sabarmati express
-
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్‌ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్‌కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్‌ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ ప్రెస్..
-
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
లక్నో: సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం(ఆగస్టు17) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్లో రైలు పెద్ద రాయిని గుద్దుకోవడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ రూట్లో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు. -
‘గోద్రా రైలు దహనం’ షూటింగ్
వడోదరా: ప్రస్తుతం దేశంలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వడోదరాలో జరుగుతుంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002 ఫిబ్రవరి 27న దుండగులు గోద్రా వద్ద సబర్మతి రైలులో బోగీలకు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది కరసేవకులే ఉన్నారు. దీంతో గుజరాత్లో అలర్లు చెలరేగాయి. ఆ అలర్లలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దీనికి సంబంధించి మోదీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ గోద్రా రైలు ప్రమాద ఘటననే మోదీ బయోపిక్ చిత్ర బృందం తెరకెక్కిస్తుంది. ఆదివారం రోజున వడోదరాలోని ప్రతాప్ నగర్, దోబి రైల్వే లైన్ మధ్యలో గోద్రా రైలు దహనం సీన్‌ను షూట్ చేశారు. పశ్చిమ రైల్వేస్, వడోదరా అగ్నిమాపక విభాగం అనుమతితో ఈ షూటింగ్ చేపట్టినట్టు నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. షూటింగ్ కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని తెలిపారు. చిత్రీకరణ కోసం ఉపయోగించిన బోగి నిరూపయోగమైందని పేర్కొన్నారు. వివేక్ ఒబ్రాయ్ మోదీ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సరబ్జీత్, మేరికోమ్ బయోపిక్‌లకు దర్శకత్వం వహించిన ఓమంగ్ తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో మనోజ్ జోషి, బొమన్ ఇరానీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదల చేయనున్నారు. -
గోధ్రా అనంతర అల్లర్లు: నిందితులంతా నిర్దోషులే
గోధ్రా అనంతర అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 26 మందీ నిర్దోషులేనని గాంధీనగర్ కోర్టు తీర్పు చెప్పింది. వారిపై తగిన సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. కోర్టు వదిలిపెట్టినవారిలో కలోల్ నాగరిక్ సహకారీ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ గోవింద్ పటేల్ కూడా ఉన్నారు. నిందితులంతా చాలా కాలం నుంచి బెయిల్ మీద విడుదలై ఉన్నారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోధ్రా రైల్వేస్టేషన్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టిన తర్వాత, ఆ మర్నాడు.. అంటే 28వ తేదీన గాంధీనగర్ జిల్లాలోని కలోల్ తాలూకా పాలియాడ్ గ్రామంలో మైనారిటీలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేసి, అక్కడ దోపిడీ, దారుణాలు చేశారన్న కేసులో ఈ 26 మంది నిందితులుగా ఉన్నారు. ఆరోజు మొత్తం 250 మందితో కూడిన గుంపు ఒకటి ఆ ప్రాంతంపై దాడి చేసి దర్గాలో కొంత భాగాన్ని కూడా ధ్వంసం చేసిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో అరోపించారు. కలోల్ అదనపు జిల్లా జడ్జి బీడీ పటేల్ ఈ కేసులో తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షులంతా తాము నిందితులను గుర్తించలేమని చెప్పడంతో కేసును రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవని జడ్జి చెప్పారు. పైగా, ఇప్పటికే నిందితులతో రాజీకి వచ్చినందున తమకు ఎవరిపైనా కోపం లేదని కూడా వాళ్లు కోర్టుకు తెలిపారు. మతసామరస్యాన్ని సాధించే ప్రయత్నాలలో భాగంగా నిందితులు ఇప్పటికే మైనారిటీలకు తగిన నష్టపరిహారం చెల్లించారని డిఫెన్సు న్యాయవాది భవేష్ రావల్ కోర్టుకు తెలిపారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టడంతో ఆరోజు ఎస్-6 బోగీలో ఉన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో గుజరాత్లో భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వాటిలో మైనారిటీ వర్గానికి చెందిన దాదాపు వెయ్యి మంది వరకు మరణించారు. -
సత్వర న్యాయం కీలకం
దేశ ప్రజలనే కాదు...యావత్ ప్రపంచాన్నీ దిగ్భ్రమపరిచిన 2002నాటి గుజరాత్ మారణకాండకు సంబంధించిన కేసుల్లో ఒకటైన గుల్బర్గ్ సొసైటీ కేసులో 11మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ...మరో 13మందికి వేర్వేరు రకాల శిక్షలు విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎంతమంది దోషులుగా తేలారో వెల్లడిస్తూ న్యాయస్థానం మొన్న రెండో తేదీన తీర్పునిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న మరో 36మంది నిర్దోషులని భావించి విడుదల చేసింది. శిక్షల ఖరారును శుక్రవారం ప్రకటించింది. గోధ్రాలో 2002లో సబర్మతీ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 58మందిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశాక ఆ రాష్ట్రమంతటా వ్యాపించిన మారణకాండ దాదాపు పదిహేను వందల మందిని బలితీసుకుంది. వీరిలో అత్యధికులు ముస్లింలు. కొన్ని రోజులపాటు సాగిన ఆ ఊచకోతను పౌర, పోలీస్ యంత్రాంగం నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోవ డమే కాక...పరోక్షంగా ప్రోత్సాహం కూడా అందించిందని ఆరోపణలొచ్చాయి. ఈ మారణకాండకు సంబంధించి నమోదైన అనేక కేసుల్లో తొమ్మిది సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. వాటిల్లో ఇంతవరకూ 8 కేసుల్లో తీర్పు వెలువడింది. అందులో గుల్బర్గ్ సొసైటీ మారణకాండ కేసు ఒకటి. ఆ ఉదంతంలో 69మంది ముస్లింలు సజీవదహనమయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎషాన్ జాఫ్రీ అందులో ఒకరు. ఇప్పుడు శిక్ష పడిన 24మందిని కలుపుకుంటే గుజరాత్ మారణకాండకు సంబం ధించిన వివిధ కేసుల్లో శిక్షపడిన వారి సంఖ్య 140కి చేరింది. ఒక్క గుల్బర్గ్ సొసైటీ ఉదంతంలో పాల్గొన్నవారే 400మంది ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెప్పగా సుప్రీం కోర్టు నియమించిన సిట్ 60మందిని నిందితులుగా నిర్ధారించగలిగింది. మన దేశంలో మత కల్లోలాలు కొత్తగాదు. గుజరాత్ మారణకాండకు ముందూ, తర్వాతా చాలా జరిగాయి. 1946లో జరిగిన బిహార్ మతకల్లోలాలు మొదలుకొని మొరాదాబాద్(1980), నెల్లి(1983), హిషింపురా(1987), భగల్పూర్ (1989), బొంబాయి(1992) వరకూ ఎన్నో ఉన్నాయి. రెండేళ్లనాటి అస్సాం ఊచ కోత ఆ ఉదంతాలకు ముగింపు లేదని నిరూపించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ రాజధాని నగరంలో కాంగ్రెస్ నేతల ప్రాపకంతో జరిగిన సిక్కుల ఊచకోతను ఎవరూ మరిచిపోలేరు. ఈ కేసులన్నిటా దర్యాప్తు, విచారణ ఏళ్లతరబడి సాగడం రివాజైంది. ఆలస్యంగా లభించే న్యాయం అన్యాయంతో సమా నమంటారు. ఈ మారణకాండ కేసుల్లో చాలా సందర్భాల్లో జరుగుతున్నది అదే. ఇప్పుడు గుల్బర్గ్ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టి పనిచేసిన పౌర సమాజ కార్యకర్త తీస్తా సెతల్వాడ్ తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మిగిలిన నిందితులను వదిలేయడంపై అప్పీల్‌కి వెళ్తామని ప్రకటించారు. గుల్బర్గ్ సొసైటీ ఉదంతంలో సజీవదహనానికి గురైన తన భర్త ఎషాన్ జాఫ్రీకి తీరని అన్యాయం జరిగిందని ఆయన భార్య జకియా జాఫ్రి అంటున్నారు. స్వతంత్ర భారతంలో జరిగిన మిగిలిన మారణకాండలకూ, 2002నాటి గుజరాత్ మారణకాండకూ తేడా ఉంది. ఇతర ఉదంతాలకు స్థానికులు మాత్రమే ప్రత్యక్ష సాక్షులుగా ఉంటే గుజరాత్ మారణకాండ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమైంది! అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకొస్తున్న న్యూస్ చానెళ్ల పుణ్యమా అని ఆ దురంతాన్ని లక్షలాదిమంది చూశారు. అయినా అధికార యంత్రాంగాన్ని కదిలించడంలో, ఆ మారణకాండను నియంత్రించడంలో అది ఏ మాత్రం తోడ్పడ లేకపోయింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని కేసులనైతే తానే పర్యవేక్షించాల్సివచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించడం, కింది కోర్టుల్లో విచారణ సక్రమంగా లేదని భావించి పునర్వి చారణకు ఆదేశించడం, కొన్ని కేసుల విచారణను పొరుగు రాష్ట్రాలకు బదిలీ చేయడం వంటివన్నీ చోటుచేసుకున్నాయి. దర్యాప్తు బృందాలు, కింది కోర్టులు నిందితులకు సహకరి స్తున్న జాడలు కనిపిస్తున్నాయని ఒకటి రెండు కేసుల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. కొందరు పోలీస్ ఉన్నతాధికారులైతే... ఈ మారణ కాండను చూసీచూడ నట్టు వదిలేయమని తమకు ఆదేశాలందాయని ఆరోపించారు. జాతి మొత్తం సిగ్గుపడాల్సిన ఇలాంటి ఉదంతాల విషయంలో అధికార యంత్రాంగం చూపుతున్న అలసత్వమూ, నిర్లక్ష్యమూ క్షమించరానివి. కారణమే దైనా నడివీధుల్లో ఉన్మత్త మూకలు చెలరేగడాన్ని తేలిగ్గా తీసుకోవడమంటే అలాంటివి మళ్లీ మళ్లీ జరగడానికి ఆస్కారమీయడమే. సర్వోన్నత న్యాయస్థానం అనేకసార్లు చీవాట్లు పెట్టినా, హెచ్చరికలు జారీచేసినా గుజరాత్ పోలీసులు కర్తవ్య నిర్వహణలో పదే పదే విఫలమయ్యారు. గుల్బర్గ్ సొసైటీ మారణకాండ పౌర సమాజ చరిత్రలో చీకటి అధ్యాయమని అభివర్ణించిన న్యాయమూర్తి దీని వెనక కుట్ర ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించలేకపోయారు. ఆ సంగతిని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంవల్ల ఆయన ఆ అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చుగానీ పథక రచన లేకుండా...సూత్రధారులు, తెరవెనక సహాయ సహకారాలు అందకుండా ఇలాంటివి సాధ్యపడవు. ఈ కేసు సంగతలా ఉంచి గతంలో జరిగిన అనేక ఊచకోత ఉదంతాల్లో ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్లు లోతుగా విచారించి విలువైన నివేదికలిచ్చాయి. దోషులెవరో నిర్ద్వం ద్వంగా నిర్ధారించాయి. అయినా తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కనుకనే అలాంటివి పునరావృతమవుతున్నాయి. మన ప్రజా స్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నాయి. అయినవారిని కోల్పోయి, సర్వస్వం పోగొట్టుకుని వేలాది కుటుంబాలు ఈనాటికీ రోదిస్తున్నాయి. అలాంటివారికి న్యాయం లభించాలనీ, మానవత్వాన్ని మంటగలిపిన ముష్కరులకు కఠిన శిక్షపడా లనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. న్యాయం ఇకనుంచి అయినా వడివడిగా అడుగు లేయాలని ఆశిస్తారు. -
ఎట్టకేలకు ‘గోద్రా’ నిందితుడు అరెస్ట్
14 ఏళ్ల అనంతరం మహ్మద్ భానా అదుపులోకి ♦ ముంబై నుంచి గోద్రా వెళ్తుండగా పట్టుకున్న గుజరాత్ పోలీసులు ♦ ఇన్నాళ్లూ ముంబైలో స్థిరాస్తి బ్రోకర్‌గా అవతారం ♦ గోద్రాకు రాకపోకలు ప్రారంభమవడంతో నిఘా పెంపు అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గోద్రా రైలు మారణహోమం ప్రధాన నిందితుడు ఫరూక్ మహ్మద్ భానాను గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఎట్టకేలకు బుధవారం అరెస్టు చేశారు. అతను 14 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. రహస్య సమాచారంపై స్పందిం చిన అధికారులు భానా ముంబై నుంచి గోద్రా వెళ్తుండగా కాలోల్లోని ఓ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఏటీఎస్ ఐజీ జేకే భట్ తెలిపారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టడానికి భానా కుట్రపన్నాడని ఏటీఎస్ అధికారులు చెప్పారు. ఏటీఎస్ ప్రకారం.... ఘటన జరిగినప్పుడు భానా గోద్రాకు కార్పొరేటర్‌గా ఉన్నాడు. ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడైన మౌలానా ఉమర్జీ సూచనల మేరకు భానా, మరో కార్పొరేటర్ బిలాల్ హజితో కలసి రైలుకు నిప్పంటిచాలని ఇతర నిందితులకు సమాచారం అందించాడు. గోద్రా ప్రమాదంలో 59 మంది కరసేవకులు మృతి చెందారు. తదనంతరం చెలరేగిన అల్లర్లలో సుమారు 1000 మంది చనిపోయారు. రెండు నెలల ముందే మొదలైన నిఘా గోద్రా ఘటన జరిగిన చాన్నాళ్ల తరువాత భానా గోద్రాకు రాకపోకలు సాగించడంతో రెండు నెలల నుంచి ఏటీఎస్ నిఘా పెంచింది. పదేళ్లుగా అతను ముంబైలోని అంధేరీ మురికి వాడలో నివసిస్తున్నాడు. ‘‘ఈ మధ్యకాలంలో భానా పాకిస్తాన్‌కు కూడా వెళ్లిన ట్లు తెలిసింది. షేక్ ఉమర్గా పేరు మార్చుకొని స్తిరాస్థి బ్రోకర్‌గా పనిచేశాడు. ఎవరూ గుర్తించకుండా ఉండడానికి గడ్డం పెంచాడు. 16ఏళ్లు గడిచాక సొంతూ రు రావడం క్షేమం అనుకొని ఉంటాడు’’ అని ఏటీఎస్ ఐజీ జేకే భట్ చెప్పారు. 16 ఏళ్ల కాలంలో ఈ కేసుకు సంబంధించి 94 మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా తేల్చింది.