signal system
-
ఒడిశా దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్
ఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ ఇంటికి సోమవారం సీల్ వేసింది దర్యాప్తు సంస్థ. అదే టైంలో బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్‌తో అమీర్‌ఖాన్ అనే పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ఘటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధికారులు తాళం గమనించాక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. భారతీయ రైల్వేస్‌లో జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ పని ఏంటంటే.. పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తును చూసుకుటారు. రైలు సేవలను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరీ జేఈ అమీర్ ఖాన్ ఈ ఉదయం నుంచి ట్విటర్లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సోరోలో అన్నపూర్ణ రైలు మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా ఘోర ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసింది సీబీఐ. అతని స్వస్థలం ఏంటి? నేపథ్యం ఏంటన్న విషయాలనూ సీబీఐ వెల్లడించడం లేదు. ఇదీ చదవండి: పోస్ట్‌మార్టం చేస్తుండగా.. గుండె కొట్టుకుంది! -
సిగ్నల్ రాంగ్ రూట్
భువనేశ్వర్: ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొని 275 మంది ప్రాణాలు బలైపోయిన తర్వాత మన దేశంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. మూడు నెలల ముందే సిగ్నల్ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ ఒకటి మీడియాకి చిక్కింది. సిగ్నల్ వ్యవస్థలో లోపాలు వెంటనే సవరించకపోతే భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఖాయమంటూ ఆ చీఫ్ మేనేజర్ రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతూ ఫిబ్రవరి 9న లేఖ రాశారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగుళూరు నుంచి న్యూఢిల్లీకి వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారీ ప్రమాదానికి గురై ఉండాల్సిందని డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ముప్పు తప్పిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో మెయిన్ లైన్ ద్వారా వెళ్లవచ్చునని డ్రైవర్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా సిగ్నల్ వచ్చినప్పుడు పట్టాల దగ్గర ఉండే పాయింట్ మారాలి. రైలుని ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌కి మళ్లించడాన్ని పాయింట్ అంటారు. అయితే సిగ్నల్, పాయింట్ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దీనిని గమనించిన డ్రైవర్ సరైన సమయంలో రైలుని ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థని సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల ముంచుకొచ్చిన ప్రమాదం ఇదని ఆయన ఆ లేఖలో వివరించారు. సిగ్నలింగ్ సాంకేతిక వ్యవస్థపై సమగ్రమైన విచారణ జరపడమే కాకుండా, స్టేషన్ మాస్టర్లు, ట్రాఫిక్ ఆఫీసర్లు, ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్లపై దీనిపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు. సిగ్నల్ వ్యవస్థని నిరంతరం పర్యవేక్షిస్తూ వెనువెంటనే లోపాలు సరిదిద్దుకోకపోతే ఘోరమైన ప్రమాదాలు చూస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. -
సిగ్నల్ లోపం వల్లే...!
సిగ్నల్ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. ‘‘కోరమండల్ మొదటి మెయిన్ లైన్లోంచి లూప్ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్ లైన్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే... ► సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహనగా స్టేషన్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగింది. ► ఈ స్టేషన్ వద్ద రెండు మెయిన్ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్ లైన్లున్నాయి. ► పాసింజర్ హాల్ట్ స్టేషన్ గనుక ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్‌లను లూప్ లైన్లకు తరలిస్తారు. ► శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్ ముందుగా స్టేషన్ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్ వస్తుండటంతో గూడ్స్‌ను లూప్లైన్కు మళ్లించారు. ► కోరమండల్ వెళ్లాల్సిన మెయిన్ లైన్‌పై అప్పటికి రెడ్ సిగ్నల్ ఉంది. స్టేషన్ సిబ్బంది 17ఏ స్విచ్ నొక్కి దాన్ని గ్రీన్‌గా మార్చాలి. కానీ ఆ స్విచ్‌ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్ లూప్లైన్లోకి మళ్లి గూడ్స్‌ను ఢీకొట్టింది. ► గూడ్స్‌ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్ కోచ్‌లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్‌లైన్‌పైకి వెళ్లాయి. ► అదే సమయంలో ఆ లైన్లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలపై కోరమండల్ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ► హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది. ► సూపర్ ఫాస్ట్ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. ► ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
ఇక ట్రాఫిక్ కష్టాలకు చెల్లు.. ‘గూగుల్’ సాయంతో దూసుకెళ్లడమే!
బెంగళూరు: పెరిగిపోతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలు సైతం పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటాం. అయితే.. ఆ సమస్యలకు చెక్ పెట్టనున్నారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. అందుకోసం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ సాయంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. అదేలా అంటారా?. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను త్వరలోనే గూగుల్‌తో అనుసంధానిస్తామని, దాని ద్వారా పెద్ద మార్పు రాబోతోందని పేర్కొంటున్నారు ఉన్నతాధికారులు. రోడ్లపై భారీగా వాహనాలతో ట్రాఫిక్‌ను నియంత్రించటం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ట్రాఫిక్‌ను సులభంగా నియంత్రించి, కష్టాలను తీర్చేందుకు సాంకేతిక దిగ్గజం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీసులు గూగుల్‌తో నేరుగా చేతులు కలపటం దేశంలోనే తొలిసారిగా పేర్కొన్నారు బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. ‘నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించి, ఇబ్బందులు తప్పించేందుకు గూగుల్‌తో చేతులు కలపటం చాలా గర్వంగా ఉంది. ఇది లక్షల మంది ప్రయాణికులు రోజువారీ జీవనంపై సానుకూలు ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే ట్రాఫిక్ లైట్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేసే పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించాం. అది సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ టైమ్‌ను చాలా వరకు తగ్గించింది. నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యకు గూగుల్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాము. కృత్రిమ మేథా ద్వారా నగరంలోనే ట్రాఫిక్ ను అంచనా వేసి పోలీసుకు సమాచారం ఇస్తుంది గూగుల్. దాంతో కొత్త ప్లాన్‌ను అమలు చేస్తాం. ఇప్పటికే గూగుల్ ఇచ్చిన డేటా ప్రకారం.. ఇప్పటికే సుమారు 20శాతం వెయిటింగ్ టైమ్ తగ్గింది. సమయం తగ్గటమే కాదు.. ఇంధనాన్ని ఆదా చేస్తుంది, నగరంలో అనవసరం ట్రాఫిక్ జామ్‌లను నియంత్రిస్తుంది.’ అని పేర్కొన్నారు. బెంగళూరు నగరంలో కోటికిపైగా వాహనాలు ఉన్నాయి. త్వరలోనే అన్ని సిగ్నల్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేస్తామన్నారు కమిషనర్. రహదారులపై ట్రాఫిక్ వివరాలను రియల్ టైమ్‌లో గూగుల్ అందిస్తుందని, ఆ సమచారాన్ని ప్రయాణికులకు అందించటం వల్ల ఇబ్బందులు తప్పుతాయన్నారు. అలాగే.. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్స్‌ను ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ఓవర్ స్పీడ్లను కట్టడి చేయవచ్చన్నారు. ఇదీ చదవండి: Kochi: మొదట బుల్లెట్.. ఇప్పుడు బస్! స్టీరింగ్ ఏదైనా ‘లా’గించేస్తుంది! -
డ్రైవర్ లేకుండానే రైలు కదలడంతో..
పళ్లిపట్టు(తమిళనాడు): యార్డులో ఆగి ఉన్న రైలు డ్రైవర్ లేకుండానే కదిలి కాస్త దూరం వెళ్లి పట్టాలు తప్పి ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ కారణంగా సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు గంటన్నరపాటు రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఈ ఘటన తమిళనాడులోని అరక్కోణంలో చోటుచేసుకుంది. అరక్కోణం జంక్షన్ రైల్వేస్టేషన్ యార్డులో శనివారం రాత్రి చెన్నై విద్యుత్ రైలు యార్డులో ఆగి ఉంది. ఆదివారం వేకువజామున అకస్మాత్తుగా ఈ రైలు కదిలి దాదాపు 500 మీటర్ల దూరం వెళ్లి పట్టాలు తప్పి ఆగింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలోని సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ఈ కారణంగా అరక్కోణం మార్గంలో వెళ్లే మంగళూరు మెయిల్, ఆళప్పుయా, కాచిగూడ, కావేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నాలుగు విద్యుత్ రైళ్లకు దాదాపు ఒకటిన్నర గంట పాటు అంతరాయం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.