ఆదిలాబాద్: పనిఒత్తిడి భరించలేక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాంకిడి శాఖ మేనేజర్ పురుగుల మందు తాగగా ఆస్పత్రితో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై సాగర్ వివరాల ప్రకారం.. జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన జనోత్ సురేష్ రెండేళ్ల క్రితం వాంకిడి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో మేనేజర్‌గా వచ్చారు. ఫీల్డ్ ఆఫీసర్ విధులు సైతం తానే నిర్వహిస్తూ పై అధికారుల ఒత్తిడికి గురయ్యాడు.
డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లి పనిఒత్తిడితో నీరసంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే గురువారం విధులకు వెళ్లిన మేనేజర్ సాయంత్రం 7.30గంటల సమయంలో బ్యాంకులోనే పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకోవడంతో గమనించిన బ్యాంకు సిబ్బంది ఆరా తీసి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మిరాజం ఫిర్యాదు మేరకు కేసు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చింతగూడలో విషాదం
జన్నారం: మండలంలోని చింతగూడ గ్రామవాసి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ బానవత్ సురేశ్ (35) ఆత్మహత్యకు పాల్పడగా స్వగ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చింతగూడ గ్రామానికి చెందిన బనావత్ లక్ష్మి రాజం, విజయ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు. ఇందులో సురేశ్ పెద్దవాడు. అందరికి వివాహం జరిగింది. సురేశ్ బ్యాంక్ క్యాషియర్‌గా ఉద్యోగం సాధించాడు.
వివిధ ప్రాంతాల్లో క్యాషియర్‌గా, సబ్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ సంవత్సరం క్రితం వాంకిడి మండలానికి మేనేజర్‌గా బదిలీ అయ్యాడు. ఆయనకు భార్య ప్రియాంక, కొడుకు విరాన్ష్(4)ఉన్నారు. సురేశ్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆయన మరణవార్త తెలియగానే గ్రామానికి చెందిన బంధువులు కరీంనగర్ తరలివెళ్లారు. మృతదేహాన్ని పోసు ్టమార్టం నిమిత్తం గ్రామానికి తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment