నిడమనూరు : నలుగురిని వివాహం చేసుకున్న నిత్యపెళ్లి కొడుక్కి శుక్రవారం నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జ్ పద్మజ మూడేళ్ల జైలుశిక్ష, 5వేల జరిమానా విధించించారు. ఏఎస్‌ఐ రామచంద్రరాజు తెలిపిన వివరాల ప్రకా రం.. నాగార్జునసాగర్‌కు చెందిన యర్రం విజయలక్ష్మికి రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన లింగాల హరిప్రసాద్‌తో 2008లో వివాహం జరిగింది. హైదరాబాద్‌లో ప్రై వేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం పెట్టా డు. కొంత కాలానికి వారంలో రెండు లేదా మూడు సా ర్లు మాత్రమే హరిప్రసాద్ ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లు చూసిన విజయలక్ష్మి భర్త హరిప్రాద్‌ను నిలదీసింది.
దీంతో తాను మరో మహిళ ను వివాహం చేసుకున్నానని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే హరిప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం మహిళ వద్దకెళ్లి అడుగగా తననే కాదు మరో ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నాడని చెప్పడంతో హతాసురాలైంది. వెంటనే నాగార్జున సాగర్‌కు వచ్చి 2009జూన్ 23న తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని భర్త హరిప్రాద్, అత్త,మామ లింగాల బాలరాజు, పెంటమ్మపై, బెదిరిం చాడని భర్త బావ గుండ్లపల్లి జంగయ్యపై ఫిర్యాదు చేసింది.
ఎస్‌ఐ హన్మంతరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశాడు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో లింగాల హరిప్రసాద్, ఆయన తల్లి లింగాల పెంటమ్మ, తండ్రి బాలరాజు(మృతిచెందాడు)లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, గుండ్లపల్లి జంగయ్యకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.5వందలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి పద్మజ తీర్పు చెప్పారు.
నిత్య పెళ్లికొడుక్కి మూడేళ్ల జైలు
Published Sat, Mar 12 2016 3:49 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
Advertisement
Advertisement