
లక్నో: సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం(ఆగస్టు17) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్‌లో రైలు పెద్ద రాయిని గుద్దుకోవడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ రూట్‌లో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు.

Comments
Please login to add a commentAdd a comment