రాజస్థాన్లో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. జైపూర్ జంక్షన్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
జైపూర్: రాజస్థాన్లో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. జైపూర్ జంక్షన్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నై నుంచి జైపూర్ మధ్య నడిచే రైలు సరిగ్గా జైపూర్ ప్లాట్ ఫాం వద్దకు చేరుకునే సమయంలో రైలు ఇంజిన్ పట్టాలు తప్పిపోయింది.
దీంతో దాదాపు అర్థగంటపాటు రైల్వే సిబ్బంది కష్టపడి తిరిగి ఇంజిన్ను పట్టాలెక్కించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఇంజిన్కు చెందిన రెండు చక్రాలు పట్టాలు తప్పడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.