ప్రమాదానికి కారణమైన కారు
జైపూర్: ఎస్‌యూవీ కారు, రోడ్డు పక్కన నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని జైపూర్ నగరం గాంధీనగర్‌లో ఓ ఫైఓవర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు భరత్ భూషణ్ మీనా రక్తంలో ఆల్కహాల్ ఉండవలసిన దాని కంటే 9 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన కారు బద్రీ నారాయణ్ మీనా అనే బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడి పేరు మీద రిజిస్టర్ అయింది. ఎస్‌యూవీ వెనక అద్దాలపై రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గౌరవ యాత్రకు సంబంధించిన ఫోటోలు అంటించి ఉన్నాయి. ఘటన తర్వాత వాటిని తొలగించినట్లుగా తెలుస్తోంది. నిందితుడిపై హత్యాయత్నం, రాష్ డ్రైవింగ్‌లకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment