
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దుధని రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హోతగి-గుంతకల్లు, వాడి-లాతూర్-మన్మాడ్ మార్గాల్లో 12 రైళ్లను దారి మళ్లించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.