న్యూఢిల్లీ: హౌరా-న్యూఢిల్లీ పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. కాగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. హౌరా నుంచి బయల్దేరిన రైలు లిల్వా స్టేషన్ (పశ్చిమబెంగాల్) సమీపంలో పట్టాలు తప్పింది. 12 బోగీలు అదుపు తప్పాయి. ఆ సయమంలో రైలు నెమ్మదిగా వెళ్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు ఈశాన్య రైల్వే అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.