Gachibowli Road Accident: Drunk Drive Is Reason For Accident - Sakshi
Sakshi News home page

Gachibowli Road Accident: 'రాత్రి సిట్టింగ్‌ వేశాం.. యాక్సిడెంట్‌కు ముందు ఏం జరిగిందంటే..'

Published Sat, Dec 18 2021 12:42 PM | Last Updated on Sun, Dec 19 2021 2:08 PM

Gachibowli Road Accident: Drunk Drive Is Reason For Accident - Sakshi

Reason Behind Gachibowli Road Accident: గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు స్పాట్‌లోనే మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయి సిద్ధూ అనే మరో జూనియర్‌ ఆర్టిస్ట్‌ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపినందుకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు వివరించాడు. చదవండి: జూనియర్‌ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్‌ అవుతున్న వీడియోలు

'ఉదయాన్నే షూటింగ్‌ ఉందని రాత్రి మా ఇంటికి వచ్చారు. సిట్టింగ్‌ వేశాం. ముగ్గురు మందు తాగారు. నేనెం తాగలేదు. అబ్ధుల్‌ బ్లాక్‌ డాగ్‌ తాగాడు. అమ్మాయిలిద్దరూ బీర్లు తాగారు.మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అన్నారు. ఈ టైంలో ఎందుకు బయటకు వెళ్లడం..డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ప్రాబ్లం అవుతుంద‌ని చెప్పాను.

అయినా ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదు. టీ తాగుదామని చెప్పారు. తోడు వెళ్లకపోతే బాగోదని నేను కూడా వెళ్లాను. నాకు డ్రైవింగ్‌ రాదు. అబ్దుల్‌ కారు నడిపాడు. అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. గచ్చిబౌలి నుంచి స్పీడ్‌గా వస్తుంటే ప్రమాదం జరిగింది. నేను మందు తాగలేదు. నాకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తే జీరో వచ్చింది' అని పేర్కొన్నాడు. చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు మృతి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement