Gachibowli Road Accident: 2 Junior Artists Instagram Photos Viral: గచ్చిబౌలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి చెందారు.హెచ్‌సీయూ రోడ్‌లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఎన్. మానస(23), ఎం. మానస(21)లు స్పాట్‌లోనే మరణించారు. వీరితో పాటు కారు నడిపిన అబ్ధుల్ సైతం అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
ఈ ప్రమాదంలో కారు రెండు భాగాలుగా తునాతునకలైంది. దీన్ని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ప్రాణాలు నిలవలేదు. మృతుల్లో ఎన్. మానస స్వస్థలం (23) కర్ణాటక కాగా, ఎం. మానస(21)ది మహబూబ్‌నగర్ అని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్. మానసకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి
Comments
Please login to add a commentAdd a comment