Nithya Groom
-
HYD: నగరంలో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు
హైదరాబాద్: భార్య బతికుండానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. కట్టుకున్న భార్యకు ఆడపిల్లలు పడుతున్నారని ఏకంగా 4 సార్లు అబార్షన్ చేయించాడు. హైదరాబాద్‌లో నాగోల్ జైపురి కాలనీలో నివాసం ఉండే అమరేందర్ భార్య బతికి వుండగానే మరో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన నిత్య పెళ్లి కొడుగు ఆగడాలు తీవ్ర కలకలం రేపాయి. భార్య చనిపోయిందంటూ అమరేందర్ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆడపిల్లలు పుడుతున్నారని భార్యకు అమరేందర్ నాలుగు సార్లు అబార్షన్లు చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాధితురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు సమాచారం. భార్య బతికి ఉండగానే చనిపోయిందని.. అమరేందర్ మరో పెళ్లి చేసుకున్నాడు. అమరేందర్ హై కోర్టు న్యాయవాదిగా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సరూర్ నగర్ ఉమెన్స్ పోలీసు స్టేషన్లో అమరేందర్‌పై తాజాగా కేసు నమోదైంది. భార్య బతికి ఉన్నా చనిపోయిందని వేరే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాక ఇతను రాజకీయాల్లోనూ జోక్యం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ రైతు రాజ్య సమితి (TRS) అనే ఒక పార్టీని అమరేందర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. అమరేందర్ తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అంటూ పలువురిని మోసం చేస్తున్నారని బాధితురాలు కూడా ఆరోపిస్తోంది. ఇప్పటికే సరూర్ నగర్ ఉమెన్ పీఎస్ లో అమరేందర్ పై కేసు నమోదు అయింది. అమరేందర్ బారిన పడ్డ పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలైన అమరేందర్ భార్య వేడుకుంటున్నారు. -
వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ
సాక్షి, హైదరాబాద్: మూడు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకును బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ హరీశ్వర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెహిదీపట్నం సంతోష్‌నగర్‌లో నివసించే మహ్మద్ బిన్ ఇషాక్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్ యూట్యూబర్‌గా పని చేస్తున్నాడు. గతంలోనే ఆయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. గత అక్టోబర్‌లో బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని మిథిలానగర్‌లో ఉంటున్న వివాహిత(32)తో పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లి కాలేదని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆమెతో సహజీవనం చేశాడు. రెండు వారాల క్రితం ఆమెకు ఇషాక్ అసలు రూపం తెలియడంతో ఈ విషయంపై ఆమె నిలదీయగా అతను ముఖం చాటేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: Hyderabad: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒక్క వీడియో కాల్ ఎంత పనిచేసింది!! -
Hyderabad: ‘దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది.. నన్ను పెళ్లి చేసుకో’
సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్‌ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్‌హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు. నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు. నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి -
నిత్య పెళ్లికొడుక్కి మూడేళ్ల జైలు
నిడమనూరు : నలుగురిని వివాహం చేసుకున్న నిత్యపెళ్లి కొడుక్కి శుక్రవారం నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జ్ పద్మజ మూడేళ్ల జైలుశిక్ష, 5వేల జరిమానా విధించించారు. ఏఎస్ఐ రామచంద్రరాజు తెలిపిన వివరాల ప్రకా రం.. నాగార్జునసాగర్‌కు చెందిన యర్రం విజయలక్ష్మికి రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన లింగాల హరిప్రసాద్‌తో 2008లో వివాహం జరిగింది. హైదరాబాద్‌లో ప్రై వేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం పెట్టా డు. కొంత కాలానికి వారంలో రెండు లేదా మూడు సా ర్లు మాత్రమే హరిప్రసాద్ ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లు చూసిన విజయలక్ష్మి భర్త హరిప్రాద్‌ను నిలదీసింది. దీంతో తాను మరో మహిళ ను వివాహం చేసుకున్నానని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే హరిప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం మహిళ వద్దకెళ్లి అడుగగా తననే కాదు మరో ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నాడని చెప్పడంతో హతాసురాలైంది. వెంటనే నాగార్జున సాగర్‌కు వచ్చి 2009జూన్ 23న తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని భర్త హరిప్రాద్, అత్త,మామ లింగాల బాలరాజు, పెంటమ్మపై, బెదిరిం చాడని భర్త బావ గుండ్లపల్లి జంగయ్యపై ఫిర్యాదు చేసింది. ఎస్ఐ హన్మంతరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశాడు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో లింగాల హరిప్రసాద్, ఆయన తల్లి లింగాల పెంటమ్మ, తండ్రి బాలరాజు(మృతిచెందాడు)లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, గుండ్లపల్లి జంగయ్యకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.5వందలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి పద్మజ తీర్పు చెప్పారు.