కాజీపేట రూరల్: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. దేశంలో ఎక్కడైనా రైల్వే వ్యవస్థకు ఆటంకాలు, ప్రమాదాలు జరిగితే ఆ ప్రభావం కాజీపేట జంక్షన్‌పై పడుతుంది. చాలారైళ్లు కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ప్రతి రోజూ 200 వరకు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి.
ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఎలా జరిగింది.. ఎంతమంది చనిపోయారు, అందులో తెలంగాణ వారు ఎవరైనా.. ఉన్నారా.. ఉమ్మడి జిల్లావాసులు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన పలు రైలు దుర్ఘటనలను జనాలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
కాపలాలేని రైల్వేగేట్లు
కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో రైల్వేశాఖ కాపలా లేని రైల్వేగేట్లను ఎత్తివేసింది. కాజీపేట–ఆలేరు, వరంగల్ రూట్‌లో, హసన్‌పర్తి రూట్‌లో రైల్వే లెవెల్‌క్రాసింగ్ గేట్లు సుమారు 30 వరకు ఉన్నాయి. ఈ గేట్ల వద్ద గేట్‌మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశంతో 160 కేఎంపీహెచ్ స్పీడ్‌తో ఈ రైలు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే గేట్ల స్థానంలో ఆర్‌యూబీ నిర్మాణాలు చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించి అన్ని రైల్వే జోన్‌లకు ఆదేశాలు జారీ చేయగా అధికారులు ప్రతిపాదనల పనిలో నిమగ్నమయ్యారు.
టార్గెట్, ఎకనామీ పేరుతో
రైల్వే ఉన్నతాధికారులు వర్క్ టార్గెట్, ఎకనామీ, రైల్వే యూనిట్ల ఎత్తివేత, రైళ్ల నిర్వాహణ లోపం, ప్రైవేటీకరణ పేరుతో సిబ్బందిని కుదిస్తూ, తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. పెంచిన రైళ్లకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయడంలో రైల్వే విఫలమవుతోందని అంటున్నారు.
ఎల్‌హెచ్‌బీ బోగీలు డేంజర్
ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వేశాఖ ప్రవేశపెట్టి నడిపిస్తోంది. ఈ కోచ్‌లు చాలా తేలికపాటిగా ఉంటాయని, ట్రాక్‌పై త్వరగా వేగం అందుకుంటాయని రైల్వే నాయకులు అంటున్నారు. ఏమైన రైలు ప్రమాదాలు జరిగితే బోగీలు చల్లా చెదురైతాయని చెబుతున్నారు. గతంలో రైలు బోగీలు మందపు ఐరన్‌తో తయారు చేసేవని, ట్రాక్‌పై కావాలి్సన వేగంతో వెళ్లేవని, ప్రమాదాలు జరిగినప్పుడు బోగీల ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదని అంటున్నారు. కోరమండల్ ఘటనలో ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉండడం వల్లే తీవ్రత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
వరంగల్, కాజీపేట జంక్షన్ మీదుగా షాలిమార్–హైదరాబాద్ (18045) ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–షాలిమార్ (18046) ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం రద్దు చేస్తున్నట్లు ప్రకటి ంచినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కోరమండ ల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను విజయవాడ అవతల రూట్‌లోను ంచి దారి మళ్లించి నడిపిస్తున్నట్లు వారు తెలిపారు.
కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన రైలు దుర్ఘటనలు
1954 సెప్టెంబర్ 27న జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ వాగులో నిజాముదీ్దన్ (దక్షిణ్) ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోగా 300మంది మృత్యువాత పడ్డారు.
1983లో రాళ్లపేట–ఆసిఫాబాద్ మధ్య తమిళనాడు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 640 మంది చనిపోయారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఘటన స్థలికి చేరుకున్నారు.
► 1986లో మంచిర్యాల–రవీంద్రఖని మధ్య బ్రిడ్జి వంతెన తెగడంతో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 300మంది ప్రయాణికులు మరణించారు.
► వరంగల్ రైల్వేస్టేషన్‌లో 2003 జూలై 2న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ బ్రేక్‌లు ఫెయిల్యూర్ అయి షాండ్‌హంప్‌లోకి దూసుకెళ్లగా కంట్రో ల్ కాక అండర్ బ్రిడ్జి కింద చేపల మార్కెట్‌పై బోగీలు పడ్డాయి. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. 110మంది గాయపడ్డారు.
► 2008 జూలై 31న అర్ధరాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ తాళ్లపూసపలి్ల–కేసముద్రం మధ్య అగ్నిప్రమాదానికి గురై 21మంది మరణించారు.
► 2010లో జమ్మికుంట రైల్వేగేట్‌లో స్కూల్ బస్సును భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో విద్యార్థి మృతిచెందాడు.
► 2006లో ఘన్‌పూర్– నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య వాగు వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే పెట్రోల్‌మెన్లు సూర్య, చంద్రంలు అప్రమత్తంగా వ్యవహరించి నిలిపి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment