మైనర్‌తో ప్రేమ, పెళ్లి.. నెల నుంచే బాలికను వేధిస్తూ  | HYD: Pokso Act Filed On young Man For Harrasing Girl In The Name of Love Marriege | Sakshi
Sakshi News home page

మైనర్‌తో ప్రేమ, పెళ్లి.. నెల నుంచే బాలికను వేధిస్తూ 

Published Thu, Apr 14 2022 1:34 PM | Last Updated on Thu, Apr 14 2022 2:09 PM

HYD: Pokso Act Filed On young Man For Harrasing Girl In The Name of Love Marriege - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమీర్‌పేట: ప్రేమ పేరిట బాలిక వెంటపడి, పెళ్లి చేసుకుని వేధిస్తున్న యువకుడిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లో నివాసముంటున్న 16 ఏళ్ల మైనర్‌ బాలిక 2017లో వేసవి సెలవుల్లో ఎల్లారెడ్డిగూడలో తాత, అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే ఎరోళ్ల వివేక్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను గతేడాది నవంబర్‌ 8న వెంట తీసుకుని వెళ్లి 12న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి వచ్చి ఎల్లారెడ్డిగూడలో కాపురం పెట్టాడు. 5 నెలల నుంచి బాలికను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో బుధవారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు పాల్పడిన వివేక్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement