derail
-
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర
బొటాడ్: ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా కుండ్లి గ్రామ సమీపంలోని రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ట్రాక్‌పై పడివున్న రైలు పట్టా భాగాన్ని ఢీకొన్న పాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది.ఈ ఘటన నేపధ్యంలో ఓఖా భావ్‌నగర్ పాసింజర్ రైలు అర్థరాత్రి సుమారు 3 గంటల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. అనంతరం రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, రాన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలను సరిచేసి, మరో ఇంజిన్ సాయంతో ఆ రైలును అక్కడి నుంచి ముందుకు పంపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని బొటాడ్‌లోని రాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ట్రాక్‌పై ఎవరో నాలుగు అడుగుల పొడవైన పాత ట్రాక్ భాగాన్ని ఉంచారు. దీనిని ఢీకొన్న గూడ్సు రైలు అక్కడే ఆగిపోయింది. రైల్వే పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, తిరిగి రైళ్లు యధావిధిగా నడిచేలా చూశారు. రాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే -
Gujarat: రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర... తప్పిన ముప్పు
సూరత్: గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలోగల అప్ లైన్ రైల్వే ట్రాక్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. ట్రాక్‌లోని ఫిష్ ప్లేట్, కీని తెరిచివుంచారు. దీని వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దీనిని గుర్తించిన పశ్చిమ రైల్వే (వడోదర డివిజన్)అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన దరిమిలా రైలు సేవలను పునరుద్ధరించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే ఏ కుట్రనైనా భగ్నం చేస్తామని, దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ భద్రత కోసం ప్రభుత్వం త్వరలో నూతన ప్రణాళికను తీసుకువస్తుందని అన్నారు.రైల్వే భద్రతపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించినట్లు అమిత్‌షా తెలిపారు. రైల్వే నెట్వర్క్ భద్రత కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), రైల్వే పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, తద్వారా కుట్రలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కాగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే 38 రైల్వే ప్రమాదాలు జరిగాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ప్రమాదాలను మంత్రి వైష్ణవ్ చిన్న ఘటనలుగా కొట్టిపారేస్తున్నారని ఆరోపించింది.ఇది కూడా చదవండి: Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo— ANI (@ANI) September 21, 2024 -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
లక్నో: సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం(ఆగస్టు17) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్లో రైలు పెద్ద రాయిని గుద్దుకోవడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ రూట్లో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు. -
పట్టాలు తప్పిన రైలు.. 3 గంటలు ఆలస్యంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి-తాడి మార్గంలో బుధవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన అయిదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. రద్దైన రైళ్ల వివరాలు ►నేడు ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ►విశాఖ- లింగంపల్లి జన్మభూమి, విశాఖ-గుంటూరు ప్యాసింజర్ రైళ్లు రద్దు. ►రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి, గుంటూరు-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు. ►నేడు విశాఖ- విజయవాడ, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు -
రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన డీజిల్ ఇంజన్
Bomb Blast On Rail Tracks: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్లో శనివారం తెల్లవారుజామున బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఫలితంగా డీజిల్ ఇంజన్ పట్టాలు తప్పింది. పేలుడు వల్ల రైలు ట్రాక్‌లో కొంత భాగం దెబ్బతిన్నది. ధన్‌బాద్ డివిజన్లోని గర్వా రోడ్ , బర్కానా సెక్షన్ మధ్య ఈ "బాంబు పేలుడు" జరిగింది అని రైల్వే శాఖ తెలిపింది. (చదవండి: టాక్సీ డ్రైవర్ సాహసం.. సూసైడ్ బాంబర్‌ని కారులోనే బంధించి ) ‘‘ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా అసాధారణంగా ఉండటమే కాక దుండగులు కావాలనే రైలు పట్టాల మీద పేలుడుకు పాల్పడటంతో ధన్‌బాద్ డివిజన్లో డీజిల్ లోకో పట్టాలు తప్పింది" అని రైల్వేశాఖ తెలిపింది. ఈ సంఘటన వెనక నక్సల్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఎవరు గాయపడలేదు.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. చదవండి: ప్రభుత్వం కూల్చేందుకు భారీ కుట్ర? జార్ఖండ్‌లో కలకలం -
సొరంగంలో పట్టాలు తప్పిన ట్రైన్
-
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం ఫోటోలు
-
ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సుమారు 350మందితో ప్రయాణిస్తున్న రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 72 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే అందోళన వ్యక్తమవుతోంది. అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సరిగ్గా పార్క్ చేయని ట్రక్ ఒకటి రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. తైటంగ్‌కు ప్రయాణిస్తున్న ఈ రైలు హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగంలో పట్టాలు తప్పింది. సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. సొరంగం మధ్య ఇరుక్కు పోవడం రక్షణ చర్యలు కష్టంగా ఉన్నాయని పేర్కొన్నాయి. గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రైలుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
లక్నో: స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఓ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలెట్లు గుర్తించడంతో కేవలం రెండు బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడడంతో పెద్ద ప్రమాదమేమి సంభవించలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి బిహార్‌లోని జయనగర్‌కు 4674 షహీద్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుంది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో లక్నో సమీపంలోని చర్బాగ్ రైల్వే స్టేషన్లో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. అయితే పట్టాలు తప్పిన బోగీల్లో ప్రయాణికులు ఉన్నా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. వెంటనే ఆ ఆ బోగీలలోని ప్రయాణికులను దింపేసి ఇతర బోగీల్లో ఎక్కించి రైలు ప్రయాణం పునరుద్ధరించారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, విజయనగరం : బొడ్డవర సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో కొత్త వలస కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా విశాఖ అరకు ప్యాసింజర్ రైలును కొత్త వలస వద్ద నిలిపేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్. కోట రైల్వే స్టేషన్లో నిలిచిన ప్యాసింజర్ రైలును వెనక్కి పంపే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్
లక్నో : హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్ శనివారం పట్టాలు తప్పింది. కాన్పూర్ పట్టాణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ జిల్లాలోని రూమ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం 12.54 గంటలకు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభంవించలేదని.. ఓ ఎనిమిది మంది ప్రయాణికులకు మాత్రం తీవ్ర గాయాలయ్యానని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 900 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులు వినియోగిస్తున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాలు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
పట్టాలు తప్పిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
కటక్: సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ గార్డ్ బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని కటక్ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో రైలును వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానట్టుగా తెలుస్తోంది. గార్డ్ బోగీ కాకుండా ఇతర బోగీలు పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు. -
పట్టాలు తప్పిన మరో గూడ్స్.. మూడో ఘటన
ముంబయి: మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని ఖాండాలకు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. గడిచిన కొన్ని గంటల్లోనే ఇది మూడో సంఘటన. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు ఢిల్లీలో ఓ రైలు, ఉత్తర ప్రదేశ్‌లో ఓ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ప్రమాదంలో పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ మార్గాన వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు అక్కడి చేరుకొని ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. ఆధారాల పరిశీలన బృందాలు అక్కడి చేరుకొని తనిఖీలు చేస్తున్నాయి. -
యూపీలో ఘోర రైలు ప్రమాదం..
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అనంతరగిరి మండలం టైడా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్-కొత్తవలస రైలు మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో శివలింగాపురం- టైడా స్టేషన్ల మధ్య గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో కేకే లైన్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కొండచరియలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దుధని రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హోతగి-గుంతకల్లు, వాడి-లాతూర్-మన్మాడ్ మార్గాల్లో 12 రైళ్లను దారి మళ్లించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
పట్టాలు తప్పిన రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
-
పట్టాలు తప్పిన రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం మీరట్- లక్నో రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. రాంపూర్, ముందపండా స్టేషన్ల మధ్య గల బ్రిడ్జి సమీపంలో రైలు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి తీవ్రగాయాలు కాలేదని ఉత్తర రైల్వే సీపీఆర్ఓ నీరజ్ శర్మ వెల్లడించారు. సహయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైలు ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత నవంబర్‌లో ఇండోర్- పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 142 మంది మృతి చెందగా.. 200 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
డ్రైవర్ లేకుండానే రైలు కదలడంతో..
పళ్లిపట్టు(తమిళనాడు): యార్డులో ఆగి ఉన్న రైలు డ్రైవర్ లేకుండానే కదిలి కాస్త దూరం వెళ్లి పట్టాలు తప్పి ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ కారణంగా సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు గంటన్నరపాటు రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఈ ఘటన తమిళనాడులోని అరక్కోణంలో చోటుచేసుకుంది. అరక్కోణం జంక్షన్ రైల్వేస్టేషన్ యార్డులో శనివారం రాత్రి చెన్నై విద్యుత్ రైలు యార్డులో ఆగి ఉంది. ఆదివారం వేకువజామున అకస్మాత్తుగా ఈ రైలు కదిలి దాదాపు 500 మీటర్ల దూరం వెళ్లి పట్టాలు తప్పి ఆగింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలోని సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ఈ కారణంగా అరక్కోణం మార్గంలో వెళ్లే మంగళూరు మెయిల్, ఆళప్పుయా, కాచిగూడ, కావేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నాలుగు విద్యుత్ రైళ్లకు దాదాపు ఒకటిన్నర గంట పాటు అంతరాయం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాత ఢిల్లీ-ఫైజాబాద్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం అర్థరాత్రి తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ అనే గ్రామం వద్ద పట్టాలు తప్పింది. మొత్తం ఎన్నిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారని రైల్వే అధికారులు చెబుతుండగా 40 నుంచి 50మంది గాయపడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సరిగ్గా గర్ముక్తేశ్వర్, కాకాఖేర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే గార్డు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు రైలు వేగం గంటకు 80 కి.మీలుగా ఉందని, పట్టాలు తప్పిన బోగీలు అపాయకర స్థితిలో ఓ పక్కకు పూర్తిగా పడిపోయాయని చెప్పారు. పట్టాలు తప్పిన బోగీల్లో నాలుగు ఏసీ, రెండు స్లీపర్, ఒక జనరల్ బోగీ, మరొకటి సామాన్లు భద్రపరిచే బోగీ పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. ఘటనకు కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. -
డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
డోన్: గుంతకల్లు నుంచి డోన్ వెళుతోన్న గూడ్స్ రైలు సోమవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. దీంతో ఒక బోగీ పూర్తిగా ధ్వంసంకాగా, మరొకటి పాక్షికంగా దెబ్బతింది. కర్నూలు జిల్లా డోన్ ఏ క్యాబిన్ వద్ద ఈ సంఘటన జరిగింది. ప్రమాదాన్ని గురించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు. -
పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్‌ప్రెస్
బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లి సమీపంలో పుదుచ్చేరి-దాదర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్‌తో పాటు మరో బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ప్రమాదం జరగలేదని, ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని నైరుతి రైల్వే జీఎం పీ కే సక్సేనా తెలిపారు. ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టాలు తప్పిన కొచ్చి ఎక్స్‌ప్రెస్
తిరుపతి/రాజంపేట రూరల్: కొచ్చివ్యాలి నుంచి గౌహతి వెళ్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమవారం అర్ధరాత్రి వైఎస్ఆర్ జిల్లా నందలూరు సమీపంలోని మంటపంపల్లె వద్ద పట్టాలు తప్పింది. భారీ వర్షం కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రెండు బోగీలు పక్కకు ఒరిగి పోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. నెల్లూరు జిల్లా గూడూరు మీదుగా వెళ్లాల్సిన ఈ ఎక్స్‌ప్రెస్‌ను వర్షాల కారణంగా రేణిగుంట, రాజంపేట మీదుగా మళ్లించారు. రేణిగుంట నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. మరొక ట్రాక్‌లో కడప నుంచి వచ్చే రైళ్లను నడుపుతున్నారు. సహాయక చర్యల కోసం రేణిగుంట రైల్వే బృందం తరలివెళ్లింది. -
పట్టాలు తప్పిన ప్యాసింజర్
జైపూర్: రాజస్థాన్‌లో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. జైపూర్ జంక్షన్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నై నుంచి జైపూర్ మధ్య నడిచే రైలు సరిగ్గా జైపూర్ ప్లాట్ ఫాం వద్దకు చేరుకునే సమయంలో రైలు ఇంజిన్ పట్టాలు తప్పిపోయింది. దీంతో దాదాపు అర్థగంటపాటు రైల్వే సిబ్బంది కష్టపడి తిరిగి ఇంజిన్‌ను పట్టాలెక్కించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఇంజిన్‌కు చెందిన రెండు చక్రాలు పట్టాలు తప్పడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
పట్టాలు తప్పిన మరో రైలు
భువనేశ్వర్: ఒడిశాలో సరుకు రవాణా చేసే ఓ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కొన్ని రైళ్లను దారి మళ్లించారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు. రైల్వే అధికారుల సమాచారం మేరకు కటక్ జిల్లాలోని మార్థాపూర్ వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో నారజ్ డెంకానల్ మార్గం మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భువనేశ్వర్-బోలంగిర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, శంబల్ పూర్- పూరి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, అంగుల్-పూరి ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించారు. దాదాపు ఐదు గంటల ఆలస్యం అనంతరం తిరిగి సాధారణ సర్వీసులు ఈ మార్గంలో ప్రారంభించారు.