సూరత్: గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలోగల అప్ లైన్ రైల్వే ట్రాక్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. ట్రాక్‌లోని ఫిష్ ప్లేట్, కీని తెరిచివుంచారు. దీని వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
దీనిని గుర్తించిన పశ్చిమ రైల్వే (వడోదర డివిజన్)అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన దరిమిలా రైలు సేవలను పునరుద్ధరించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే ఏ కుట్రనైనా భగ్నం చేస్తామని, దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్ భద్రత కోసం ప్రభుత్వం త్వరలో నూతన ప్రణాళికను తీసుకువస్తుందని అన్నారు.
రైల్వే భద్రతపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించినట్లు అమిత్‌షా తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ భద్రత కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), రైల్వే పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, తద్వారా కుట్రలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కాగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే 38 రైల్వే ప్రమాదాలు జరిగాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ప్రమాదాలను మంత్రి వైష్ణవ్ చిన్న ఘటనలుగా కొట్టిపారేస్తున్నారని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్
#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo
— ANI (@ANI) September 21, 2024
Comments
Please login to add a commentAdd a comment