ప్రముఖ యూట్యూబర్, నటిగా గుర్తింపు పొందిన గాయత్రి శుక్రవారం (మార్చి 18) రాత్రి రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది. హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న గాయత్రి, ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరిని కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారులో గాయత్రితోపాటు ఉన్న రోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి.
ఈ ఘటనకు ముందు పబ్‌కు వెళ్లిన యువుకులు కొబ్బరి బొండాల్లో ఆల్కహాల్ కలుపుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హోలీ పండుగకు ముందు రోజే యువకులు మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. మద్యం కలుపుకున్న కొబ్బరి బొండాలతో యువకులు పబ్‌కు వెళ్లినట్లిగా గుర్తించారు. మద్యం అనుమతి లేదని కొబ్బరి బొండాల్లో మద్యం నింపినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం (మార్చి 18) హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పిక్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసం పబ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment