sr nagar police
-
SR నగర్ పోలీస్ స్టేషన్ కు వైఎస్ షర్మిల
-
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: ఎక్కడో నేరం చేసిన వాళ్లు నగరానికి వచ్చి తలదాచుకుంటున్నారు.. ఇక్కడ నేరం చేయడానికి వచ్చినవాళ్లూ కొన్నాళ్లు మకాం వేస్తున్నారు.. ఇలాంటి వారికి సిటీలో ఉన్న కొన్ని లాడ్జీలు, హాస్టళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. మరోపక్క ఏ హాస్టల్లో ఎవరు ఉంటున్నారు? వాళ్లు ఎక్కడి వాళ్లు, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? ఇలా ఏ విషయమూ పోలీసులకు తెలియట్లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఎస్సార్‌నగర్ ఠాణా అధికారులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.సైదులు ఆలోచన, కృషి ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. గూగుల్ ద్వారా అందుబాటులోకి.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్ది ఈ యాప్‌ను గూగుల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్సార్‌నగర్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. పోలీసు విభాగం అధీనంలో పని చేసే దీన్ని హాస్టళ్లు, లాడ్జీల నిర్వాహకులు తమ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న కేటగిరీల ఆధారంగా బాయ్స్, మెన్స్, ఉమెన్స్ హాస్టల్స్, లాడ్జీలను ఎంచుకుంటారు. బస చేస్తున్న వ్యక్తి పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం చేస్తుంటాడు? గతంలో ఎక్కడ ఉండేవాడు? ప్రస్తుతం ఏ రూమ్‌లో ఉంటున్నాడు? తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు అతడి ఫొటో, ఆధార్కార్డునూ క్యాప్చర్ చేసి అదే యాప్ ద్వారా సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ప్రతీ హాస్టల్, లాడ్జీ యజమాని ఈ వివరాలన్నీ యాప్‌తో సేకరించడం కచి్చతం చేస్తున్నారు. ఇది కేవలం ఒత్తిడి చేయడం ద్వారా కాకుండా యజమానులు, నిర్వాహకులకు వారంతట వారుగా వినియోగించేలా ఎస్సార్‌నగర్ పోలీసులు యోచించారు. ఓటీపీతో ఫోన్ నంబర్ వెరిఫికేషన్.. బస చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ యాప్‌లో ఎంటర్ చేసిన వెంటనే దానికి ఓటీపీ వెళ్తుంది. ఇది కూడా పొందుపరిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. ఫలితంగా నకిలీ ఫోన్ నంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఈ యాప్‌నకు సంబంధించిన సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పదేపదే నేరాలు చేసే వారి వివరాలతో కూడిన డేటాబేస్‌ను అనుసంధానించనున్నారు. ఎవరైనా బస చేయడానికి వస్తే... ఆ వివరాలు పొందుపరిచిన వెంటనే యాప్ దానంతట అదే అలర్ట్ ఇచ్చేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు. విస్తరిస్తేనే పూర్తి స్థాయి ఫలితాలు... ఈ యాప్ ఎస్సార్‌నగర్ పోలీసుల చొరవతో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతానికి ఆ ఠాణా పరిధిలోని హాస్టళ్లు, లాడ్జీల్లో ఉంటున్న వారి వివరాలు తెలుసుకోవడానికి, బస చేసిన వ్యక్తి పూర్వాపరాలు గుర్తించడానికి, ఆ పరిధిలో వాంటెడ్ వ్యక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించనుంది. దీనివల్ల పూర్తి స్థాయి ఫలితాలు రావాలంటే మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా రాజధానిలోని మూడు కమిషనరేట్లకు ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ అమలును కచ్చితం చేయడంతో పాటు ప్రోత్సహించాల్సిన అవసరముంది. -
మైనర్‌తో ప్రేమ, పెళ్లి.. నెల నుంచే బాలికను వేధిస్తూ
సాక్షి, అమీర్‌పేట: ప్రేమ పేరిట బాలిక వెంటపడి, పెళ్లి చేసుకుని వేధిస్తున్న యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లో నివాసముంటున్న 16 ఏళ్ల మైనర్ బాలిక 2017లో వేసవి సెలవుల్లో ఎల్లారెడ్డిగూడలో తాత, అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే ఎరోళ్ల వివేక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను గతేడాది నవంబర్ 8న వెంట తీసుకుని వెళ్లి 12న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి వచ్చి ఎల్లారెడ్డిగూడలో కాపురం పెట్టాడు. 5 నెలల నుంచి బాలికను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో బుధవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు పాల్పడిన వివేక్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
జనసేన కార్యకర్తల వీరంగం
-
అర్థరాత్రి సమయంలో ఇద్దరు వచ్చి... మాకు చాలా భయం వేసింది
-
ఎన్ని దాడులు చేసిన నేను భయపడను: పొసాని
-
posani krishna murali: పోసాని ఇంటిపై రాళ్లదాడి
అమీర్‌పేట (హైదరాబాద్): ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తుతెలి యని దుండగులు రాళ్లతో దాడి చేశారు. పోసానితోపాటు కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారు. మూడు రోజుల క్రితం పోసానిపై దాడికి యత్నించడం, ఇంటి వద్ద రాళ్లదాడి చేయ డాన్ని బట్టి చూస్తే ఇది పవన్ కల్యాణ్ అభిమానుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటి వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. పెద్ద శబ్దం రావడంతో లోపల పడుకుని ఉన్న వాచ్‌మన్ యాకయ్య, అతని భార్య శోభ భయాందోళనకు గురయ్యారు. అప్పటికే రెండు రాళ్లు లోపల వచ్చి పడ్డాయి. గేటు వద్దకు వచ్చి చూడగా బయట ఇద్దరు వ్యక్తులు కనిపించారు. దీంతో వాచ్‌మన్ సమీపంలో ఉండే పురుషోత్తం అనే వ్యక్తికి ఫోన్ చేయగా, ఆయన వచ్చే లోపు దుండగులు పారిపోయారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు చుట్టుపక్కల గాలించినా ఆగంతకులు కనిపించలేదు. ప్రాణ భయంతో గేటు తీసి బయటకు రాలేకపోయామని శోభ తెలిపారు. వాచ్‌మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు చెప్పారు. పోసాని నివాసంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంతోపాటు ప్రైవేటు హాస్టల్ సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోసానిపై దాడితో సంబంధం లేదు: జనసేన తెలంగాణలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన తెలంగాణ ఇన్చార్జి ఎన్.శంకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై పోసాని చేసిన విమర్శలను ఆయన ఖండించారు. పోసానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తెలంగాణ నుంచి బహిష్కరించాలని డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందేలా చేస్తానని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తాం.. ప్రభుత్వ స్థలాలు వచ్చేలా చేస్తామని ప్రజలు, నిరుద్యోగులను మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల పీఏనంటూ సుధాకర్ మోసాలకు పాల్పడుతున్నాడు. అతడికి నాగరాజు, భీమయ్య సహకరిస్తున్నారు. ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి దర్యాప్తు చేశారు. ఫార్చూనర్ కారు సఫారీ డ్రెస్ లు వేసుకుని డమ్మీ గన్ ద్వారా వారు దందా నడిపిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో దాదాపు నిరుద్యోగులు, ప్రజల నుంచి రూ.2.2 కోట్లు వసూలు చేశారని తెలిసింది. ఈ ముగ్గురిని ఎస్సార్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ గ్యాంగ్ లీడర్‌గా ఉంటుండగా నాగరాజు, భీమయ్య అతడికి సహకరించేవారు. ఈ విధంగా వారు 82 మందిని మోసం చేశారని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు, ఉద్యోగాలు, తక్కువ డబ్బులకు బంగారం వంటి నేరాలకు పాల్పడ్డారని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మొత్తం రూ.3 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితుల నుంచి రూ.కోటి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, కోటి రూపాయల ఇంటి పేపర్లు, ఫార్చూనర్ కారు, డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే సీఎం ఓఎస్డీగా, సెక్రటేరియట్ ఎంట్రీకి ఐడీ కార్డులు పొంది వారు ఈ దందా కొనసాగించినట్లు చెప్పారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ పిలుపునిచ్చారు. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్ -
ట్రయాంగిల్ సీ‘రియల్’ స్టోరీ!
సాక్షి, హైదరాబాద్: టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసును ఎస్సార్‌నగర్ పోలీసులు కొలిక్కి తీసుకు వచ్చారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో పాటు సినీ నిర్మాత అశోక్‌రెడ్డి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవరాజ్‌రెడ్డి, రెండో నిందితుడు సాయికృష్ణారెడ్డిలను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. పరారీలో ఉన్న అశోక్‌రెడ్డి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో గొల్లప్రోలు గ్రామానికి చెందిన శ్రావణి నటనపై ఉన్న ఆసక్తితో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వలసవచ్చింది. ఆమెకు ఐదేళ్ల క్రితం సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. సాయి ఏపీలోని అనంతపురం నుంచి వచ్చి, నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. శ్రావణితో సన్నిహితంగా ఉండటంతో పాటు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న సాయి కొన్నాళ్లకు ఆమె కుటుంబానికీ దగ్గరయ్యాడు. అయితే కొన్ని స్పర్థలు తలెత్తిన నేపథ్యంలో శ్రావణి–సాయిలు 2018లో దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె కుటుంబంతో సాయి సంబంధాలు కొనసాగించాడు. అదే ఏడాది అశోక్‌రెడ్డి నిర్మించిన ‘ప్రేమతో కార్తీక్’ చిత్రంలో శ్రావణి నటించింది. అప్పటి నుంచి అశోక్‌రెడ్డితో ఆమె పరిచయం కొనసాగింది. టిక్‌టాక్‌తో పరిచయం.. ఇదిలా ఉండగా.. టిక్‌టాక్ ద్వారా గత ఏడాది ఆగస్టు 8న శ్రావణికి కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డితో పరిచయమైంది. ఓ సీరియల్లో నటించేందుకు ఆడిషన్స్ కోసం దేవరాజ్ గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో శ్రావణి ఇంట్లోనే తొమ్మిది రోజుల పాటు ఉన్నాడు. ఈ తొమ్మిది రోజుల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. శ్రావణి ఇంట్లో ఉన్న సందర్భంలోనే దేవరాజ్‌రెడ్డి.. ఆమె ఫోన్లోని వివరాలను పరిశీలించాడు. ఆమెకు అశోక్‌రెడ్డితో పాటు సాయికృష్ణతోనూ సంబంధం ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టిన దేవరాజ్‌రెడ్డి తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఆపై కొన్ని సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మళ్లీ హైదరాబాద్ వచ్చిన అతను సీతాఫల్మండి ప్రాంతంలో కుటుంబంతో సహా స్థిరపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఓ నటుడి పుట్టినరోజు వేడుకను శ్రావణి ఇంట్లో నిర్వహించారు. దేవరాజ్‌ను కూడా ఆమె ఈ వేడుకకు ఆహ్వానించింది. ఆ సందర్భంలో ఆమె అందరి ముందూ ‘ఐ లవ్ దేవరాజ్‌రెడ్డి’అంటూ ప్రకటించింది. అయితే శ్రావణికి అశోక్‌రెడ్డితో పాటు సాయితోనూ సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే తనకు ఆమెపై ఆసక్తి లేదని అతను చెప్పాడు. దేవరాజ్‌కు సర్దిచెప్పడానికి శ్రావణి ప్రయత్నించినా.. అతడు తిరస్కరించాడు. దేవరాజ్‌తో ఘర్షణ.. కేసులు.. కాగా, ఈ ఏడాది మార్చి 20వ తేదీ రాత్రి దేవరాజ్‌కు ఫోన్ చేసిన శ్రావణి, అతడిని చంపేస్తానంటూ బెదిరించింది. సాయి, అశోక్‌రెడ్డిల పేర్లు చెప్పి, వారితో సంబంధం ఉందంటూ తన జీవితం నాశనం చేస్తున్నావని హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ 21 రాత్రి 8.30 గంటలకు దేవరాజ్‌రెడ్డితో శ్రావణి ఘర్షణ పడింది. ఈ సందర్భంగా శ్రావణి తన సోదరుడు శివ, మరో యువతితో కలిసి అతనిపై దాడికి పాల్పడింది. నీ కారణంగా అశోక్‌రెడ్డితో స్పర్థ లు వచ్చాయంటూ.. వాగ్వాదానికి దిగి కొట్టా రు. దీనిపై దేవరాజ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ వెంటనే శ్రావణి తనను వేధిస్తున్నాడంటూ దేవరాజ్‌పై ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. అయితే చాటింగ్ ద్వారా దేవరాజ్‌కు నచ్చచెప్పడానికి శ్రావణి ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన అశోక్‌రెడ్డి, సాయికృష్ణతో పాటు శ్రావణి కుటుంబీకులు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. కాగా, ఈ నెల 7న శ్రావణిని ఓ షూటింగ్ లొకేషన్లో కలుసుకున్న దేవరాజ్‌రెడ్డి అక్కడ నుంచి ఆమెను పంజగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌కు తీసుకువెళ్లాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ ఆవేశంతో దేవరాజ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీన్ని శ్రావణి అడ్డుకోవడంతో ఆమె చెంపపై కొట్టిన సాయి ఆటోలో ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రోజు దేవరాజ్‌కు ఫోన్ చేసిన శ్రావణి తనను అశోక్‌రెడ్డి, సాయిలతో పాటు తన కుటుంబీకులూ వేధిస్తున్నారని చెప్పింది. ఆ తర్వాత ఫోన్ చేసిన శ్రావణి నీతో పాటు అశోక్‌రెడ్డి, సాయి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి చనిపోయింది. ఈ ఫోన్ రికార్డులన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరాజ్, సాయిలను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్మాత అశోక్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
శ్రావణి కేసు: కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో నిందితులైన దేవరాజ్, సాయిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణి 2012లో టీవీల్లో పనిచేయాలని హైదరాబాద్‌కి వచ్చింది. 2015లో సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నిర్మాత అశోక్ రెడ్డి పరిచయం అయ్యారు. 2019లో దేవరాజ్ రెడ్డి పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ కూడా శ్రావణిని పెళ్లి చేసుకుంటామని వేధించారు. అదే క్రమంలో దేవరాజ్‌తో దూరంగా ఉండలాని సాయికృష్ణ పలు సందర్భాల్లో శ్రావణితో గొడవ పడ్డాడు. (శ్రావణి కేసు: పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత) దేవరాజ్‌తో చనువుగా ఉండటం నచ్చని శ్రావణి తల్లి తండ్రులు, సాయి అతనితో మాట్లాడకూడదని వేధించారు. శ్రావణిని సాయి, ఆమె తల్లిదండ్రులు కొట్టారని దేవరాజ్ చెప్పాడు. అనేక సార్లు సాయి తన దగ్గర ఉన్న ఫోటోలతో శ్రావణిని బెదిరించాడు. అయితే దేవరాజ్ కూడా పెళ్లి చేసుకుంటనని చెప్పి మోసం చేసాడు. అంతకుముందే దేవరాజ్‌పై శ్రావణి కేస్ పెట్టింది. కాగా శ్రావణికి వేరే వాళ్లతో సంబంధాలు ఉండటంతో దేవరాజ్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఏ1గా సాయి కృష్ణారెడ్డి, ఏ2 అశోక్ రెడ్డి, ఏ3 దేవరాజ్ రెడ్డిలుగా గుర్తించాం. వీరిలో ఇప్పటికే దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డిలను అరెస్టు చేశాం. ఆర్ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. అతనిని అరెస్ట్ చేయాల్సి ఉంది' అని డీసీపీ తెలిపారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్) -
శ్రావణి కేసు: పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్‌ల నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో దేవరాజ్, సాయి రెడ్డిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కోవిడ్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్) మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి ఆర్ఎక్స్ 100 మూవీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది. ఇక శని, ఆదివారాల్లో కొనసాగిన విచారణలో నిందితులు కీలక అంశాలను రాబట్టారు. దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం, సాయి వేధింపులకు పాల్పడటం మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేవరాజ్, సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (మరో ట్విస్ట్: దేవరాజ్ తల్లికి శ్రావణి ఫోన్) -
శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలి నుంచీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మూడో వ్యక్తి ఆర్ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డిని సైతం సోమవారం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఆదివారం విచారణలో భాగంగా శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయిల స్టేట్మెంట్ను నమోదు చేశారు. దీనిలో భాగంగానే కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన ఎస్ఆర్నగర్ పోలీసులు సాయితో పాటు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కీలక ఆధారాలు లభ్యమైయ్యే వరకు ముగ్గురు అనుమానితులూ తమ అదుపులోని ఉంటారని పోలీసులు తెలిపారు. (దేవరాజ్‌తో వివాహం చేయండి : శ్రావణి) అయితే కేసు విచారణలో భాగంగానే శ్రావణి కుటుంబ సభ్యులు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. తమ కుమార్తె మరణానికి దేవరాజే కారణమని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. అయితే దేవరాజ్ మాత్రం సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాలు, ఆడియో రికార్డులను పోలీసులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. అయితే ఆదివారం నాటి విచారణతో కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది. (శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్) -
మరో ట్విస్ట్: దేవరాజ్ తల్లికి శ్రావణి ఫోన్
సాక్షి, హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే దేవరాజ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు, ఆదివారం శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుడు సాయిని కూడా విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రావణి, దేవరాజ్ తల్లి సత్యవతికి కాల్చేసిన ఓ ఆడియో లీకైంది. దీనిలో శ్రావణి-సత్యవతి పలు కీలక అంశాలపై చర్చించారు. దేవరాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమైన, అతనితో తన వివాహం జరిపించాలని సత్యవతిని శ్రావణి వేడుకుంది. అంతేకాకుండా కట్నకానుకలతో పాటు పెళ్లి ఖర్చంతా తానే బరిస్తానని కూడా చెప్పింది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దేవరాజ్‌పై పెట్టిన కేసు గురించి సత్యవతి ప్రశ్నించింది. మొదట కేసును ఉపసంహించుకోవాలని ఆమె శ్రావణిని కోరింది. (‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’) దానికి సరే అన్న శ్రావణి మీరు ఓకే అంటే కేసు విత్‌డ్రా చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుంటామని చెప్పింది. తాము ఇద్దం వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటామని సత్యవతిని బతిమిలాడింది. అయితే పోలీసుల విచారణలో ఈ ఆడియో కూడా కీలక కానుంది. కాగా ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ వచ్చిన శ్రావణి కుటుంబ సభ్యులు, సాయిలను ఎస్ఆర్నగర్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు వీరిద్దరి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. (గువ్వల్ని మింగుతున్న గద్దలు). , కొనసాగుతున్న కీలక విచారణ శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఆదివారం సాయి పోలీసులు ముందు విచారణకు హాజరైయ్యాడు. దేవరాజు, సాయి కృష్ణను ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్న నేపథ్యంలో నేటి విచారనే కీలకం కానుంది. కేసు విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న కేసు నుండి తప్పించు కొనేందుకే దేవరాజ్ మరోసారి శ్రావణిని బుట్టలో వేసుకున్నాడని సాయి చెబుతున్నాడు. మరోవైపు సాయి వేధింపులు వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు వాదిస్తున్నాడు. అయితే ఇద్దరిని విచారిస్తున్న నేపథ్యంలో కేసు నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
యువతులతో పట్టుబడ్డ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్ : గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నాగేందర్ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్ భవన్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అమీర్‌పేట్‌లో వ్యభిచారం దందా నడుస్తున్నట్లు ఎస్సార్‌నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి నిర్వహించిన పోలీసులకు నాగేందర్ ముగ్గురు యవతులతో అడ్డంగా దొరికిపోయాడు. నాగేందర్‌తో పాటు, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (లిఫ్ట్‌లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం) -
ఎస్సార్ నగర్లో క్రేన్ బీభత్సం
-
తాళం వేసిన ఇళ్లే టార్గెట్..
అమీర్‌పేట: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారంపంజగుట్ట ఏపీసీ తిరుపతన్న వివరాలను వెళ్లడించారు. వైజాగ్, చెన్నగడిలి మండలం పీఎం పాలెం గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ నగరానికి వలసవచ్చి డ్రైవర్‌గా పని చేస్తూ రహమత్‌నగర్ వీడియో గల్లీలో ఉంటున్నాడు. అదే ప్రాంతోలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండెల నాగభాస్కర్రావు అలియాస్ బొబ్బిలితో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మధ్యాహ్న వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి పూట పంజా విసురుతున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, మేడిపల్లి స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి తప్పించు తిరుగుతున్నారు. సోమవారం వీరిని అరెస్ట్ చేసిన క్రైం పోలీసులు వారి నుంచి రూ.4 లక్షల విలువైన 130 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, కట్టింగ్ ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ స్నాచర్ల ఆటకట్టు... సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన మియ్యనోల్ల సతీష్ అలియాస్ సత్తి, అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్ రాత్రి వేళల్లో బైక్‌పై తిరుగుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లే వారి ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇటీవల ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళుతున్న వ్యక్తి ఫోన్ లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్‌తో పాటు పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు.నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, వై.అజేయ్‌కుమార్ తదితరులను ఏసీపీ అభినందించారు. -
పోలీసులకు నటుడు ఉత్తేజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అలంకార్ డిజైనర్స్ పేరిట అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలో ఉత్తేజ్‌కు ఓ బట్టల షాపు ఉంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఆ షాపును నిర్వహిస్తున్నారు. శనివారం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చి కస్టమర్లలాగా నటిస్తూ ఖరీదైన చీరలను దొంగిలించుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పద్మావతి విషయాన్ని భర్తకు తెలియజేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఉత్తేజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి.. ఎస్సార్ నగర్ పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన చీరల విలువ రూ.80 వేలుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. -
అత్తింటికే కన్నం వేసిన అల్లుడు
-
వృద్ధురాలి ఇంట్లో చోరీ చేసింది అల్లుడే!
సాక్షి, ఎస్సార్‌నగర్(హైదరాబాద్): తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే కాబోలు. అత్తింటికే ఓ అల్లుడు కన్నం వేశాడు. పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. గత నెల 31వ తేదీన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీ నగర్లో ఆంటోనమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. ఆమెను గాయపరిచి ఇంట్లో కారం చల్లి 20 తులాల బంగారు ఆభరణాలు, నగదును దుండగులు చోరీ చేశారు. ఈ కేసును పోలీసులు పదిహేను రోజుల్లోనే ఛేదించారు. ఆమె అల్లుడే చోరీ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. దీంతో హ్యాపీ అనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. -
హైదరాబాద్‌లో రంగురాళ్ల బాబా అరెస్ట్
-
వ్యభిచార గృహంపై పోలీసులు దాడి: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ్‌నగర్ వెంచర్-3 లో ఓ ఇంటిపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలు, మహిళతోపాటు ఓ విటుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన మహిళ లక్షల్లో వడ్డీ వ్యాపారం చేస్తుందని పోలీసులు తెలిపారు. కల్యాణ్‌నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఆగంతకుడు పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేశారు. -
నకిలీ బ్రాండెడ్ వస్త్రాలు సీజ్: కేసు నమోదు
హైదరాబాద్: నకిలీ బ్రాండెడ్ వస్త్రాలను విక్రయిస్తున్న రెండు షాపులపై ఎస్ఆర్ నగర్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని అటైర్స్, గ్రాబిట్ పేరుతో ఉన్న దుకాణాల్లో నకిలీ ముఫ్తి జీన్స్ విక్రయిస్తున్నట్టు ఆ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు షాపులపై దాడి చేసి... 49 ప్యాంట్లు, టీ షర్టులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. షాపు యజమానులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రకుల్‌ప్రీత్ సింగ్ కోసం 3 గంటల పాటు రోడ్డు మూసివేశారు
హైదరాబాద్: ఎస్ ఆర్ నగర్ పోలీసుల అత్యుత్సాహం వాహనదారులను ఇక్కట్ల పాల్జేసింది. ’బహార్ కేఫ్’ ను ప్రారంభించేందుకు సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తుందని పోలీసులు ఓ రోడ్డును మూసివేశారు. దాదాపు 3 గంటల పాటు రహదారిని మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పోలీసుల అత్యుత్సాహంపై మండిపడ్డారు. సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ కోసం ప్రజలను ఇబ్బందులను గురి చేయడం తగదని అన్నారు. ఇక్కడి వంటకాలు ఎంతో ఇష్టం అమీర్‌పేట: హైదరాబాద్ వంటకాలంటే తనకు ఎంతో ఇష్టమని సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఎస్ఆర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ’బహార్ కేఫ్’ను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు నచ్చే నాణ్యమైన వంటకాలను అందించినప్పుడే ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు. లాఠీచార్జి సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తారన్న సమాచారంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎస్ఆర్నగర్ వచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాలు మీదుగా వాహనాలను దారి మళ్లించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై నిలబడటంతో నడిచేందుకు వీలులేని పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
ఏటీఎం దోపిడీ కేసు నిందితుడి అరెస్టు
-
ఏటీఎం దోపిడీ కేసు నిందితుడు పట్టుబడ్డాడిలా...
హైదరాబాద్: సంచలనం సృష్టించిన యూసఫ్ గూడ ఏటీఎం దోపిడీ కేసు నిందితుడిని పోలీసులు గురువారం రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి గత మూడేళ్లుగా ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉంటూ నేరాలకు పాల్పతున్నాడని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. విలాసాలకు అలవాటుపడి అతడు వక్రమార్గం పట్టాడని చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అతన్ని పట్టుకున్నామని వెల్లడించారు. యూసఫ్ గూడ ఏటీఎంలో చొరబడి నాటు తుపాకీతో యువతిని బెదిరించి ఏటీఎం కార్డు, ఆభరణాలు ఎత్తుకుపోయాడన్నారు. యువతిని భయపెట్టేందుకు తుపాకీతో పక్కకు కాల్చాడని వెల్లడించారు. తన తెలిసిన వారి సహకారంతో మహారాష్ట్రలో ఈ తుపాకీ కొనుగోలు చేసినట్టు నిందితుడు చెప్పాడని కమిషర్ తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకుని 24 గంటల్లో ఛేదించామన్నారు. అతడి వద్ద నుంచి 3 ఏటీఎం కార్డులు, 5 సెల్ ఫోన్లు, బంగారపు గొలుసు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హాస్టల్స్ లో చేరే వారి విషయంలో హాస్టల్స్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఏటీఎం కేంద్రాల్లో తప్పనిసరిగా సెక్యురిటీ ఉండాలని, క్వాలిటీ సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించినట్టు కమిషనర్ చెప్పారు. -
ఏటీఎం దోపిడీ కేసు నిందితుడి అరెస్టు
యూసుఫ్‌గూడలోని ఏటీఎం సెంటర్లో రివాల్వర్‌తో బెదిరించి యువతి నుంచి సొత్తు దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్లిన యువతిని నిందితుడు తన వద్ద ఉన్న రివాల్వర్‌తో బెదిరించి.. గాల్లోకి కాల్పులు కూడా జరిపి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, నగదు తదితరాలను దోచుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఒక్క రోజులోనే నిందితుడిని పట్టుకోగలిగారు. అతడివద్ద నుంచి తుపాకి, మూడు బుల్లెట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. -
ఏటీఎం దోపిడీ వీడియో విడుదల
యూసుఫ్‌గూడ ఏటీఎం దోపిడీ కేసులో విచారణ వేగవంతమైంది. ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లో నిందితుడిని పోలీసులు గుర్తించారు. యూసుఫ్‌గూడ ఆర్బీఎస్ ఏటీఎం కేంద్రంలో బుధవారం ఉదయం 7.25కు సాఫ్ట్వేర్ ఉద్యోగిని డబ్బులు డ్రా చేస్తుండగా... ఆమెపై దాడి జరిగింది. ముసుగుతో లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తాను కష్టాల్లో ఉన్న నగదు కావాలంటూ తుపాకీతో బెదిరించాడు. ఈ బెదిరింపుల వీడియో క్లిప్పింగును పోలీసులు గురువారం విడుదల చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీటీవీ ఫుటేజిలో అతడు బెదిరించి, బయటకు వెళ్లేవరకు ఉన్న దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అయితే అతడు ముసుగుతో రావడంతో కచ్చితంగా నిందితుడిని గుర్తించడం కొంత కష్టంగా మారింది. నిందితుడు తన వద్ద ఉన్న రివాల్వర్ తో ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి తన వద్ద ఉన్న డెబిట్ కార్డు, బంగారు నగలు ఇచ్చేసింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు మరో ఏటీఎంలో రూ. 3,500 డ్రా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు
-
ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు
హైదరాబాద్: యూసఫ్‌గూడలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద బుధవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించింది. ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తున్న యువతిపై ఆగంతకులు కాల్పులు జరిపారు. అనంతరం ఆమె నుంచి నగలు, నగదు దోచుకుని అక్కడి నుంచి పరారైయ్యారు. వెంటనే తేరుకున్న సదరు యువతి స్థానికుల సహాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఏటీఎం పరిసర ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించి... నిందితులకు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యువతి మధురానగర్ హాస్టల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఈ రోజు ఉదయం 7.30 గంటలకు చోటు చేసుకుంది. -
ఐ ఫోన్ల పౌచ్‌లో బండరాయి..ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : ఐ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకు విక్రయిస్తామని, దృష్టి మరలిచి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి, రూ. లక్షా 3 వేల నగదు, లక్షా 57 వేలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ కె.ఆర్.నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ నగర్ డీఐ శంకర్ వివరాల ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్ పసంద గ్రామానికి చెందిన మహ్మద్ అబ్బాస్(31), మహ్మద్ మెహందీ హసన్ (35) గతలో వస్త్రవ్యాపారం చేశారు. నగరంలో దుస్తులు కొని తమ స్వస్థలంలో విక్రయించేవారు. వీరి గ్రామంలో 80 శాతం మంది చోరీలు చేస్తూ జీవిస్తారు. కాగా, వీరికి వ్యాపారంలో నష్టాలు రావడంతో తాము కూడా అదే బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక ఐఫోన్, యాపిల్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి వాటిని పట్టుకొని నగరానికి వచ్చారు. దానిని విక్రయిస్తామని విద్యార్థులకు చూపిస్తారు. డబ్బులు అత్యవసరమై రూ. 40 వేల ఫోన్‌ను రూ. 20 వేలకే విక్రయిస్తున్నామని చెప్తారు. కొనుగోలుదారుల దృష్టి మరల్చి ఐఫోన్ ఉన్న పౌచ్‌ను జేబులో పెట్టుకొని.. దాని స్థానంలో బండారాయి ఉన్న పౌచ్‌ను చేతిలో పెట్టి డబ్బు తీసుకొని ఉడాయిస్తారు. ఇదే విధంగా ల్యాప్‌టాప్‌లు విక్రయిస్తామని మోసం చేస్తున్నారు. నిన్న ఉదయం ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టిన క్రైం ఎస్ రవికుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిపై అనుమానం కలిగి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. అబ్బాస్, హసన్‌ల నుంచి నగదు, బైక్, ల్యాప్‌టాప్, యాపిల్ ఫోన్, ఒక బండరాయి, పది ఖాళీ ఐఫోన్ పౌచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్
-
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోతీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లోవ్యభిచారం చేస్తుండగా... ఓ టీవీ ఆర్టిస్ట్‌ను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దర్నీ అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన టీవీ ఆర్టిస్ట్ కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్న ఓ నటిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
పోష్ కుర్రాడిలా గెటప్, పబ్బుల్లో వినోదం..ఆపై చోరీలు
హైదరాబాద్ : సంపన్న కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా గెటప్... బ్రాండెడ్ వస్తువులు... పబ్బుల్లో వినోదం... అక్కడికొచ్చే అమ్మాయిలతో పరిచయం. అమ్మాయిల ఇళ్ల వరకూ ప్రయాణం.. ప్రేమ పేరుతో మోసం.. వాళ్లకి తెలియకుండా అమ్మాయిల చుట్టుపక్కల ఇళ్లల్లో చోరీలు... ఇంజినీరింగ్ చదివిన ఓ ప్రబుద్ధుడి తీరిది. ఎవరికీ అనుమానం రాకుండా రెండున్నరేళ్ల నుంచి ఇలా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు సవాల్‌గా మారిన ప్రేమదొంగ మదన్... ఎట్టకేలకు శుక్రవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 30 లక్షలకుపైగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కారును సీజ్ చేసి, విచారణ జరుపుతున్నారు. -
నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన
హైదరాబాద్ : సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్‌గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా వస్తున్నట్లు గమనించి దుండగులు స్నాచింగ్‌కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే శ్రీలక్ష్మిని ఎక్కడి నుంచి వెంబడించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీలక్ష్మి నివాసం నుంచి యూసుఫ్‌గూడలోని బేకరీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీలక్ష్మికి ...ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అందచేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. -
రిటైర్డ్ ఏసీపీపై లైంగిక వేధింపుల కేసు నమోదు
హైదరాబాద్: బల్కంపేట డివిజన్ బాపూనగర్‌కు చెందిన పోలీసు రిటైర్ ఏసీపీపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అత్తిలి లక్ష్మి బాపూనగర్‌లోని పోలీసు విభాగంలో పని చేసి రిటైర్ ఏసీపీ గులాబ్‌సింగ్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని హాస్టల్ నడుపుతుంది. కిరాయి కోసం వచ్చిన ప్రతిసారీ గులాబ్‌సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రోజులు గడుస్తున్నా నిందితుడిపై చర్యలు తీసుకోవటం లేదని బాధితురాలు శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి విలేకరులకు తెలిపింది.తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.