Gachibowli police
-
రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా ?
ప్రముఖ యూట్యూబర్, నటిగా గుర్తింపు పొందిన గాయత్రి శుక్రవారం (మార్చి 18) రాత్రి రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది. హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న గాయత్రి, ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరిని కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారులో గాయత్రితోపాటు ఉన్న రోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. ఈ ఘటనకు ముందు పబ్‌కు వెళ్లిన యువుకులు కొబ్బరి బొండాల్లో ఆల్కహాల్ కలుపుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హోలీ పండుగకు ముందు రోజే యువకులు మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. మద్యం కలుపుకున్న కొబ్బరి బొండాలతో యువకులు పబ్‌కు వెళ్లినట్లిగా గుర్తించారు. మద్యం అనుమతి లేదని కొబ్బరి బొండాల్లో మద్యం నింపినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం (మార్చి 18) హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పిక్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసం పబ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ గాయత్రి (ఫోటోలు)
-
ట్రాన్స్ జెండర్ డెస్క్.. మార్పుకు నాంది: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని, ప్రపంచంలోనే మొదటిసారి ట్రాన్స్ జెండర్ డెస్క్‌ను తీసుకువచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమం దేశంలోనే కమ్యూనిటీ పట్ల మార్పునకు నాంది కాబోతోందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా ట్రాన్స్ జెండర్లకు ఏమీ అందటంలేదని పేర్కొన్నారు. ఈ డెస్క్ ద్వారా అన్ని సదుపాయాలు అందుతాయని, ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో ఈ కమ్యూనిటీల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రక్షణ, ఉద్యోగాలు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జాబ్ మేళాల్లో పెద్దఎత్తున పాల్గొంటే ట్రాన్స్జెండర్లకు సాయం అందిస్తామని తెలిపారు. వారికి డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చేలా కృషి చేస్తామన్నారు. వారికి సాయం చేయటంలో ముందుంటామని కానీ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేయాల్సి వస్తుందన్నారు. ట్రాన్స్జెండర్లు మారితేనే వారి కమ్యూనిటీ మారుతుందని తెలిపారు. తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లపై ఒక డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి తెలియజేయాలన్నారు. వందల ఏళ్ల వివక్ష పోవటానికి కొంత సమయం పడుతుందని, దేశంలో ఎవరు కష్టాల్లో ఉన్నా ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ముందుగా స్పందిస్తారని తెలిపారు. చదవండి: ఉప్పల్‌లో లారీ బీభత్సం -
గచ్చిబౌలిలో కారు బీభత్సం..
-
ఈ సైబర్ క్రైమ్.. ఓ మిస్టరీ.!
సాక్షి, హైదరాబాద్: ఇదో మిస్టరీ సైబర్ క్రైమ్.. నేరం జరిగింది.. కానీ అది ఎలా జరిగిందనే దానిపై పోలీసులకే స్పష్టత లేదు. రూమ్ అద్దెకు కావాలంటూ వచ్చిన నేరగాడు తన డెబిట్‌కార్డు తస్కరించాడని, ఫోన్లో సాఫ్ట్వేర్ బగ్ ఇన్స్టాల్ చేశాడని బాధితుడు చెప్తున్నాడు. ఇలా తన ఖాతాలోని రూ.49,900 కాజేశాడని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బగ్గింగ్ లేదని, కేవలం తాత్కాలిక పిన్ నంబర్ సృష్టించాడని పోలీసులు అంటుంటే.. టెంపరరీ పిన్ సృష్టించడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మిస్టరీ సైబర్ క్రైమ్‌ను ఛేదించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. గది అద్దెకు కావాలంటూ వచ్చి.. ఉత్తరాదికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న హర్ష్ కరీవాల, వన్ష్ దత్తా, ఆకాశ్ గార్గ్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని హ్యాపీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఒక్కో బెడ్రూమ్లో ఒకరు ఉండేవారు. ఇటీవల ఆకాశ్ వెళ్లిపోవడంతో ఓ బెడ్రూమ్ ఖాళీ అయింది. ఎవరికైనా ఈ రూమ్‌లోకి రావడానికి ఆసక్తి ఉంటే సంప్రదించాలంటూ హర్ష్, వన్ష్ ‘హైదరాబాద్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ మేట్స్’అనే ఫేస్బుక్ పేజ్‌లో గత శనివారం పోస్ట్ చేశారు. అది చూసిన ఓ వ్యక్తి అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో వన్ష్కు ఫోన్ చేశాడు. రమ్మని చెప్పడంతో పది నిమిషాల్లో ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తన పేరు శ్రీనివాసరెడ్డి అని, తిరుపతికి చెందిన తాను ఢిల్లీ, పుణేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశానని, పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని గూగుల్ కార్యాలయంలో యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఫ్లాట్ నచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో వచ్చి చేరుతానంటూ అడ్వాన్స్, అద్దె వివరాలు సైతం ఖరారు చేసుకున్నాడు. కార్డ్ కొట్టేసి.. ఫోన్ తీసుకుని.. వీరి ఫ్లాట్‌కు వస్తూనే తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందంటూ చార్జర్ తీసి చార్జింగ్ పెట్టాడు శ్రీనివాసరెడ్డి. అద్దెకు రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలని హర్ష్‌కు చెందిన రూమ్‌లోకి వెళ్లాడు. హర్ష్, వన్ష్ హాల్లోనే ఉండటంతో అక్కడి వార్డ్‌రోబ్‌లో ఉన్న హర్ష్ పర్సు నుంచి అతడి డెబిట్ కార్డు తస్కరించాడు. ఏమీ ఎరుగనట్లు బయటకొచ్చి అతను ఫ్లాట్‌లోకి అద్దెకు వస్తున్న విషయం తన తల్లిదండ్రులకు చెప్పాలంటూ హర్ష్ నుంచి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ కలవట్లేదంటూ కాస్త దూరం వెళ్లిన అతడు.. వారికి ఎస్సెమ్మెస్ పంపిస్తున్నానంటూ మెసేజ్ టైప్ చేస్తున్నట్లు నటిస్తూ ఓ బగ్గింగ్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేశాడు. ‘పని’పూర్తయిన తర్వాత ఫోన్ ఇచ్చేసి రెండు రోజుల్లో ఫ్లాట్‌లో చేరతానంటూ చెప్పి వెళ్లిపోయాడు. ఏటీఎం నుంచి డబ్బు డ్రా.. హర్ష్ డెబిట్‌కార్డును తీసుకుని శ్రీనివాసరెడ్డి నేరుగా హైటెక్ సిటీలో ఉన్న ఓ ఏటీఎం వద్దకు వెళ్లాడు. డెబిట్ కార్డుతో డబ్బు డ్రా చేయాలంటే పిన్ నంబర్ కావాల్సిందే. దీనికోసం అతడు హర్ష్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన బగ్గింగ్ యాప్‌ను వాడుకున్నాడు. డెబిట్‌కార్డును ఏటీఎంలో పెట్టి పిన్ నంబర్ మార్చాలనే ఆప్షన్ ఎంచుకున్నాడు. సాధారణంగా ఇలా చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. అయితే హర్ష్ ఫోన్లోని బగ్గింగ్ సాఫ్ట్వేర్ కారణంగా ఈ సందేశం దుండగుడి ఫోన్‌కే వచ్చింది. అంతే పిన్ నంబర్ మార్చేసి మూడు విడతల్లో హర్ష్ ఖాతాలోని రూ.49,900 కాజేశాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో డబ్బు డ్రాకు సంబంధించిన సందేశాలు ఫోన్‌కు రావడంతో హర్ష్ కార్డు కోసం చూడగా అది కనిపించలేదు. ఫోన్‌ను సరిచూసుకోగా బగ్గింగ్ యాప్ ఇన్స్టాల్ అయినట్లు ఉంది. దీంతో శ్రీనివాసరెడ్డిగా చెప్పుకుని వచ్చిన వ్యక్తే బాధ్యడని అనుమానించిన హర్ష్, వన్ష్ మరుసటి రోజు(ఆదివారం) గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదుపులో వరంగల్ వాసి.. గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించారు. వరంగల్‌కు చెందిన అతడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఎలాంటి బగ్గింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయలేదని, హర్ష్‌కు చెందిన ఫోన్ ద్వారా తాత్కాలిక పిన్ నంబర్ సృష్టించానని, ఈ నంబర్ వ్యాలిడిటీ కొన్ని గంటలు ఉంటుందని, దాని ఆధారంగానే డబ్బు డ్రా చేసినట్లు అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. విషయాన్ని బాధితుడు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. టెంపరరీ పిన్ నంబర్ జనరేషన్ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. అయితే బగ్గింగ్ యాప్ విషయాన్ని పోలీసులు అంగీకరించట్లేదు. దీంతో ఈ కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఈ పంథాలో అనేక మందిని ముంచి ఉంటాడనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
పోలీస్ రోబో వచ్చెన్.. సిటీ మురిసెన్..!
సాక్షి,సిటీబ్యూరో: ఇనుములో ఒక హృదయం మొలిచెను..అందరికీ సుపరిచితమైన రోబో సినిమాలోని పాట తరహాలో.. గ్రేటర్లో పోలీసు విధులు నిర్వహించేందుకు పోలీస్రోబో వచ్చేసింది. గచ్చిబౌలిలోని హెచ్‌బోట్స్ సంస్థ ప్రయోగశాలలో సిద్ధమైన ఈ రోబోను శుక్రవారం ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. తక్కువ ఖర్చుతో ఈ రోబోను తయారు చేయడంతోపాటు కృత్రిమ మేథస్సుతో సమర్థవంతంగా పనిచేయించడమే దీని ప్రత్యేకత. ఇనుముతోపాటు కార్బన్‌ఫైబర్ మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు. డిసెంబరు 31న సాయంత్రం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రెండు గంటలపాటు పోలీసు విధులను ఈ రోబో నిర్వహించనుండడం విశేషం. -
హెడ్ కానిస్టేబుల్‌పై ఏసీబీ కేసు?
వ్యభిచారం కేసులో లంచం డిమాండ్ పరారీలో నిందితుడు గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై ఏసీబీ కేసు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. వ్యభిచార కేంద్రంపై దాడి చేసి అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తిని వదిలేసి డబ్బు డిమాండ్ చేయడంతో కేసు నమోదైనట్లు తెలిసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో నిందితులను రాత్రి సమయంలో కస్టడీలో పెట్టుకోవద్దని గత వారం సైబరాబాద్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గచ్చిబౌలి ఠాణా పరిధిలో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందిందని క్రైం విభాగంలో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో దాడి చేసి నిందితులను కస్టడీలో పెట్టుకోలేమని, పగటిపూట దాడి చేయాలని ఇన్స్పెక్టర్ సూచించాడు. ఇన్స్పెక్టర్ సూచనలను బేఖాతర్ చేస్తూ అదే రోజు రాత్రి ఎస్ఐ, మరో కానిస్టేబుల్‌ను తీసుకొని వ్యభిచార కేంద్రంపై దాడిచేశారు. అక్కడ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బేరం కుదుర్చుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తీసుకురాకుండా అతడి కారు తమ వద్ద ఉంచుకొని నిందితుడిని వదిలివేశారు. ఈ సెటిల్మెంట్లో సదరు హెడ్ కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసుల తీరు తనను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నారని భావించిన ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. మరుసటి రోజే అతను హెడ్‌కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి సిటీకి వస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని చెప్పాడు. తాను డ్యూటీలో బిజీగా ఉన్నానని, రావడం కుదరదని చెప్పి సదరు హెడ్ కానిస్టేబుల్ పీఎస్ పక్కన్నే ఉన్న పాన్ షాపులో డబ్బు ఇస్తే కలెక్ట్ చేసుకుంటానని అన్నాడు. అతను చెప్పిన విధంగా కారు యజమాని పాన్ షాపులో డబ్బు ఇవ్వగా.. కొద్దిసేపటికి హెడ్‌కానిస్టేబుల్ డబ్బు కలెక్ట్ చేసుకునేందుకు వేరే వ్యక్తిని పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను హెడ్ కానిస్టేబుల్ కాదని తేలింది. దీంతో ఏసీబీ అధికారులు పాన్ షాపు నిర్వాహకుడితో పాటు, డబ్బు కోసం వచ్చిన వ్యక్తిని మరింత లోతుగా విచారించారు. విషయం బయటకు పొక్కడంతో సదరు హెడ్ కానిస్టేబుల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు అతని ఇంటికి వెళ్లి గాలించినా ఆచూకీ తెలియరాలేదు. గత నాలుగు రోజులుగా ఆ హెడ్ కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌కు రాకపోవడంతో ఏసీబీ అధికారులు అతడి ఇంటిపైన, బంధువుల ఇళ్లపైన నిఘా పెట్టారు. అంతేకాకుండా అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా, ఆ హెడ్‌కానిస్టేబుల్ పట్టుబడితే ఎవరి పేర్లు చెప్తాడోనని గచ్చిబౌలి పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఓ వ్యభిచార కేంద్రంపై దాడి చేయగా నిర్వాహకుడి వద్ద ఓ ఎస్ఐ భారీ మొత్తంలో డబ్బు దండుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి.