
ముంబై: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి లేదన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో శుక్రవారం(సెప్టెంబర్20) జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.
కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేకపోవడం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని విమర్శించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ రైతులను మోసగించిందన్నారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోందని మండిపడ్డారు.
స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన అందరికీ తెలుసన్నారు. అందరం ఏకమై కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి.. ఖర్గే మోదీ కంటే సీనియర్.. ఆయనను అవమానిస్తారా: ప్రియాంకగాంధీ
Comments
Please login to add a commentAdd a comment