జైపూర్ : ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్‌యూవీ క్షణాల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.
ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం.
राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl
— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024
అన్నా.. టీ ఉన్నాయా?
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణం
ప్రమాద సమయంలో ఎస్‌యూవీ నాగౌర్ నుండి బికనీర్‌కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment