
ఇద్దరు మహిళల అరెస్టు,
పంచలోహ విగ్రహాలు స్వాదీనం
హైదరాబాద్: అరిష్టాలు తొలగిపోతాయని గుడిలో పంచలోహ విగ్రహాలు దొంగిలించిన ఇద్దరు మహిళలను ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనం చేసిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటరమణ, ఇన్స్‌పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్ సమీపంలోని గురుమూర్తినగర్‌లో శ్రీ వినాయక ఆలయం గర్భగుడిలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు కనిపించడం లేదంటూ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శనివారం భక్తుల రూపంలో వచ్చిన మహిళలు తమ మాయమాటలతో అర్చకుడిని బోల్తా కొట్టించి విగ్రహాలు ఎత్తుకుళ్లినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ ఎన్‌బీటీనగర్‌కు చెందిన స్వర్ణలత, పావని అనే మహిళలు ఆలయానికి వచ్చిన..అర్చకుడు నవీన్‌కుమార్ తీర్థ ప్రసాదాలు పంచి పెడుతుండగా అదును చూసి విగ్రహాలను ఓ సంచిలో వేసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత అర్చకుడిని విగ్రహాలు కనిపించక పోవడంతో అధికారులకు సమాచారం అందించారు.
గడిచిన రెండేళ్ల కాలంలో స్వర్ణలతో ఇంట్లో వరుసగా నలుగురు మరణించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు చనిపోవడంతో అరిష్టం వల్లే మృతి చెందారని భావించింది. నిత్యం పూజలందుకునే మహిమాని్వతులైన దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని, సకల శుభాలు జరుగుతాయని నమ్మింది. పావనికి విషయాన్ని చెప్పి పథకం ప్రకారం ఇద్దరు విగ్రహాలను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించారు. వారిద్దరికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు.
విగ్రహాలను స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment