అమీర్ ఖాన్ అద్దెంటి బయట పోలీస్ కాపలా
ఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ ఇంటికి సోమవారం సీల్ వేసింది దర్యాప్తు సంస్థ. అదే టైంలో బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్‌తో అమీర్‌ఖాన్ అనే పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ఘటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధికారులు తాళం గమనించాక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది.
అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు.
భారతీయ రైల్వేస్‌లో జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ పని ఏంటంటే.. పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తును చూసుకుటారు. రైలు సేవలను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి.
ఎవరీ జేఈ అమీర్ ఖాన్
ఈ ఉదయం నుంచి ట్విటర్‌లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సోరోలో అన్నపూర్ణ రైలు మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా ఘోర ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసింది సీబీఐ. అతని స్వస్థలం ఏంటి? నేపథ్యం ఏంటన్న విషయాలనూ సీబీఐ వెల్లడించడం లేదు.
ఇదీ చదవండి: పోస్ట్‌మార్టం చేస్తుండగా.. గుండె కొట్టుకుంది!
Comments
Please login to add a commentAdd a comment