పళ్లిపట్టు(తమిళనాడు): యార్డులో ఆగి ఉన్న రైలు డ్రైవర్ లేకుండానే కదిలి కాస్త దూరం వెళ్లి పట్టాలు తప్పి ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ కారణంగా సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు గంటన్నరపాటు రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఈ ఘటన తమిళనాడులోని అరక్కోణంలో చోటుచేసుకుంది.
అరక్కోణం జంక్షన్ రైల్వేస్టేషన్ యార్డులో శనివారం రాత్రి చెన్నై విద్యుత్ రైలు యార్డులో ఆగి ఉంది. ఆదివారం వేకువజామున అకస్మాత్తుగా ఈ రైలు కదిలి దాదాపు 500 మీటర్ల దూరం వెళ్లి పట్టాలు తప్పి ఆగింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలోని సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ఈ కారణంగా అరక్కోణం మార్గంలో వెళ్లే మంగళూరు మెయిల్, ఆళప్పుయా, కాచిగూడ, కావేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నాలుగు విద్యుత్ రైళ్లకు దాదాపు ఒకటిన్నర గంట పాటు అంతరాయం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ లేకుండానే రైలు కదలడంతో..
Published Sun, Jul 10 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM
Advertisement