మాయమాటలు చెప్పి ముగ్గురితో వివాహం
రెండో భార్య ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
జవహర్‌నగర్: మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్, గబ్బిలాల్‌పేటకు చెందిన లక్ష్మణరావు ర్యాపిడో డ్రైవర్‌గా పని చేసేవాడు. 2014లో తన బంధువుల అమ్మాయి అనూషను వివాహం చేసుకున్న అతను మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నాడు.
2021లో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి అనే యువతిని మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మణ్‌రావు లీలావతి దూరంగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్నాడు.
అతను మల్కాజిగిరిలో ఉంటున్నట్లు తెలియడంతో లీలావతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా లక్ష్మణ్‌రావు శబరి అనే మరో మహిళను వివాహం చేసుకున్నట్లు గుర్తించి నివ్వెరపోయారు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసి ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్నాడు. లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment