Delhi-Hyderabad
-
‘బాలాసోర్’లా త్వరలో ఘోర రైలు ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల జరిగిన ఘోర రైల్వే ప్రమాదం వంటిదే ఢిల్లీ–హైదరాబాద్ రైల్వే మార్గంలో జరగబోతోందంటూ ఓ ఆగంతకుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. బాలాసోర్‌లో ఒక గూడ్స్ రైలు, రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొని వందల మంది చనిపోవడం, ఆ ప్రమాదం వెనుక విద్రోహ చర్య కూడా ఉండే అవకాశంపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో అదే తరహా మరో ప్రమాదం జరగబోతోందంటూ నాలుగైదు రోజుల కింద వచ్చిన లేఖతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ–హైదరాబాద్ మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థలను, ట్రాక్ పరిస్థితిని తనిఖీ చేస్తున్నారు. ప్రతి రైలును క్షుణ్నంగా తనిఖీ చేయాలని, సిబ్బంది అంతా జాగ్రత్తగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశించారు. ఇక రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు సదరు లేఖ ఎక్కడి నుంచి వచ్చిది, ఎవరు రాశారన్నది తేల్చేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే.. -
SpiceJet: ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్‌లో వికృత చేష్టలు?!
ఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన ఘటన మరిచిపోక ముందే.. మరో ప్రయాణికుడి వికృత చేష్టల వ్యవహారం?! వెలుగు చూసింది. ఢిల్లీ-హైదరాబాద్‌కు చెందిన స్పైస్‌జెట్ విమానంలో ఇవాళే(సోమవారం) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్ విమానం ఎస్జీ-8133.. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో ఓ ప్యాసింజర్ క్యాబిన్ సిబ్బందిలోని ఓ యువతితో అనుచితంగా ప్రవర్తించాడు.యువతిని అసభ్యంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆ యువతికి మద్ధతుగా వచ్చారు. కాసేపటికి ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్, సెక్యూరిటీ స్టాఫ్‌కు సిబ్బంది తెలియజేశారు. దీంతో.. ఆ ప్రయాణికుడిని, అతనితో ఉన్న మరో ప్యాసింజర్‌ను దించేశారు. వారిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్లు స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుడి నుంచి క్షమాపణ పత్రం తీసుకున్నప్పటికీ.. వ్యవహారం ముదరకుండా ఉండేందుకు వాళ్లను దించేసినట్లు తెలుస్తోంది. అయితే తోటి ప్రయాణికుల్లో కొందరు మాత్రం అది కావాలని జరిగిన ఘటన కాదని, ఇరుకుగా ఉండడంతో పొరపాటున తగిలాడనని చెప్తుండడం గమనార్హం. #WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV — ANI (@ANI) January 23, 2023 -
ఢిల్లీ-హైదరాబాద్ రూట్లో మార్చి 1 నుంచి విస్తార సర్వీసులు
న్యూఢిల్లీ: విస్తార ఎయిర్‌లైన్స్ తన విమాన సర్వీసులను విస్తరిస్తోంది. మార్చి 1 నుంచి ఢిల్లీ-హైదరాబాద్ రూట్లో రోజుకు రెండు విమాన సర్వీసులను నడపనున్నామని విస్తార సీఈఓ ఫీ టీక్ యో పేర్కొన్నారు. అలాగే వచ్చే నెల 20 నుంచి గోవాకు విమాన సర్వీసులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కంపెనీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి విమాన సర్వీసులను ఈ నెల నుంచే ప్రారంభించింది. ప్రస్తుతం వారానికి 68 సర్వీసులను నడుపుతున్నామని, వీటిని 164కు పెంచనున్నామని యో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ మూడు ఎయిర్‌బస్ 320 విమానాలను నడుపుతోంది. మార్చి కల్లా ఈ సంఖ్యను ఐదుకు పెంచనున్నది. జెట్ ఎయిర్వేస్ రిపబ్లిక్ డే ఆఫర్లు న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ తన గల్ఫ్ భాగస్వామి ఎతిహద్తో కలిసి రిపబ్లిక్ డే సందర్భంగా విమాన చార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. శనివారం నుంచి 3 రోజులపాటు టికెట్ ధరల్లో 25% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ టికెట్లతో దేశీయ రూట్లలో మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంతర్జాతీయ రూట్లలో ఫిబ్రవరి 1 నుంచి ప్రయాణించవచ్చని పేర్కొంది.ఈ ఆఫర్లు ఇండియా నుంచి యూఎస్, యూరప్, మధ్య తూర్పు ప్రాంతాలకు ఉన్న ఎతిహద్ విమాన సర్వీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.