హైదరాబాద్, క్రైమ్: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేయగానే.. అతని అందమైన ఫొటోలు కనిపిస్తాయి. సరే కదా అని సంప్రదిస్తే.. తియ్యగా మాటలు కలుపుతాడు. ఆపై పరిచయం.. డబ్బులు తీసుకుని మోసం చేసేదాకా వెళ్తుంది. అలా ఇప్పటిదాకా 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు విగ్గురాజా వంశీకృష్ణ.
గచ్చిబౌలి పోలీసులు వంశీకృష్ణ అనే నిత్యపెళ్లి కొడుకు కోసం గాలింపు చేపట్టారు. తాజాగా ఓ మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకుంటానని చెప్పి రూ.40 లక్షల దాకా తీసుకుని మోసం చేశాడతను. పోలీసుల విచారణలో..
ఇప్పటికే పలుమార్లు అరెస్టై జైలుకు వెళ్లివచ్చినట్లు తేలింది.
విగ్గులు మార్చి మరీ ఫొటోలు పెడుతూ.. ఇప్పటిదాకా అమ్మాయిల తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ వచ్చాడు. తాజాగా ఓ మహిళా డాక్టర్‌ను మోసం చేయబోయాడు. అయితే తిరిగి ఆమె డబ్బులు కోరడంతో.. మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. ఆ నిత్య పెళ్లికొడుకు మోసాలను పోలీసులు గుర్తించగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment