ఏటీఎం దోపిడీ కేసు నిందితుడి అరెస్టు | atm robbery case, accused arrested by hyderabad police | Sakshi
Sakshi News home page

ఏటీఎం దోపిడీ కేసు నిందితుడి అరెస్టు

Published Thu, May 21 2015 6:11 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

atm robbery case, accused arrested by hyderabad police

యూసుఫ్గూడలోని ఏటీఎం సెంటర్లో రివాల్వర్తో బెదిరించి యువతి నుంచి సొత్తు దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్లిన యువతిని నిందితుడు తన వద్ద ఉన్న రివాల్వర్తో బెదిరించి.. గాల్లోకి కాల్పులు కూడా జరిపి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్, ఏటీఎం కార్డు, నగదు తదితరాలను దోచుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఒక్క రోజులోనే నిందితుడిని పట్టుకోగలిగారు. అతడివద్ద నుంచి తుపాకి, మూడు బుల్లెట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement