వివరాలు వెళ్లడిస్తున్న ఏసీపీ తిరుపతన్న
అమీర్‌పేట: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారంపంజగుట్ట ఏపీసీ తిరుపతన్న వివరాలను వెళ్లడించారు. వైజాగ్, చెన్నగడిలి మండలం పీఎం పాలెం గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ నగరానికి వలసవచ్చి డ్రైవర్‌గా పని చేస్తూ రహమత్‌నగర్ వీడియో గల్లీలో ఉంటున్నాడు. అదే ప్రాంతోలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండెల నాగభాస్కర్‌రావు అలియాస్ బొబ్బిలితో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మధ్యాహ్న వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి పూట పంజా విసురుతున్నారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, మేడిపల్లి స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి తప్పించు తిరుగుతున్నారు. సోమవారం వీరిని అరెస్ట్ చేసిన క్రైం పోలీసులు వారి నుంచి రూ.4 లక్షల విలువైన 130 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, కట్టింగ్ ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సెల్ ఫోన్ స్నాచర్ల ఆటకట్టు...
సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన మియ్యనోల్ల సతీష్ అలియాస్ సత్తి, అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్ రాత్రి వేళల్లో బైక్‌పై తిరుగుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లే వారి ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇటీవల ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళుతున్న వ్యక్తి ఫోన్ లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్‌తో పాటు పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు.నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం ఇన్స్‌పెక్టర్లు మురళీకృష్ణ, వై.అజేయ్‌కుమార్ తదితరులను ఏసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment