సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల జరిగిన ఘోర రైల్వే ప్రమాదం వంటిదే ఢిల్లీ–హైదరాబాద్ రైల్వే మార్గంలో జరగబోతోందంటూ ఓ ఆగంతకుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. బాలాసోర్‌లో ఒక గూడ్స్ రైలు, రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొని వందల మంది చనిపోవడం, ఆ ప్రమాదం వెనుక విద్రోహ చర్య కూడా ఉండే అవకాశంపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండటం తెలిసిందే.
ఈ క్రమంలో అదే తరహా మరో ప్రమాదం జరగబోతోందంటూ నాలుగైదు రోజుల కింద వచ్చిన లేఖతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ–హైదరాబాద్ మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థలను, ట్రాక్ పరిస్థితిని తనిఖీ చేస్తున్నారు. ప్రతి రైలును క్షుణ్నంగా తనిఖీ చేయాలని, సిబ్బంది అంతా జాగ్రత్తగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశించారు. ఇక రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు సదరు లేఖ ఎక్కడి నుంచి వచ్చిది, ఎవరు రాశారన్నది తేల్చేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
చదవండి: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..
Comments
Please login to add a commentAdd a comment