటుచేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాజీపేట సబ్ డివిజన్‌గా కాజీపేట నుంచి నాలుగు పక్కల బల్లార్షా, విజయవాడ, ఆలేరు, కరీంనగర్ వరకు పాల న కొనసాగుతోంది. ఈ పరిధిలో ఏటా కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇతర డివిజన్లలో కంటే కాజీపేట ద్వారా వచ్చే ఆదాయమే అధికమని అధికారులే చెబుతున్నారు. ఇలా అన్ని అర్హతలు ఉన్న కాజీపేటను డివిజన్ కేంద్రంగా మార్చాలనే డిమాండ్ వస్తోంది. కాజీపేట డిప్యూటీ కన్స్ట్రక్షన్ కార్యాలయం పరిధిలో కాజీపేట -విజయవాడ, సికింద్రాబాద్ మూడో లైన్, హసన్‌పర్తి-కరీం నగర్‌కు రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా ఈ బడ్జెట్లో గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని ఆశిస్తున్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆర్వోబీలు, ఆర్యూబీలకు నిధులు మంజూరై పనులు సాగుతాయని, కొ త్త లేన్ల సర్వేకు మోక్షం లభిస్తుందనే ధీమా వ్యక్తమవుతోంది. కాజీపేట, వరంగల్ మీదుగా ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్‌కు కొత్త రైళ్లు వస్తాయని, పద్మావతి, కరీంనగర్-తిరుపతి రైళ్లను వారం పాటు నడిపించేందుకు అనుమతిస్తారని, కాజీపేట మీదుగా వెళ్లే గౌహతి, దురంతో, గరీబ్థ్,్ర షాలీమార్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఏ-1 రైల్వే స్టేషన్లైన కాజీపేట, వరంగల్‌లో ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు మంజూరు చేస్తారని ఎదురుచూస్తున్నారు. అలాగే, కాజీపేట ఫాతిమానగర్ ప్లైవర్ బ్రిడ్జి కింద బైపాస్ లేన్‌లో ట్రయాంగిల్ ప్లాట్‌పాం నిర్మాణానికి 1972లో సర్వే పూర్తికాగా, ఈసారి అనుమతి వస్తుందనే భావనే వ్యక్తమవుతోంది. రైల్వే బడ్జెట్‌పై రైల్వే కార్మికులు, రైల్వేకార్మికుల పిల్లలు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన లాలూప్రసాద్ యాదవ్ కూలీలను గ్యాంగ్మెన్లుగా పర్మినెంట్ చేయగా, మమత బెనర్జీ లార్జెస్ పథకం ప్రవేశపెట్టి గ్రూప్ ‘డి’ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. ఇదేరీతిన మల్లిఖార్జున్ ఖర్గే కూడా వరాలు కురిపిస్తారని ఆయా వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ఇంజిన్ల నిర్వహణ సామర్థ్యానికి సరిపడా సిబ్బంది లేరు. ఈసారి పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా కాజీపేట రైల్వే ఆస్పత్రికి సబ్ డివిజన్ హోదా కల్పించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునికీకరించాలని, రైల్వే పాఠశాలలో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టి నాన్ రైల్వే విద్యార్థుల కోటా పెంచాలని, కాజీపేటకు మంజూరైన 24 బోగీల ఫిట్లేన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో పీఓహెచ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, కాజీపేట నుంచి బెల్లంపెల్లి వరకు పుష్పుల్ నడిపించాలనే డిమాండ్లు కొన్నేళ్లుగా ఉన్నాయి. వీటన్నింటినీ ఈసారి రైల్వే బడ్జెట్లో మంత్రి మంజూరు చేస్తారని అన్ని వర్గాల వారు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా జిల్లా నుంచి లోక్‌సభ, రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకులు దృష్టి సారిస్తేనే ప్రజలు ఆశలు నెరవేరుతాయనడంలో సందేహం లేదు. -
వెయిటింగ్ చాలు... కన్ఫర్మ్ చేయండి
కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలి * ‘వ్యాగన్’ పనులు ప్రారంభించాలి * కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడే పెట్టాలి * రైల్వే మంత్రికి మన ఎంపీల ప్రతిపాదనలు * బడ్జెట్ తయారీలో రైల్వేశాఖ సాక్షి, హన్మకొండ: 2014-15 రైల్వే బడ్జెట్‌కు ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. కొత్త పనుల ప్రతిపాదనలను ఎంపీల నుంచి ఇప్పటికే స్వీకరించింది. రైల్వే శాఖకు సంబంధించి తమ నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపించాలని మన ఎంపీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు ‘డివిజన్ హోదా’ ఇవ్వడంతో పాటు వ్యాగన్ వర్క్ షాప్ పనులను వెంటనే ప్రారంభించాలని రైల్వేమంత్రికి విన్నవించారు. కొత్తమార్గాల నిర్మాణం, కొత్తరైళ్లను కేటాయించాలని కోరారు. దీంతో పాటు కాజీపేట స్టేషన్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని ప్రతిపాదించారు. ఇంతేకాకుండా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ బిల్లులో పేర్కొన్న కోచ్‌ఫ్యాక్టరీని కాజీపేటకే కేటాయించేలా ఒత్తిడి తీసుకొస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. మన ఎంపీలు ఈ ప్రయత్నాల్లో ఉండగా.. మరోవైపు గుల్బర్గాను డివిజన్‌గా చేయాలంటూ కర్ణాటకకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రయత్నా లు ముమ్మరం చేశారు. దీంతో పోటీ రసవత్తరం గా మారింది. ఈసారి కాజీపేటకు డివిజన్ హో దా, కోచ్‌ఫ్యాక్టరీ, కొత్తరైళ్లు వంటి ప్రధాన డిమాం డ్లలో ఎన్ని ఆమోదం పొందుతాయో వేచి చూడాలి. కాజీపేటలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి : రాపోలు ఆనంద భాస్కర్, ఎంపీ స్టేషన్‌ఘన్‌పూర్-పాలకుర్తి-సూర్యాపేట-నల్లగొండ వరకు కొత్తరైల్వే లైన్ నిర్మించాలి. కాజీపేట కేంద్రంగా ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న కాజీపేట జంక్షన్‌ను 1905లో నిర్మించారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా అభివృద్ధి చేయాలి. గత బడ్జెట్లో మంజూరైన వ్యాగన్ వర్కుషాప్ పనులు సత్వరమే ప్రారంభించాలి. రైల్వే పరంగా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర సాంకేతిక విభాగాలలో ఉన్న ఉద్యోగుల శిక్షణా కేంద్రం విజయవాడలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున కాజీపేటలో మరొక శిక్షణా కేంద్రం అవసరం ఉంది. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలి: సిరిసిల్ల రాజయ్య, ఎంపీ గతంలో కాజీపేటకు మంజూరైన రైల్‌కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్‌కు తరలిపోయింది. కాబట్టి తిరిగి కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కో రతాను. అంతేకాకుండా కాజీపేట కేంద్రంగా కొ త్త రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలి. గతంలో సర్వే చేపట్టిన హసన్‌పర్తి-కరీంనగర్, మణుగూరు-రామగుండంల మధ్య కొత్త రైల్వే మార్గాలు నిర్మించాలి. కాజీపేట స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు ఏర్పాటు చేయాలి. రైల్వే ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో కొత్తగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పా టు చేయాలి. అదే విధంగా వరంగల్, కాజీపేటలో మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్‌లను నిర్మించాలి. కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలి : గుండు సుధారాణి, ఎంపీ ఉత్తర, దక్షిణ భారతానికి వారధిగా ఉన్న కాజీపేట కేంద్రంగా ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సికింద్రాబాద్ తర్వాత రెండో పెద్ద స్టేషన్ అయిన కాజీపేటలో డివిజన్ ను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేయవచ్చు. అంతేకాకుండా కాజీపేట కేంద్రంగా దేశంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా రైళ్లను ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా ఇక్కడ పిట్లైన్లు, ఫ్లాట్ఫారమ్ల సంఖ్య పెంచా లి. వీటితో పాటు వ్యాగన్ వర్కుషాప్‌కు సంబంధించి భూ కేటాయింపునకు నిధులు మంజూరయ్యాయి కాబట్టి పనులు వేగవంతం చేయాలి. కాజీపేటలోని రైల్వే ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి.