రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన డీజిల్‌ ఇంజన్‌ | Jharkhand Bomb Blast On Rail Tracks Derails Diesel Locomotive | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన డీజిల్‌ ఇంజన్‌

Published Sat, Nov 20 2021 10:06 AM | Last Updated on Sat, Nov 20 2021 12:04 PM

Jharkhand Bomb Blast On Rail Tracks Derails Diesel Locomotive - Sakshi

Bomb Blast On Rail Tracks: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్‌లో శనివారం తెల్లవారుజామున బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఫలితంగా డీజిల్ ఇంజన్ పట్టాలు తప్పింది. పేలుడు వల్ల రైలు ట్రాక్‌లో కొంత భాగం దెబ్బతిన్నది. ధన్‌బాద్ డివిజన్‌లోని గర్వా రోడ్ , బర్కానా సెక్షన్ మధ్య ఈ "బాంబు పేలుడు" జరిగింది అని రైల్వే శాఖ తెలిపింది.
(చదవండి: టాక్సీ డ్రైవర్‌ సాహసం.. సూసైడ్‌ బాంబర్‌ని కారులోనే బంధించి )

‘‘ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా అసాధారణంగా ఉండటమే కాక దుండగులు కావాలనే రైలు పట్టాల మీద పేలుడుకు పాల్పడటంతో ధన్‌బాద్ డివిజన్‌లో డీజిల్ లోకో పట్టాలు తప్పింది" అని రైల్వేశాఖ తెలిపింది. ఈ సంఘటన వెనక నక్సల్స్‌ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఎవరు గాయపడలేదు.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 

చదవండి: ప్రభుత్వం కూల్చేందుకు భారీ కుట్ర? జార్ఖండ్‌లో కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement