Bank Manager
-
లోన్ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్ మేనేజర్!
చత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్‌కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్‌లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసి మేనేజర్‌కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్‌పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పని ఒత్తిడికి మరొకరు బలి.. అటల్ సేతు పైనుంచి దూకి..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. ముంబైలోని అటల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని మృతుని భార్య మీడియాకు తెలిపారు. ఇటీవల పూణెలోని ఒక సీఏ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి పని ఒత్తిడిన తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉదంతం మరువక ముందే ముంబైలో ఇదే తరహా విషాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సుశాంత్ చక్రవర్తి(40) అనే వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును అటల్ సేతుకు ఒకవైపున నిలిపాడు. ఆ తరువాత బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకాడు. మృతుడు ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మృతునికి భార్య, ఏడాది కుమార్తె, తల్లి ఉన్నారు.మృతుని భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు సుశాంత్ చాలా కాలంగా ఆఫీసులో పని భారంతో ఆందోళన చెందుతున్నాడని తెలిపారు. కాగా సుశాంత్ ఇటీవలే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశాంత్ చక్రవర్తి మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.ఇది కూడా చదవండి: కత్తితో దాడి.. ముగ్గురు మృతి -
Maharashtra: ‘హాట్ స్పాట్’ వివాదం.. బ్యాంక్ మేనేజర్ హత్య
పూణె: మహారాష్ట్రలోని పూణెలో దారుణ హత్య చోటుచేసుకుంది. మొబైల్ హాట్ స్పాట్ ఇచ్చే విషయంలో వివాదం చోటుచేసుకుని అది బ్యాంక్ మేనేజర్ హత్యకు దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడం విశేషం.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న వాసుదేవ్ రామచంద్ర కులకర్ణి(47)ని నలుగురు కుర్రాళ్లు హత్య చేశారు. కులకర్ణి తన ఇంటి దగ్గర వాకింగ్‌కు వెళుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు కులకర్ణిని మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేయాలని అడిగారు. ఆయన అభ్యంతరం చెప్పిన నేపధ్యంలో వారి మధ్య వివాదం నెలకొంది. ఆగ్రహంతో ఆ యువకులు బ్యాంక్ మేనేజర్‌పై దాడిచేసి హత్య చేశారు. ఈ ఉందంతంలో నిందితులును పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆశపడితే మొదటికే మోసం! బ్యాంక్ మేనేజర్‌కి జరిగింది ఇదే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్, సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా బ్యాంక్ మేనేజర్ వంటి అవగాహన ఉన్న ఉన్నత ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. రూ.లక్షల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. పుణేలో ఓ బ్యాంక్ మేనేజర్ ఇలాగే ఆన్లైన్ టాస్క్‌ల మోసానికి గురయ్యారు. మొదట ఫారమ్‌లను నింపడం, వీడియోలను చూడటం వంటి చిన్న చిన్న టాస్క్‌లను ఇచ్చిన మోసగాళ్లు పూర్తయిన తర్వాత వెంటనే అతని బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేశారు. బాధితుడు వారిని విశ్వసించడం ప్రారంభించిన తర్వాత "టాస్క్ యాక్టివేషన్ ఫీజు" అడగడం ప్రారంభించారు. ఇలా రూ. 15 లక్షలకు పైగా అతని నుంచి రాబట్టారు. బాధితుడు ఆన్లైన్ వారిచ్చిన 27 టాస్క్‌లను పూర్తి చేసినా వాటికి డబ్బు మాత్రం చెల్లించలేదు. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఎర టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో స్కామర్లు బ్యాంక్ మేనేజర్‌కు ఎర వేశారు. ఈ మేరకు బాధితుడి ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఇది నిజమేనని నమ్మిన బ్యాంక్ మేనేజర్ స్కామర్లను సంప్రదించాడు. ఖాళీ సమయంలో ఇంటి నుంచి పని చేయడం ద్వారా అద్భుతమైన రాబడి వస్తుందని వారు ఆయన్ను నమ్మించారు. తర్వాత ఒక గ్రూపులో నమోదు చేసుకోవాలని చెప్పి టాస్క్‌లు ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో కొన్ని టాస్క్‌లు పూర్తి చేసిన కొంత డబ్బు వచ్చింది. ఆ తర్వాత టాస్క్‌లను యాక్టివ్ చేయడానికి బాధితుడి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించారు. మొదట్లో వెంటనే డబ్బు అలా ఒక టాస్క్‌లో భాగంగా అతన్ని 27 విమాన టిక్కెట్లు బుక్ చేయమని అడిగారు. ఈ టాస్క్‌ను యాక్టివేట్ చేయడానికి రూ. 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ డబ్బును డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసిన బాధితుడి బ్యాంకు ఖాతాలో రూ. 16,321 జమయ్యాయి. దీని తరువాత టాస్క్‌ల యాక్టివేషన్ కోసం బ్యాంక్ మేనేజర్ వారికి డబ్బు పంపడం ప్రారంభించాడు. వారిచ్చిన 27 టాస్క్‌లు పూర్తి చేశాడు. వాటి మీద వచ్చిన సొమ్మును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా మరో మూడు టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్కామర్లు అతనికి చెప్పారు. అంతే కాదు వాటిని యాక్టివేట్ చేసేందుకు మరో రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. -
డ్రైవర్‌కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
ఇటీవల తమిళనాడులో సాధారణ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 9000కోట్లు జమయ్యాయన్న వార్త సోషల్ మీడియా ద్వారా తెగ చక్కర్లు కొట్టింది. ఆ వ్యక్తి ఇంత డబ్బు వచ్చిందని సంతోషపడేలోపు అతని ఆశలన్నీ ఆవిరైపోయాయి. కాగా దీనికి కారణమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ తన పదవికి రాజీనామా చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'ఎస్ కృష్ణన్' గురువారం తన రాజీనామాను సమర్పించారు. చెన్నై క్యాబ్ డ్రైవర్‌కు రూ.9,000 కోట్లు తప్పుగా జమ చేసిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే తన రాజీనామాకు ఇది కాదని, కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే అని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో గతేడాది సెప్టెంబర్‌లో టీఎంబీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ 2023 సెప్టెంబరు 28న జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రాజీనామాను ఆమోదించి, వారి మార్గదర్శకత్వం లేదా సలహా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి ఫార్వార్డ్ చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. డ్రైవర్‌కు రూ.9,000 కోట్లు ఖాతాలో యాడ్ అవ్వగానే ఇదేదో స్కామ్ అనుకున్నాడు, కానీ అనుమానంతో తమ ఫ్రెండుకు రూ. 21,000 ట్రాన్స్ఫర్ చేసాడు. ఈ ట్రాన్స్ఫర్ సక్సెస్ అవ్వడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఇది జరిగిన కేవలం కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ మొత్తాన్ని బ్యాంక్ డెబిట్ చేసింది. -
పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్
ఆధునిక కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనకు సంబంధం లేకుండానే మనపేరు మీద లోన్ తీసుకోవడం వంటి సంఘటనలు గత కొంత కాలంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం పాన్, ఆధార్ జిరాక్స్ కాపీల కోసం జిరాక్స్ సెంటర్‌కు వెల్తూ ఉంటాము. అలాంటప్పుడు మన కాపీలను కొంతమంది వినియోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. నిజానికి మనకు సంబంధం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మెసేజ్‌లు లేదా మెయిల్స్ వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సరిగ్గా పట్టించుకోకుంటే మోసపోయినట్లు చివరి వరకు కూడా తెలిసే అవకాశం లేదు. ఇలాంటి ఉదండమే తాజాగా వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 8.5కోట్ల రూపాయల విలువ చేసే బంగారం విషయంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు సంబంధించిన నిల్వల్లో తేడాలున్నట్లు ఆడిట్లో తెలిసింది. దీనిపైన బ్యాంకు డిప్యూటీ మేనేజర్ 'బైరిశెట్టి కార్తీక్'పై అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ను వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 5 పద్ధతుల్లో 128 ఖాతాదారులపేరిట గోల్డ్ లోన్ పొందినట్లు రికార్డులు తయారు చేసి బ్యాంకును మోసం చేసినట్లు, వచ్చిన డబ్బును ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు వెల్లడించారు. -
పని ఒత్తిడితో ఎస్బీఐ మేనేజర్ ఆత్మహత్య
ఆదిలాబాద్: పనిఒత్తిడి భరించలేక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాంకిడి శాఖ మేనేజర్ పురుగుల మందు తాగగా ఆస్పత్రితో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై సాగర్ వివరాల ప్రకారం.. జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన జనోత్ సురేష్ రెండేళ్ల క్రితం వాంకిడి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో మేనేజర్‌గా వచ్చారు. ఫీల్డ్ ఆఫీసర్ విధులు సైతం తానే నిర్వహిస్తూ పై అధికారుల ఒత్తిడికి గురయ్యాడు. డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లి పనిఒత్తిడితో నీరసంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే గురువారం విధులకు వెళ్లిన మేనేజర్ సాయంత్రం 7.30గంటల సమయంలో బ్యాంకులోనే పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకోవడంతో గమనించిన బ్యాంకు సిబ్బంది ఆరా తీసి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మిరాజం ఫిర్యాదు మేరకు కేసు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చింతగూడలో విషాదం జన్నారం: మండలంలోని చింతగూడ గ్రామవాసి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ బానవత్ సురేశ్ (35) ఆత్మహత్యకు పాల్పడగా స్వగ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చింతగూడ గ్రామానికి చెందిన బనావత్ లక్ష్మి రాజం, విజయ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు. ఇందులో సురేశ్ పెద్దవాడు. అందరికి వివాహం జరిగింది. సురేశ్ బ్యాంక్ క్యాషియర్‌గా ఉద్యోగం సాధించాడు. వివిధ ప్రాంతాల్లో క్యాషియర్‌గా, సబ్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ సంవత్సరం క్రితం వాంకిడి మండలానికి మేనేజర్‌గా బదిలీ అయ్యాడు. ఆయనకు భార్య ప్రియాంక, కొడుకు విరాన్ష్(4)ఉన్నారు. సురేశ్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆయన మరణవార్త తెలియగానే గ్రామానికి చెందిన బంధువులు కరీంనగర్ తరలివెళ్లారు. మృతదేహాన్ని పోసు ్టమార్టం నిమిత్తం గ్రామానికి తరలించనున్నారు. -
బ్యాంకు మేనేజర్ రూ.కోటి స్వాహా
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచులో రూ.కోటి నగదు మాయమైంది. ఈ విషయం రెండు నెలల తర్వాత ఆలస్యంగా బయటకు పొక్కింది. మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. రాయదుర్గం అర్బన్ సీఐ లక్ష్మన్న తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతంలో ఇక్కడ మేనేజర్‌గా ఎస్ఎల్ఎన్ ఫణికుమార్ పనిచేశారు. ఆయన తన తల్లితో పాటు ఇతరుల ఖాతాలకు రూ.1,00,07,323 నగదును మళ్లించి స్వాహాకు యత్నించారు. దీన్ని ఉన్నతాధికారులు గుర్తించి తనిఖీలు నిర్వహించారు. నగదు ఇతరుల ఖాతాలకు అక్రమంగా మళ్లించినట్లు నిర్ధారించుకున్నారు. ఈ ఏడాది జూన్ 21న ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు స్థానిక అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మేనేజర్‌పై 409, 420, 468, 471, 477–ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ విషయం బయటకు పొక్కకుండా ఎస్బీఐ సిబ్బంది, పోలీసులు ఇన్నాళ్లూ జాగ్రత్తపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎట్టకేలకు బహిర్గతమైంది. బ్యాంకు అధికారులు నగదు రికవరీ చేయడంతో పాటు మేనేజరును విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసింది. -
ఐఏఎస్ కల నెరవేరక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
కర్ణాటక: సివిల్స్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ కావాలి, సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలి అనుకున్న ఒక యువతి కల ఫలించలేదు. బ్యాంకు ఉద్యోగంతో తృప్తి పడలేక, ఐఏఎస్ కాలేక మనోవ్యథతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండ్య నగరంలో చోటు చేసుకుంది. కావేరి గ్రామీణ బ్యాంక్ ప్రాదేశిక కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న శృతి (30) స్వస్థలం చామరాజనగర జిల్లా కొళ్లేగాల. తండ్రి మల్లప్ప వ్యవసాయం చేసేవాడు. ముందు నుంచి ఆమె చదువులో చురుగ్గా ఉండేది. ఎలాగైనా ఐఏఎస్‌కు ఎంపిక కావాలని అనుకుంది. కానీ జీవితంలో ఉన్న ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదు. తరువాత ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ చూపి ప్రస్తుత ఉద్యోగం సంపాదించింది. మండ్య నగరంలోని వినాయక లేఔట్‌లోని అద్దె ఇంటిలో ఆదివారం రాత్రి డెత్‌నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని సమాచారం. మండ్య గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో బ్యాంకు మేనేజర్ మృతి
వత్సవాయి(జగ్గయ్యపేట): మండలంలోని కొంగరమల్లయ్య గట్టు వద్ద ఉన్న టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో వత్సవాయి కేడీసీసీ బ్యాంకు మేనేజర్ మక్కమాల వెంకటరామన్(48) మృతి చెందారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకటరామన్ ఉద్యోగరీత్యా విజయవాడ దగ్గర గొల్లపూడిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే విధులకు హాజరమ్యేందుకు సోమవారం గొల్లపూడి నుంచి బస్సులో వత్సవాయి బయలుదేరారు. నందిగామలో బస్సు దిగి బ్యాంకు రికవరీ కారులో డ్రైవర్‌తో కలిసి వత్సవాయి బయలుదేరారు. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి ఓ కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని రెండో మార్గంలో బ్యాంకు మేనేజర్ వెంకటరామన్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన వెంకటరామన్ అక్కడికక్కడే మృతిచెందారు. బ్యాంకు రివకరీ కారు డ్రైవర్ ఎం.శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడటంతో 108 వాహనంలో తొలుత జగ్గయ్యపేట ప్రభుత్వాస్పతికి తరలించి ప్రథమ చికిత్సచేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నడుపు తున్న సూర్యనారాయణ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై ఎస్ఐ బి.అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
ఫోన్‌కు వచ్చిన లింక్ క్లిక్ చేసిన బ్యాంక్ మేనేజర్.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!
సాక్షి, వరంగల్: ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ సీనియర్ బ్యాంక్ అధికారే సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసి మోసపోయారు. తన ఖాతా నుంచి రూ.2,24,967 పోగొట్టుకున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పరకాల ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ సకల్ దేవ్‌సింగ్ ఫోన్‌కు ఈ నెల 23న రాత్రి ఓ వ్యక్తి (89878 61993) నుంచి ‘ఎస్బీఐ అకౌంట్ డీయాక్టివేటెడ్..ప్లీజ్ క్లిక్ అన్‌ద లింక్ అండ్ అప్డేట్ పాన్‌కార్డు నంబర్ ఇమీడియట్లీ’అనే మెసేజ్ వచ్చింది. తెల్లవారుజామున దాన్ని చూసుకున్న దేవ్‌సింగ్ ఆ మెసేజ్‌పై రెండుసార్లు క్లిక్ చేశారు. రెండుసార్లు క్లిక్ చేయడంతో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయింది. పాస్వర్డ్ ఎంటర్ చేయమనడంతో చేశారు. ఆ తర్వాత మరో కొత్త నంబర్ 74318 29447 నుంచి ఫోన్ వచ్చింది. తాము పంపిన మెసేజ్‌పై క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలని, పాన్‌కార్డు అప్డేట్ చేయమని అతను చెప్పడంతో.. తాను బస్‌లో ఉండడం వల్ల సాధ్యం కావడం లేదని, బ్యాంక్‌కు వెళ్లి ప్రయత్నిస్తానని దేవ్‌సింగ్ సమాధానం ఇచ్చారు. దీంతో వాట్సాప్‌కు మరో కొత్త నంబర్ 79087 54873 నుంచి మెస్సెజ్ వచ్చింది. ఆ మెసేజ్ లింక్‌పై ఆయన రెండు సార్లు క్లిక్ చేశారు. దీంతో క్షణాల్లో బ్యాంక్ అధికారి ఖాతాలో ఉన్న నగదు అంతా మాయమైంది. మొదటిసారి రూ.99,990, రెండోసారి రూ.99,990, మూడోసారి రూ.24,987 డెబిట్ అయ్యాయి. మొత్తం రూ.2,24,967 ఖాతా నుంచి పోగొట్టుకున్న దేవ్‌సింగ్ మోసాన్ని గ్రహించి పరకాల పోలీసులను ఆశ్రయించారు. చదవండి: కేవలం లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గాలం.. మూడు రోజుల్లో రూ.1.22 కోట్లు స్వాహా..! -
యువతి మాయలో బ్యాంక్ మేనేజర్.. రూ. 5.70 కోట్లు బదిలీ!
బనశంకరి: డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ యువతి మాయలో పడిన బ్యాంక్ మేనేజర్ తన స్వంత డబ్బు రూ.12 లక్షలు, ఖాతాదారులకు చెందిన రూ.5.70 కోట్లు ఆమె ఖాతాకు బదిలీ చేసి కటకటాల పాలైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హనుమంతనగర ఇండియన్ బ్యాంకులో అనిత అనే మహిళ రూ.1.32 కోట్లు డిపాజిట్ చేసింది. డిపాజిట్ ఆధారంగా ఆమె రూ.75 లక్షల రుణం తీసుకుంది. అనంతరం బ్యాంక్ మేనేజర్ హరిశంకర్, అసిస్టెంట్ మేనేజర్ కౌసల్య, క్లర్క్ మునిరాజు పథకం ప్రకారం అనిత డిపాజిట్ ఖాతా లీన్‌మార్క్‌ను అనధికారికంగా ఉంచి.. ఆమె డిపాజిట్ ఆధారంగా మే 13వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య ఓవర్‌డ్రాప్ట్ ఖాతాలు తెరిచారు. అందులోకి రూ.5.82 కోట్లు జమ చేశారు. ఈ డబ్బును పశ్చిమ బెంగాల్‌లోని 28 బ్యాంక్ అకౌంట్లకు, రాష్ట్రంలోని రెండు బ్యాంకు అకౌంట్లకు 6 రోజుల వ్యవధిలోనే 136 సార్లు జమ చేశారు. ఈ విషయం బ్యాంకు అధికారుల దృష్టికి వెళ్లడంతో అంతర్గత విచారణ జరిపారు. ఖాతాదారు పేరుతో రుణం తీసుకున్నట్లు తెలిసి బ్యాంక్ రీజనల్ మేనేజర్ డీఎస్ మూర్తి హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేరళకు చెందిన హరిశంకర్ భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో అడ్డదార్లు తొక్కడం మొదలుపెట్టిన హరిశంకర్ డేటింగ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. యువతి మాయమాటల్లో పడి ఆమె ఖాతాకు తన స్వంత డబ్బు రూ.12 లక్షలు, ఖాతాదారులకు చెందిన రూ.5.70 కోట్లు జమ చేసినట్లు హరిశంకర్ పోలీసుల ముందు అంగీకరించాడు. కాగా, బ్యాంకు మేనేజర్ గుర్తుతెలియని యువతికి ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ చేయడంపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువతితో జరిగిన సంభాషణ, ఇతర వ్యవహారాలపై నిర్ధారణ కోసం నిపుణుల సాయం తీసుకుంటున్నారు. పోలీసులు హరిశంకర్‌ను కోర్టులో హాజరు పరిచిన అనంతరం 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. -
బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాది.. వీడియో ఇదే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్‌ను ఓ ఉగ్రవాది తన చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. విజువల్స్‌లో ఉగ్రవాది రెండు బ్యాంక్ తలుపుల నుంచి చూస్తూ వెనక్కి వెళ్తూ కనిపించాడు. తరువాత మరోసారి బ్యాంక్‌లోకి వచ్చి మేనేజర్‌పై అంత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన విజయ్ కుమార్ కుల్గామ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లోకి చొరబడిన టెర్రరిస్ట్ తుపాకీతో మేనేజర్ విజయ్ను కల్చి చంపాడు. కాల్పుల అనంతరం విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. కాగా కశ్మీర్లో కొన్ని రోజులుగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల ముందు ఇదే కుల్గామ్‌లోనే రజనీ బాలా అనే ప్రభుత్వం టీచర్‌ను కూడా చంపేశారు. అంతేగాక ఒక్క మే నెలలోనే అయిదుగురుప్రభుత్వ ఉద్యోగులను హతమార్చారు. మరోవైపు ఈ హత్యలను కాశ్మీరీ పండిట్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. చదవండి: కోవిడ్ బారిన సోనియా.. ట్వీట్ చేసిన ప్రధాని #WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district. The bank manager later succumbed to his injuries. (CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI — ANI (@ANI) June 2, 2022 -
ఉగ్రవాదులు మరో ఘాతుకం.. కుల్గామ్‌లో బ్యాంకు మేనేజర్ హత్య
-
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్
-
భారీ వర్షంలో 4 కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌కు దారి
సాక్షి, చెన్నై: చెన్నైలో కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్ని వర్షపు నీరుతో పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం అన్నా సలైలో ఓ వైపు భారీ వర్షం, మరోవైపు వందలాది వాహనాలతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్‌లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ పరిస్థితి విషయంగా ఉంది. ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయిన అంబులెన్స్‌ను గమనించిన జిన్నా అనే ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తన బైక్‌ను పక్కన పెట్టేసి.. వర్షంలో సుమారు 4 కిలోమీటర్లు నడుస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారిచూపాడు. అతని సాయంతో అంబులెన్స్ సరైన సమయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. మానవత్వంతో ఆయన చేసిన పనికి అంబులెన్స్ డ్రైవర్.. జిన్నాతో సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టుదలతో 4 కిలో మీటర్లు నడిచి అంబులెన్స్ దారి చూపడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
రూ. 15 కోట్లు గల్లంతు: బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
భోపాల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే రుణాల్లో అక్రమాలు, ఉన్నతాధికారుల వేధింపులతో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా సహకార బ్యాంకు మక్డాన్ బ్రాంచ్ మేనేజర్ లాల్ సింగ్ కుశ్వాహా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని చిమంగంజ్ మండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖండేల్వాల్ నగర్‌లోని తన ఇంట్లో కుశ్వాహా ఉరి వేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఒక సూసైడ్‌నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్యాంకు ఎండీ విశేష్ శ్రీవాస్తవ, అసిస్టెంట్ మేనేజర్హే మహేష్ కుమార్ మాథుర్ పేర్లను పేర్కొన్నాడు. తమ అక్రమాలకు, అవినీతికి సహకరించాలంటూ ఉన్నతాధికారులు తనను వేధించారంటూ ఆ లేఖలో పేర్కొనడం కలకలం రేపింది. మరోవైపు ఈ విషయంలో గత ఆరు నెలలుగా తండ్రి మానసిక వేదన అనుభవించాడని కుమారుడు నరేంద్ర చెప్పారు. బ్యాంకులో అవినీతికి పాల్పడటం ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని ఎండీ, ఇతర ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండేదని ఆరోపించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సున్నా శాతం వడ్డీ రేటుతో రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి మక్డాన్ శాఖలో అక్రమాలు వెలుగు చూశాయి. మొత్తం ఎనిమిది ఏఈఎసిల ద్వారా రుణాల పంపిణీకి సంబంధించిన పోర్టల్‌లో అప్లోడ్ సబ్సిడీ షీట్లో సుమారు రూ .15 కోట్ల వరకు తేడా వచ్చింది. దీనిపై పై అధికారులు వివరణ కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, శ్రీవాస్తవ కుశ్వాహాకు నోటీసులు జారీ చేశారు. బహుశా ఈ విషయంలో అతను టెన్షన్ పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్‌నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామనీ, విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తామన్నారు. -
బ్యాంకులో ఉరివేసుకున్న బ్యాంక్ మేనేజర్
కన్నూర్: కేరళ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా బ్యాంక్ మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోక్కిలంగడి కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కె.స్వప్న(38) శుక్రవారం ఉదయం 9 గంటలకు బ్యాంకు కార్యాలయంలో ఉరి వేసుకొని చనిపోయారు. మరొక మహిళా బ్యాంకు ఉద్యోగి ఉదయం 9 గంటలకు పని నిమిత్తం బ్యాంకు కార్యాలయంలోకి వెళ్లగానే మేనేజర్ ఉరివేసుకుని కనిపించడం చూసి బ్యాంకు అలారం నొక్కారు. వెంటనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, బ్యాంకు సిబ్బంది కలిసి ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం కుతుపరంబా తాలూకా ఆసుపత్రికి తరలించారు. కుతుపరంబా ఎసీపీ కెజి సురేష్, ఎస్ఐ కెటి సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీటివి విజువల్స్ తనిఖీ చేశారు. పోలీసులు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఆమె పని ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో వ్రాయబడింది. స్వప్నను సెప్టెంబర్ 2020లో తోక్కిలంగడి బ్రాంచ్‌లో పోస్ట్ చేశారు. కన్నూర్‌లోని నిర్మలగిరిలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. త్రిసూర్ జిల్లాలోని మన్నూతి స్వప్న స్వస్థలం. చదవండి: విషాదం: పెళ్లయిన నాలుగు నెలలకే.. -
దిల్సుఖ్నగర్ ఏటీఎం లూటీ, మేనేజర్‌కు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కెనరా బ్యాంక్ డబ్బులను స్వాహ చేసిన మేనేజర్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఆరో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహాలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... కెనరా బ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా వి.భాస్కర్‌రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్‌లో ఏటీఎం నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్ భాస్కర్‌రావు ఆధీనంలో ఉండేది. అప్పుడు ఏటీఎంలో మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపించింది. విషయాన్ని గమనించిన బ్యాంక్ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్ ఎంక్వైరీతో పాటు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్ మేనేజర్ భాస్కర్‌రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చారు. -
హోటల్ గదిలో అత్యాచారం.. వీడియో తీసి..
భోపాల్ : మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఓ బ్యాంక్ మేనేజర్ దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మొహాలీకి చెందిన ఓ మైనర్‌కు స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల ఓ బ్యాంక్ మేనేజర్‌తో పరిచయమైంది. అతడు మైనర్‌ను అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు హోటల్ గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటనంతా వీడియో తీశాడు. ( దారుణం: భార్య, పిల్లలు చూస్తుండగానే..) ఆ తర్వాత నుంచి వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో విసుగుచెందిన మైనర్ పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ తన స్నేహితురాలిపై కూడా కేసు పెట్టడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. -
హలో.. బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా..
ముమ్మిడివరం (తూర్పుగోదావరి): ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను.. మీ ఖాతాకు ఆధార్ లింకు కానందువల్లే ప్రధాన మంత్రి స్కీమ్ రూ.10 వేలు మీ ఖాతాకు జమ కాలేదు.’’ అంటూ ఓ ఖాతాదారుడి బ్యాంకు వివరాలు తెలుసుకుని అతడి ఖాతా నుంచి రూ.94వేలు కాజేసిన ఉదంతమిది. ముమ్మిడివరం ఎస్సై కేవీ నాగార్జున కథనం ప్రకారం.. కొత్తలంక పంచాయతీ శివారు తోట్ల పాలానికి చెందిన ఈతకోట మణిరాజు కొత్తపేట లేబర్ ఆఫీసులో సబార్డ్‌నేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈనెల 7వ తేదీన సెల్: 7908490408 ద్వారా ఫోన్ వచ్చింది. ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను నీకు ప్రధాన మంత్రి స్కీమ్ ద్వారా వచ్చే రూ.10వేలు ఈ ఖాతాకు ఆధార్ లింక లేకపోవడం వల్ల జమ కాలేదు’’ ఈ మొత్తం జమ కావాలంటే నీ ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పాలి అని మణిరాజును అవతలి వ్యక్తి కోరాడు. నీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును పై మొబైల్ నంబర్‌కు గూగుల్ పే చేయాలని సూచించాడు. దీంతో మణిరాజు తన ఖాతాలో ఉన్న రూ.94 వేలు గూగుల్ పే చేసి ఫోన్ చేశాడు. నీకు పది నిమిషాల్లో నీ సొమ్ము రూ.94 వేలతో పాటు ప్రధాన మంత్రి స్కీమ్ రూ.10వేలు కలిపి రూ.1,04,000 నీ ఖాతాలో జమవుతాయని చెప్పాడు. అప్పటి నుంచి ఆ నంబర్‌కు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని మణిరాజు తెలిపాడు. బ్యాంకుకు వెళ్లి చూడగా తాను మోసపోయాయని తెలిసి గురువారం ముమ్మిడివరం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కేవీ నాగార్జున తెలిపాడు. -
రైతుకు,బ్యాంక్ మేనేజర్‌కు మధ్య వాగ్వాదం
-
రైతుపై బ్యాంక్ ఉద్యోగుల దాడి
ఇల్లెందు: బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లగా.. బ్యాంకు ఉద్యోగులు నానా యాగి పెట్టడంతో ప్రశ్నించిన పాపానికి ఓ రైతు మీద బ్యాంకు ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఇల్లెందులో చోటుచేసుకుంది. మండలంలోని పోచారం పంచాయతీ అమర్‌సింగ్ తండాకు చెందిన బాధిత రైతు అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. 7 నెలల క్రితం అశోక్ తండ్రి గుగులోతు భద్రూ ఆంధ్రాబ్యాంక్(యూనియన్ బ్యాంక్)లో నాలుగు తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 70 వేలు రుణం తీసుకున్నాడు. ఇంటిలో శుభకార్యం ఉండటంతో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు భద్రూ తన కుమారుడు అశోక్‌తో కలిసి మంగళవారం బ్యాంకుకు వెళ్లాడు. బంగారం రుణానికి సరిపడా డబ్బులు కూడా చెల్లించారు. అయితే బ్యాంక్ అధికా రులు మాత్రం బంగారం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినందుకు దూషించారు. తన తండ్రిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అడ్డు తగిలిన అశోక్ తమ బంగారం ఎందుకు ఇవ్వడం లేదని బ్యాంకు ఉద్యోగులను ప్రశ్నించారు. అయితే భూమి పట్టా తీసుకుని రావాలని సమాధానం ఇచ్చారు. బంగారం రుణానికి పట్టాకు సంబంధం ఏంటని తండ్రీ కొడుకులు ప్రశ్నించారు. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కోపంతో.. మీకు చెబితే అర్థ«ం కాదా అంటూ కులం పేరుతో దూషించారు. అక్కడి నుంచి వారిని బయటకు నెట్టుకుంటూ వచ్చారు. మీ పేరుతో ఉన్న పంట రుణం పూర్తిగా చెల్లిస్తేనే బంగారం ఇస్తానని మెలిక పెట్టి బయటకు నెట్టారు. తమ ఇంటిలో శుభకార్యం ఉందని ఎంత బతిమలాడినా వినకుండా బయటకు నెట్టివేస్తుండగా లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో బ్యాంకు ఉద్యోగులు కృష్ణకాంత్, అంబయ్య, డేవిడ్, రాజు, రాజేష్‌లు బయటకు వచ్చి తన మీద దాడి చేశారని అశోక్ తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై బి.రవి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతకుముందు డీఎస్పీ రవీందర్‌రెడ్డిని కలిసి జరిగిన సంఘటనపై వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బ్యాంక్ మేనేజర్ వివరణ.. బంగారం మీద రుణం చెల్లించినప్పటికీ అతడికి పంట రుణం కూడా ఉందని, మూడేళ్లుగా బాకీ చెల్లించడం లేదని మేనేజర్ అంబయ్య తెలిపారు. ఈ విషయమై అతనితో వాగ్వాదం జరిగిందని, కరోనా జాగ్రత్తలు పాటించేందుకుగానూ బయటకు వెళ్లాలని తెలుపగా తమపై దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఈ క్రమంలో బయటకు నెట్టే క్రమంలో తమ ఉద్యోగి చొక్కా పట్టుకోవడంతో ఆగ్రహంతో దాడి జరిగిందన్నారు. -
రుణం ఇవ్వాలని అడిగిన పాపానికి..
సాక్షి, భీమిని(ఆదిలాబాద్) : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శుక్రవారం స్వయం సహాయక సంఘం మహిళలతో బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్ దురుసుగా ప్రవర్తించి ఒక సభ్యురాలిపై చేయి చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని చెన్నాపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం మహిళలు గత రెండు వారాల నుంచి బ్యాంకుకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో మహిళా సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంకుకు వెళ్లి రుణాలు త్వరగా మంజూరు చేయాలని బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్‌ను కోరారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపు జమ చేస్తున్నప్పటికీ రుణాలు ఇవ్వకుండా ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించారు. దీంతో బ్యాంకు మేనేజర్‌కు, మహిళా సంఘాల సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్ అసభ్యపదజాలం వాడుతూ మహిళా సంఘ సభ్యురాలిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆవేదనకు గురైన మహిళలు సిబ్బందిని బ్యాంకు లోపల ఉంచి తాళం వేసి రెండు గంటల పాటు ఆందోళన చేశారు. ఏఎస్సై మజారోద్దీన్ సంఘటన స్థలానికి వెళ్లి మహిళలను సముదాయించారు. సంఘ సభ్యురాళ్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘం సభ్యులు ఏదుల సుగుణ, వీవోఏ జాడి ధర్మయ్యలపై బ్యాంకు మేనేజర్ దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై కొమురయ్య తెలిపారు. -
విశ్రాంత బ్యాంక్ మేనేజర్‌కు టోకరా
లక్డీకాపూల్: మీ ఖాతాలోంచి రూ.25వేలు డ్రా అయ్యాయి.. డ్రా చేసింది మీరు కాకుంటే.. వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండంటూ ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌కు సైబర్ నేరగాళ్లు రూ. 70 వేలు టోకరా వేశారు. అయితే.. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి డెబిట్ కార్డు వివరాలు అడిగితే.. సదరు బాధితుడు మాత్రం క్రెడిట్ కార్డు వివరాలతో పాటు ఓటీపీ కూడా చెప్పేశారు. తీరా తాను మోసపోయానంటూ సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. హిమాయత్‌నగర్‌లో నివసించే ఆంధ్రా బ్యాంకు విశ్రాంత మేనేజర్ సెల్‌ఫోన్‌కు సోమవారం ఉదయం ఓ మెసేజ్ వచ్చింది. అందులో మీ బ్యాంకు ఖాతా నుంచి హఫీజ్‌పేటలో రూ.25 వేలు డ్రా అయ్యాయి. డ్రా చేసింది మీరు కాకపోతే వెంటనే మా కస్టమర్ కేర్ నంబర్‌కు ఫిర్యాదు చేయండంటూ అందులో సారాంశం ఉంది. తాను బయటకు వెళ్లలేదని.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన ఖాతాలో నుంచి డబ్బు డ్రా చేశారంటూ హడావుడిగా అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు ఆయన ఫోన్ చేశారు. ఫోన్లో కార్డు.. ఖాతా వివరాలు అడిగిన సైబర్‌నేరగాళ్లు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పాలని అడగడంతో దానిని కూడా చెప్పారు. అయితే సదరు బాధితుడు తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డు వివరాలు చెప్పడంతో ఆ కార్డు నుంచి రూ.70 వేలు మొబిక్విక్ వ్యాలెట్లోకి బదిలీ చేసుకున్నారు. డబ్బు డ్రా అయినట్టు మరోసారి సెల్‌ఫోన్‌కు మేసేజ్ రావడంతో బాధితుడు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాల్సి ఉండగా.. క్రెడిట్ కార్డు వివరాలు ఎందుకు చెప్పారంటూ బాధితుడిని పోలీసులు ప్రశ్నించారు. మీ వద్ద ఉన్న కార్డు వివరాలు చెప్పండంటూ అడగడంతో క్రెడిట్ కార్డు వివరాలు కూడా చెప్పాల్సి వచ్చిందంటూ సదరు బాధితుడు పోలీసులకు వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్పెక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. -
అంధ మహిళపై బ్యాంకు మేనేజర్ అఘాయిత్యం!
భోపాల్: కరోనా లాక్‌డౌన్‌తో జనజీవనం స్తంభించిన వేళ మధ్యప్రదేశ్‌లో ఓ బ్యాంకు మేనేజర్ (53) అంధ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త లాక్‌డౌన్‌తో రాజస్తాన్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి సదరు మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని షాపుర ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలాఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1310 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 69 మంది కోలుకున్నారు. 69 మరణాలు సంభవించాయి. (చదవండి: కరోనా.. మధ్యప్రదేశ్‌లో 35 మంది డిశ్చార్జ్) -
భారత్‌లో బాలుడి హత్యకు లండన్‌లో కుట్ర!
సాక్షి, న్యూఢిల్లీ : గోపాల్ సజానిని రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లి పోయింది. అప్పటికే తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. సమీపంలో ఉండే అక్క వరుసయ్యే ఆల్ఫా కర్దాని జాలి తలిచి ఆ అబ్బాయిని చేరదీసింది. రెండంటే రెండే గదులుగల చిన్న ఇంట్లో గోపాల్ సహా తొమ్మిది మంది ఉండేవారు. గోపాల్ ఇంట్లో అన్ని పనులు చేయడంతోపాటు తోటి పిల్లలతోని దొంగా, పోలీసు ఆట ఆడుతూ పెరిగాడు. పెద్దయ్యాక బాలీవుడ్ చిత్రంలోలాగా ‘బాజీరావ్ సింగం’ అవుతానని చెబుతూ వచ్చే వాడు. గుజరాత్ జిల్లాలోని జునాగౌడ్ జిల్లా, మాలియా హతీనా గ్రామీణ ప్రాంతంలో నివసించే గోపాల్ అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. 2017లో ఒక రోజు రాత్రి 9.30 గంటలకు రాంచీ నుంచి ఇంటికి కారులో తిరిగి వస్తుండగా, మోటారు సైకిళ్ల మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపాల్‌ను ఎత్తుకు పోయేందుకు ప్రయత్నించారు. పక్కనే తనతో వస్తోన్న అక్క అల్ఫా కర్దానీ భర్త, గోపాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించగా, ఆగంతకులిద్దరు గోపాల్‌తో పాటు ఆయన్ని పొడిచారు. ఆగంతుకులకే కారు డ్రైవర్ సహకరించాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రోడ్డు పక్కన పడేసి ఆగంతకులు వెళ్లి పోయారు. అల్ఫా కర్దాని భర్త అక్కడికక్కడే మరణించగా, గోపాల్ ఆస్పత్రిలో మరణించాడు. అప్పటికీ గోపాల్‌కు పదేళ్లు. ఈ హత్యపై దర్యాప్తు జరిపిన గుజరాత్ పోలీసులు హత్యకు మూలాలు లండన్‌లోని హాల్వెల్ నగరంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆర్తి ధీర్ అనే 55 ఏళ్ల మహిళ, ఆమె భర్త 31 ఏళ్ల కావల్ రాయ్‌జాడ కలిసి గోపాల్ హత్యకు కుట్రపన్నారు. 2013లో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్న వారు తమకు పిల్లలు లేరంటూ గోపాల్‌ను దత్తతు తీసుకుంటామంటూ 2014వో చివరిలో వారు ఊరు వెళ్లారు. గోపాల్ దత్తతకు అతని అక్కతోని, బావతోని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే ప్రాంతంలో కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న కావల్ తండ్రి సహకారంతో ఈ ఒప్పందం కుదిరింది. 2015, జూలై నెలలో లండన్ దంపతులకు గోపాల్ దత్తత పత్రాలు అందాయి. ఇద్దరు కలిసి ముంబై వచ్చి 2015, ఆగస్టు 26వ తేదీన గోపాల్ పేరిట ‘వెల్త్ బిల్డిర్’ అనే ప్రత్యేకమైన పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీకి మామూలుకన్నా పది రెట్లు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అక్కడ లక్షా యాభై వేల పౌండ్ల పాలసీ, అంటే దాదాపు కోటి నలభై లక్షల రూపాయల పాలసీని తీసుకున్నారు. వీసా వచ్చాక గోపాల్‌ను తీసుకెళతామని చెప్పి వెళ్లిన ఆ లండన్ దంపతులు తిరిగి 2017లో వచ్చి వీసా ప్రాసెస్ కోసం అంటూ వచ్చి రాంచీకి గోపాల్‌ను కారులో తీసుకెళ్లి తిరిగి వస్తుండగా వారే కుట్ర పన్ని చంపించారు. గోపాల్ బతికి ఉంటే ఇప్పుడు అతనికి 13 ఏళ్లు ఉండేవి. వారు రెండు హత్యలు చేశారంటూ వెస్ట్ లండన్ హైకోర్టు గత జూలై నెలలోనే నిర్ధారించింది. అయితే ఆ దోషులను తమకు అప్పగించాలంటూ భారత్ పెట్టుకున్న పిటిషన్‌ను అక్కడి హైకోర్టు నాలుగు రోజుల క్రితమే కొట్టివేసింది. రెండు హత్య కేసుల్లో వారికి ఎలాంటి పెరోల్ సదుపాయం కూడా లేకుండా యావజ్జీవ కారాగారా శిక్ష విధించే అవకాశం ఉందని, ఇది తమ పౌరులకు ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందంటూ భారత్ పిటిషన్‌ను కొట్టివేశారు. దోషులను వదిలేశారు. వారు అక్కడ ప్రస్తుతం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తామెలాంటి నేరం చేయలేదని వారు ఇప్పటికీ వాదిస్తున్నారు. గోపాల్ది హత్య కేసుగా తేలడంతో ఎల్ఐసీ డబ్బులు కూడా వారికి అందలేదు. ఈ విషయమై భారత్ జాతీయ మీడియా పోలీసు ఉన్నతాధికారులను సంప్రతించగా, అక్కడి హైకోర్టు నిర్ణయాన్ని పైకోర్టులో సవాల్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఎప్పటికైనా గోపాల్ విషయంలో న్యాయం జరుగుతుందని, బ్రిటిష్ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గోపాల్ అక్కా అల్పా కర్దాని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానంతం నేరస్థులకు కూడా ప్రాథమిక హక్కులు వర్తించే విధంగా యురోపియిన్ యూనియన్ ఒడంబడిక మేరకు బ్రిటన్ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టాలను అడ్డు పెట్టుకొని బ్రిటన్ పౌరసత్వం కలిగిన భారతీయ ఆర్థిక నేరగాళ్లెందరో భారత్‌కు తీసుకరాకుండా తప్పించుకుంటున్నారు. -
నిధుల దుర్వినియోగం కేసు; బ్యాంకు మేనేజర్ అరెస్ట్
సాక్షి, అత్తిలి( పశ్చిమగోదావరి) : బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిన కేసులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పోతాప్రగడ రామ సూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తణుకు సీఐ డి.ఎస్.చైతన్యకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్ 2015–16 మధ్యకాలంలో బ్యాంకును మోసం చేసి రూ.37 లక్షలను స్వాహా చేశాడు. రైతుల ఆధార్‌కార్డులతో 11 జాయింట్ లయబిలిటి గ్రూపులను ఏర్పాటు చేసి, ఒక్కొక్క గ్రూపునకు రూ. 3 లక్షలు చొప్పున రూ.33 లక్షలతో పాటు మరో 8 మంది రైతుల పేరున రూ.4 లక్షలు పంట రుణాలుగా మంజూరు చేశాడు. రైతుల సంతకాలు, వ్యవసాయశాఖ మండల అధికారి సంతకాలను బ్యాంకు మేనేజర్ పోర్జరీ చేశాడు. తప్పుడు రికార్డులు సృష్టించి మొత్తం రూ.37 లక్షల బ్యాంకు నిధులను స్వప్రయోజనాల కోసం కిరణ్‌కుమార్ వాడుకున్నాడు. రైతులు పేరున తీసుకున్న రుణాలు తిరిగిచెల్లించకపోవడంతో తరువాత కాలంలో వచ్చిన మేనేజర్ రైతులకు నోటీసులు జారీ చేయడంతో నిధులు దుర్వినియోగం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్ కిరణ్‌కుమార్ బ్యాంకు నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు వచ్చి 2019 సెప్టెంబర్ 14న అప్పటి మేనేజర్ జి.శ్రీనివాస్ అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పోతాప్రగడ వెంకట రామసూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి తణుకు కోర్టుకు హాజరు పర్చగా, 2వ అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.మేరి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. -
భర్తే విషమిచ్చి హతమార్చాడు
-
ఆమని హత్యకేసులో సంచలన విషయాలు
మదనపల్లె టౌన్: రోజుకో మలుపు తిరిగిన మదనపల్లె బరోడా బ్యాంకు మేనేజర్ చేబోలు రవిచైతన్య భార్య ఆమని(27) అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడింది. సైనైడ్ తాగడంతోనే ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో తేలడం, నిందితుడు రవిచైతన్యను అరెస్టు చేసి విచారించడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడు రవిచైతన్య (35)ను, అతని తల్లిదండ్రులను అరెస్టు చేశారు. డీఎస్పీ రవిమనోహరాచారి, ఎస్ఐ వెంకటేష్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం మేరకు..మదనపల్లె శేషప్పతోటలో నివాసం ఉంటున్న బరోడా బ్యాంకు మేనేజర్ చేబోలు రవిచైతన్య భార్య సీహెచ్ ఆమని గత నెల 27న ఉదయం ఇంట్లో మృతి చెందింది. స్పృహ లేకుండా ఉన్న ఆమనిని ...రవిచైతన్య ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాత్రూమ్లో కిందపడి పోయి ఉందని పొరుగింటి వారు ఫోన్ చేయగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు డాక్టర్లకు చెప్పాడు. డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా కోలుకోకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. ఆమని మరణవార్త తెలియగానే కృష్ణా జిల్లా ఒంటిమిట్ట మండలం ఇందులూరు నుంచి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, జోగి నాగేంద్రరావు మదనపల్లెకు చేరుకున్నారు. తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని టూటౌన్లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చారని, బాత్రూంలో పడి చనిపోయినట్లు చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు ఆమనిది అనుమానాస్పద మృతి, అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మరుసటి రోజు పోస్టుమార్టమ్ నివేదికలో సైనైడ్ ఇవ్వడంతోనే చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో నిందితుడు రవిచైతన్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు విచారణలో తానే సైనైడ్ తాగించినట్లు నిందితుడు అంగీకరించాడు. భార్యకు సైనైడ్ ఇచ్చి చంపినందుకు రవి చైతన్యను, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడినందుకు రేణిగుంటకు చెందిన రవిచైతన్య తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ, ఎస్ఐ వివరించారు. -
తాళికట్టు వేళ.. వరుడికి చెరసాల
బొమ్మలసత్రం: ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతి మెడలో తాళికట్టేందుకు సిద్ధమైన ఓ వంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన మోహన్‌కృష్ణ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆగస్టు 24న నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నకానుకల కింద రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. జాతకాలు కుదరలేదని దాన్ని రద్దు చేసుకున్నట్టు మోహన్‌కృష్ణ సోదరుడు వీరప్రసాద్ పెళ్లికుమార్తె కుటుంబానికి సమాచారమిచ్చాడు. కట్నాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు. నంద్యాల మహానందీశ్వర దేవస్థానంలో ఆదివారం మరో యువతికి తాళికట్టడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసు కున్న పోలీసులు పెళ్లిపీటలపై కూర్చున్న మోహన్‌కృష్ణతోపాటు అతడి సోదరుడు వీరప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్న యువతి కుటుంబసభ్యుల వద్ద కూడా రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం కట్నంగా మాట్లాడుకుని.. ఇప్పటికే రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారం తీసుకున్నట్లు ఆ యువతి తల్లిదండ్రులు తెలిపారు. మోహన్‌కృష్ణ, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరప్రసాద్ గతంలో నంద్యాలలోని కెనరా బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశాడు. ఆ సమయం(2008)లో నిరుద్యోగులను మోసం చేశాడు. రూ.400 చెల్లిస్తే నెలకు రూ.30 వేలు సంపాదించే సలహాలిస్తానని నమ్మించి 300మంది నిరుద్యోగులనుంచి రూ.400 చొప్పున వసూలు చేశాడు. దీనిపై చీటింగ్ కేసు నమోదైంది. -
రైతు కుటుంబానికి త్రీమెన్ కమిటీ పరామర్శ
సాక్షి, బల్లికురవ(ప్రకాశం) : పొలంలో జెండాలు పాతి వేలం నోటీసులివ్వడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని ఉన్నతాధికారులు నియమించిన త్రీమెన్ కమిటీ సోమవారం పరామర్శించింది. మండలంలోని కె.రాజుపాలేనికి చెందిన శాఖమూరి హనుమంతురావు (42) కొంతకాలంగా మార్టూరు మండలం శాంతినగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని భార్య, పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వగ్రామం కె.రాజుపాలెంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శాఖమూరి హనుమంతురావు శనివారం ఉదయం పొలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి స్వగ్రామానికి వచ్చి వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య కుపాల్పడ్డాడు. ఈ ఘనటపై ఒంగోలు ఆర్డీవో పెంచల కిశోర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ టి.ప్రశాంతి, వ్యవసాయాధికారి ఎస్వీపీ కుమారి, ఎస్ఐ పాడి అంకమ్మరావులు శాంతినగర్‌లోని బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు భార్య రాధిక నుంచి వివరాలు సేకరించారు. మార్టూరు పీడీసీసీ బ్యాంకులో నాలుగేళ్ల క్రితం తీసుకున్న అప్పు రూ. 1.80 లక్షలు వడ్డీతో కలిపి రూ.2.20 లక్షలు, స్టేట్ బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటు వ్యాపారుల వద్ద మరో రూ.3 లక్షల అప్పు ఉందని మృతుడి భార్య చెప్పింది. పీడీసీసీ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేయడంతో తన భర్త మానసికంగా ఇబ్బంది పడ్డాడని ఆరోపించింది. పొలంలో జెండాలు పాతి 3వ తేదీన పొలం వేలం వేస్తున్నట్లు మేనేజర్ బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత రైతు భార్య త్రీమెన్ కమిటీ ఎదుట వాపోయింది. తన బిడ్డలు హర్షవర్ధన్ ఇంటర్, నందిని 9వ తరగతి చదువుతున్నారని పేర్కొంది. చదువులకు విఘాతం కలగకుండా అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరింది. నోటీస్‌లు ఇవ్వడంతో పాటు పొలంలో జెండాలు పాతిన పీడీసీసీ బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాధిక త్రీమెన్ కమిటీని వేడుకుంది. -
కేటులలో ఈ సిండి‘కేటు’ రూటే సెపరేటు..!
సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మాజీ మేనేజర్ చేతివాటం కారణంగా రూ. 2.22 కోట్లు అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల గుట్టు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసులో కీలక సూత్రధారులు, పాత్రధారులు తెరవెనుక ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా బయటకు వస్తారా లేక మేనేజర్ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు పరిశీలించి వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చిన్న సంతకంలో తేడా వస్తేనే బ్యాంకు అధికారులు పైసా డబ్బు ఇవ్వరు. అలాంటిది ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మాజీ మేనేజర్ జయంత్‌బాబు తన అధికారాన్ని ఉపయోగించుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బ్యాంకును దళారులకు నిలయంగా చేసుకుని వారి సహకారంతో అడ్డదిడ్డంగా తనకు అనుకూలమైన వారికి రుణాలు ఇప్పించారు. దుకాణాలు లేక పోయినా వారు దొంగ బిల్లులు పెట్టినా , సాగుభూమి లేక పోయినా వ్యవసాయ రుణాలు ఇవ్వడం. ఇలా ముద్రరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ రుణాల్లో దొంగ పాసుపుస్తకాలు, దొంగ 1బీలు తీసుకు రావడం వెనుక వీఆర్ఓల పాత్రపై చర్చ జరుగుతోంది. వ్యవసాయ రుణాలు ఎలా ఇస్తారు వ్యవసాయ రుణాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా పాస్‌పుస్తకం తోపాటు 1బీ, ఆ రైతు ఆధార్‌కార్డు తీసుకు రావాలి. వాటిని పరిశీలించిన ఫీల్డ్ ఆఫీసర్ ఆన్లైన్లో 1బీ ని పరిశీలించిన తరువాత ఫైల్‌ను మేనేజర్‌కు పంపిస్తారు. ఆయన పరిశీలించిన తరువాత రైతుకు బ్యాంకు రుణం అందిస్తారు. అయితే బ్యాంకు అధికారులు అలాంటి నిబంధనలు అమలు చేయకుండానే రుణాలు మంజూరు చేశారు. ఇలా సుమారు 60కి పైగా వ్యవసాయ రుణాలను బ్యాంకు ద్వారా పొందినట్లు తెలుస్తోంది. ఎలా వచ్చాయి..? సాధారణంగా పాసు పుస్తకాలు ఒక్క రెవెన్యూ అధికారుల ద్వారానే వస్తాయి. అలాగే 1బీ కావాలంటే రెవెన్యూ కార్యాలయం లేక మీసేవా కేంద్రాల్లో తీసుకోవచ్చు. కానీ అవి దళారుల చేతికి ఎలా వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖలోని కొందరు సిబ్బంది దొంగ పాసు పుస్తకాలను తయారు చేయడంలో సిద్ధహస్తులుగా ఉన్నట్లు సమాచారం. గతంలో దొంగ పాసుపుస్తకాలపై అప్పటి జాయింట్ కలెక్టర్ శ్వేతాకు పలువురు ఫిర్యాదు చేశారు. ఆమె బదిలీతో విచారణ అటకెక్కింది. నేడు అదే వ్యక్తులు బ్యాంకు దళారీలకు పాసుపుస్తకాలు అందించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అలాగే బోగస్ 1బీ తయారీలో మీసేవా కేంద్రంలోని వారిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనకు తెలియకుండా రుణాలు కొందరు వ్యక్తులకు సెంటు భూమిలేక పోయినా బ్యాంకులో వ్యవసాయ రుణాలు పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారికి బ్యాంకు నోటీసులు రావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. మనకు తెలియకుండానే మన పేరుతో దొంగ ఆధార్ కార్డులు, 1బీ, పాసు పుస్తకాలు పెట్టి దొంగ సంతకాలతో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. మరికొందరు రూ. 20వేలు రుణం తీసుకుంటే వారి పేరుతో రూ. లక్ష లేక రూ.2లక్షలు రుణం తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేయడం లాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రుణం తీసుకునే వ్యక్తి అకౌంట్లో నుంచి కాకుండా అంత పెద్ద మొత్తంలో అతనికి తెలియకుండా ఎలా డబ్బు తీశారన్నది అనేక అనుమానాలకు దారితీస్తోంది. రెండేళ్లుగా బ్యాంకర్లు ఎందుకు చర్యలు తీసుకోలేదు బ్యాంకులో అనేక అక్రమాలు 2015–16లో జరిగితే 2019 ఫిబ్రవరి 5న పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. అంటే సుమారు రెండేళ్ల పాటు ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించలేదు. అలాగే 2016–17, 18 ఏడాదిల్లో బ్యాంక్ ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిట్లో ఆడిటర్లు అక్రమాలను గుర్తించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ గుర్తించి ఉంటే ఉన్నతాధికారులు చర్యలకు ఎందుకు ఉపక్రమించలేదు. వీటన్నింటిపై పోలీసులు దృష్టి సారించి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. సమగ్ర విచారణ చేస్తున్నాం: సీఐ కంబగిరి రాముడు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ చేస్తున్నాం. అక్రమాలకు కారకులైన ఎవ్వరిని వదలం. దొంగ పాసుపుస్తకాలు మొదలు దుకాణాలు లేకుండానే ముద్ర రుణాలు తీసుకోవడం ఇలా అన్ని విషయాలను లోతుగా విచారిస్తున్నాం. -
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
శ్రీకాకుళం, మందస: మందస మండలంలోని హరిపురంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకులో పని చేస్తున్న ఓ మేనేజర్ ఇంటిలో బంగారం, నగదు దొంగిలించిన అనంతరం మరోచోట దొంగతనానికి విఫలయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి. హరిపురం గ్రామంలోని సాయికాలనీలో నివాసముంటున్న మామిడిపల్లి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ బంగారు వినోద్ సోమవారం కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చేసరికి తలుపులు, బీరువా తాళాలు బద్దలై ఉన్నాయి. బీరువాలోని 7 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదు, పట్టువస్త్రాలు, వెండినగలు దొంగలు అపహరించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దొంగలు అదే గ్రామంలో మరో ఇంటి తలుపులను బలవంతంగా తెరచి దొంగతనానికి విఫలయత్నం చేశారు. అక్కడ ఏమీ లభించకపోవడంతో ఇంకో ఇంటిలో గునపాలను దొంగిలించారు. ఒకే రాత్రి మూడు, నాలుగు చోట్ల దొంగతనానికి యత్నించారు. ఈ సంఘటనలపై మందస ఎస్ఐ వి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన బ్యాంకు మేనేజర్ ఇంటిలో శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానితులు సోమవారం రాత్రి ఈ ప్రాంతంలో తిరిగారని స్థానికులు చెబుతున్నారు. వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేయడం అంటే ఇదేనేమో! ఓ బ్యాంకు మేనేజర్ తాను పనిచేస్తున్న బ్రాంచ్‌ను నిలువుగా ముంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఎన్.కృష్ణఆదిత్య అదే బ్యాంకులో తన పేరిట సేవింగ్ ఖాతా తెరిచాడు. తన స్నేహితుడు నీరటి కృష్ణయ్య పేరుపై రూ.9 లక్షలతో ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) అకౌంట్ తెరిచాడు. ఈ బ్యాంకు పరిధిలో ఉన్న 77 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులను ఆన్లైన్ ద్వారా సేవింగ్ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతోపాటు ఓడీ అకౌంట్‌పై రూ.92 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ చేశాడు. 77 అకౌంట్లతో 24 మంది ఖాతాదారుల అనుమతి లేకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా డబ్బులను తన సేవింగ్ ఖాతాలోకి మళ్లించినట్టు బ్యాంకు రీజినల్ మేనేజర్ అంతర్గత విచారణలో బయటపడింది. ఇక్కడితో ఆగకుండా కృష్ణఆదిత్య 53 మంది పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీళ్ల ఖాతాలపై రూ.62 లక్షలను రుణాల పేరిట దండుకున్నాడు. దుర్గాభవానీ, జై భవానీ మద్యం దుకాణాలకు ఎలాంటి రుణ ష్యూరిటీ పత్రాలు లేకుండానే రూ.60 లక్షలు రుణాలు మంజూరు చేశాడు. గ్రూప్ ఆఫ్ కస్టమర్ల పేరుతో 11 మందికి అర్హత లేకున్నా క్రెడిట్ రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు నష్టం వచ్చేలా చేసినట్టు గుర్తించారు. అయితే, ఈ వ్యవహారం ఓ ఖాతాదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినట్టు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్ తెలిపారు. తనకు సమాచారం లేకుండా తన అకౌంట్ నుంచి రూ.2 లక్షలను డ్రా చేసి కృష్ణఆదిత్య తన అకౌంట్లో వేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపగా మొత్తం కుంభకోణం బయటపడిందని దుర్గప్రసాద్ సీబీఐకి రెండు రోజుల క్రితం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణ ఆదిత్య మొత్తం రూ.3.46 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు తేలిందన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీబీఐ హైదరాబాద్ రేంజ్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి బ్యాంక్ మేనేజర్ కృష్ణ ఆదిత్యతోపాటు క్యాషియర్ కమ్ క్లర్క్ లేళ్ల శశిధర్, తాత్కాలిక మేనేజర్ ఆరె సత్యం, అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్, సుజాత్ అలీ సిద్దిఖీ, ఇతడి స్నేహితులు మహ్మద్ అబ్దుల్ ఖలీముల్లా షబ్బీర్, మహ్మద్ జబీరుల్లాపై సీబీఐ కేసులు నమోదు చేసింది. -
టీడీపీ నేతలో ‘అపరిచిత కాముడు’
-
నువ్వు నాకు బా..గా నచ్చావ్!
శ్రీకాళహస్తి: ‘నువ్ అందంగా ఉంటావ్..నువ్వంటే నాకిష్టం..నీ వాయిస్ చాలా బాగుంటుంది..నువ్వు నాకు బా..గా నచ్చావ్..! ఇదీ ఓ బ్యాంకు మేనేజర్‌కు అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ ముఖ్యనేత పెట్టిన మెసేజ్‌లలో కొన్ని! ఆయనగారిలోని ‘అపరిచిత కాముడి’ తీరుపై ఆ బ్యాంకు మేనేజర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. పార్టీ పరువుపోతుందని మధ్యస్థాలకు పూనుకున్నారు. సేకరించిన వివరాల మేర కు..స్థానికంగా ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారిణికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఆ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న టీడీపీ ముఖ్యనేత గురువారం రాత్రి 11.30 గంటల నుంచి పలు అసభ్యకకరమైన మెసేజ్‌లు బ్యాంకు మేనేజర్‌కు పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే వీటిని గమనించిన ఆమె దిగ్భ్రాంతి చెందారు. తన భర్తకు తెలియజేశారు. ఆ తర్వాత తన సిబ్బందితో కలిసి ఆ ‘కాముకుడి’ని చడామడా దులిపేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఇది పార్టీకి నష్టదాయకమని మరో నలుగురు టీడీపీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. బ్యాంకు మేనేజర్‌ను, ఆమె భర్తను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె భర్తతో సైతం ఓ హోటల్లో సుదీర్ఘంగా మధ్యస్తం చేసినా అది ఫలించలేదని తెలియవచ్చింది. లైంగిక వేధింపుల కేసు నమోదు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు అత్తింజేరి బాలాజిపై 354ఏ సెక్షన్ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
బ్యాంకు మేనేజర్‌ను చితకబాదిన మహిళ
-
వైరల్: కీచక మేనేజర్‌ను ఉతికి ఆరేసింది!
సాక్షి, బెంగళూరు : రుణం కావాలంటే కోరిక తీర్చాలంటూ వెకిలీ వేషాలు వేసిన ఓ బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదింది. కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేవనగెరెలోని డీహెచ్ఎఫ్ఎల్ లోన్ ఏజెన్సీలో దేవయ్య అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఓ మహిళ తనకు రుణం కావాలని ఆయనను కోరింది. రూ. 2 లక్షల రుణం ఇప్పించాల్సిందిగా అభ్యర్థించగా.. దేవయ్య వెకిలీ బుద్ధి చూపించాడు. లోన్ ఇవ్వాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమె వేధించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళ.. సదరు కీచకుడిని రోడ్డుమీదకు లాగి దేహశుద్ధి చేసింది. మొదట కర్రతో చితకబాది.. ఆ తర్వాత చెప్పు తీసుకొని చెడామడా వాయించింది. కన్నడ భాషలో అతన్ని తిడుతూ.. గట్టిగా బుద్ధిచెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్యాంక్ మేనేజర్
-
బ్యాంక్ మేనేజర్‌కు జైలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకును మోసగించిన కేసులో హైదరాబాద్ అమీర్‌పేటలోని విజయా బ్యాంకు మేనేజర్ కె.దేవేందర్‌రావు, మరోవ్యక్తి ఎం.వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు అదనపు ప్రత్యేక జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ సంతకాలు, బోగస్ పత్రాల ఆధారంగా 12 మందికి ఇళ్ల రుణాలు మంజూరు చేశారు. రుణాల నిమిత్తం ఇచ్చిన బ్యాంక్ డ్రాఫ్ట్‌లను నగదుగా మార్పు చేసి రుణాలు పొందిన వారికి ఆ మొత్తాలను అందజేయడంలో వెంకటేశ్వరరావు సహకరించారు. ఫలితంగా బ్యాంకుకు రూ.90 లక్షలు నష్టం వచ్చిందంటూ 2006 జనవరి 4న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం సీబీఐ కోర్టు బ్యాంక్ మేనేజర్ దేవేందర్‌రావు, వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగారం తోపాటుగా వీరిద్దరికీ వరుసగా రూ.3 లక్షలు, రూ.1.5లక్షల జరిమానాను విధించింది. అది చెల్లించకపోతే 6 నెలలు సాధారణ జైలు గడపాలని పేర్కొంటూ; 17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. -
నాకు తెలియకుండా రుణాలిస్తావా..
సాక్షి, అమరావతి బ్యూరో : కంచికచర్ల మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు గద్దె వీరభద్రరావు శుక్రవారం తప్పతాగి వీరంగం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నాకు తెలియకుండా రుణాలు మంజూరు ఎలా చేస్తావు..’ అంటూ బ్యాంకు మేనేజర్‌పై చిందులు తొక్కాడు. ఇక్కడ అంతా మా రాజ్యమని, మా పర్మిషన్ తీసుకోకుండా రుణాలు ఇవ్వకూడదని బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. మంత్రి సోదరుడి హల్చల్తో బ్యాంకు సిబ్బందితోపాటు ఖాతాదారులు హడలిపోయారు. కాపు రుణాలు మంజూరు చేశారని.. స్థానిక కేడీసీసీ బ్యాంకుకు 32 కాపు రుణాలు మంజూరయ్యాయి. ఆ రుణాల కోసం స్థానిక ప్రజా ప్రతినిధి, టీడీపీ జిల్లాస్థాయి నాయకుడు కలిసి లబ్ధిదారులను బ్యాంకుకు ప్రపోజల్స్ పంపారు. మండలంలోని సొసైటీ కార్యదర్శిగా పని చేస్తున్న మంత్రి సోదరుడు వీరభద్రరావు విషయం తెలిసి రెచ్చిపోయాడు.. ఫూట్‌గా మద్యం సేవించిన భద్రయ్య కేడీసీసీ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ సోమయ్యతో వాగ్వాదానికి దిగాడు. నాకు తెలియకుండా రుణాలు మంజూరు చేస్తావా.. అంటూ మేనేజర్‌ను నానా దుర్భాషలాడాడు. ఒకటిన్నర దశాబ్ధాల కాలంగా నా అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయలేదని, అలాంటిది నీవెలా మంజూరు చేస్తావంటూ రెచ్చిపోయాడు. తాను సూచించిన లబ్ధిదారులకే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, లేకపోతే నీ ఉద్యోగం పీకేయిస్తానంటూ.. పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేశాడు. దీంతో భయాందోళనకు గురైన మేనేజర్ సెలవు పెట్టి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని సోదరుడికి వత్తాసు పుచ్చుకొని కేడీసీసీ బ్యాంకు ఉన్నతస్థాయి అధికారిని ఇంటికి పిలిపించి వెంటనే సర్దుబాటు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతస్థాయి అధికారి.. మేనేజర్‌ను బ్యాంకుకు రమ్మని విధుల్లో చేరాలని ఆదేశించినట్లు సమాచారం. తనకు మంత్రి సోదరుడు క్షమాపణ చెప్పే వరకు బ్యాంకుకు రానని మేనేజర్ సోమయ్య తెగేసి చెప్పినట్లు తెలిసింది. మంత్రి సోదరుడితో క్షమాపణ చెప్పిస్తానంటూ ఉన్నతాధికారి మేనేజర్‌ను తృప్తిపరిచేందుకు మంతనాలు జరిపినా ఫలించలేదు. తన మనస్సు గాయపడిందని, కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్తానంటూ మేనేజర్ చెప్పడంతో సదరు అధికారి ఎలాగోలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హేయమైన చర్య.. సాక్షాత్తు మంత్రి సోదరుడు బ్యాంకు మేనేజర్‌పై అమానుషంగా ప్రవర్తించి దుర్భాషలాడటం హేయమైన చర్య. మేనేజర్ నిజాయితీగా పని చేస్తున్నాడు. అందరి ఖాతాదారులకు అందుబాటులో ఉంటున్నాడు. అటువంటి మేనేజర్‌ను ఇష్టమొచ్చినట్లు తప్పతాగి దుర్భాషలాడటం సిగ్గు చేటు. – బండి జానకీరామయ్య, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, మోగులూరు -
ఐఫోన్ పార్సిల్లో సబ్బు
టీ.నగర్: తక్కువ ధరకు ఐఫోన్ ఇస్తున్నట్లు తెలిపి బాక్సులో సబ్బు పెట్టి బ్యాంకు మేనేజర్ని మోసగించిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన చెన్నై మైలా పూర్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై మైలాపూర్‌లోని వీఎం లేన్ కి చెందిన రమేష్ (36) లజ్ చర్చి సమీపంలోని ఒక ప్రముఖ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు బ్యాంకు దగ్గరకు వచ్చి వాచ్‌మెన్‌తో నవ్వుతూ మాట్లాడారు. ఒకరు బ్యాంకు మేనేజర్ రమేష్ వద్దకు వెళ్లి మాట్లాడారు. తక్కువ ధరకు ఐఫోన్ ఉందని, ధర రూ.15 వేలు మాత్రమేనని తెలుపుతూ ఒక సెల్‌ఫోన్ అతనికి చూపాడు. పక్క బ్యాంకులో రెండు సెల్ఫోన్లు, మరో ఫోన్ మాత్రమే మిగిలాయని నమ్మబలికాడు. అతని వద్ద ఉన్న పార్సిల్‌ను రమేష్ తీసుకున్నాడు. తర్వాత రమేష్ వద్ద రూ.15 వేలు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్యాంకు మేనేజర్ రమేష్ పార్సిల్ విప్పి చూడగా అందులో సబ్బు కనిపించడంతో దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే మైలా పూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
అన్నానగర్: నాగర్‌కోవిల్‌లో శుక్రవారం బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తిరువనందపురం వెల్లమ్‌పలం ప్రాంతానికి చెందిన చంద్రన్ కుమారుడు అచ్చు ఆర్.చంద్రన్ (28) అవివాహితుడు. ఇతను నాగర్‌కోవిల్‌లోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నాగర్‌కోవిల్‌లోని దేవసహాయం వీధిలో ఉన్న ఇంట్లో ఉంటున్నాడు. రోజు ఉదయం 9 గంటలకు ఆఫీస్‌కి వెళతాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలైనా బ్యాంకుకు వెళ్లలేదు. దీంతో సహ సిబ్బంది అచ్చు ఆర్.చంద్రన్‌కి ఫోన్ చేసినా తీయలేదు. అనంతరం బ్యాంకు ఉద్యోగి ఇతన్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. చాలాసేపు తలుపులు తట్టినా తెరవలేదు. తలుపులు గట్టిగా తోసినప్పుడు తెరచుకున్నాయి. లోపలికి వెళ్లి చూడగా అచ్చు ఆర్.చంద్రన్ ఫ్యాన్‌కి ఉరేసుకుని శవంగా వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్న వడచేరి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. చంద్రన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆచారిపల్లం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
బాధితులందరికీ న్యాయం చేస్తాం
మొయినాబాద్‌రూరల్ (చేవెళ్ల): అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాచుకున్న డబ్బును బాధితులందరికీ 20 రోజుల్లో అందజేసేందుకు కృషి చేస్తానని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ మురళీమోహన్ హామీ ఇచ్చారు. బ్యాంకులో దాచుకున్న డబ్బును ఇవ్వకుండా తిప్పుకుంటున్న అధికారులకు బాధలు తెలియజేసేలా చేపట్టిన బాధితుల ధర్నా మూడు రోజుల పాటు కొనసాగింది. బుధవారం మూడవరోజు బాధితులు అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి భోజనాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్యాంకు జనరల్ మేనేజర్ మరళీమోహన్ అజీజ్‌నగర్ గ్రామీణ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాండులున్న వారందరికీ డబ్బులు తప్పనిసరిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరికీ అన్యాయం చేయకుండా 20 రోజుల్లో డబ్బులు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. బాధితులు, గ్రామస్తులు బ్యాంకు సేవలను యథావిధిగా కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో బాధితులు ధర్నాను విరమించుకున్నారు. కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ విజిలెన్స్ అధికారి కేవీఎస్ రాజు, బ్యాంకు మేనేజర్ రాంమోహన్‌రావ్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జంగయ్య, మండల కార్యదర్శి రత్నం, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, అజీజ్‌నగర్ వార్డు మెంబర్ నర్సింగ్, బాధితులు మాడి శ్రీనివాస్‌రెడ్డి, మాల్లారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, తూర్పు చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కోరిక తీరిస్తే రుణం ఇస్తా..
బుల్దానా: రుణం మంజూరు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళారైతును బ్యాంక్ మేనేజర్ కోరారు. ఈ ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని దతాలా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు పంట రుణం కోసం ఈ నెల 18వ తేదీన స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ రాజేశ్ హివాసేను సంప్రదించారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన మేనేజర్, ఫోన్ నంబర్‌ను అడిగి తీసుకుని తనతో ‘టచ్’లో ఉండాల్సిందిగా కోరారు. అనంతరం ఆమెకు ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారు. 22వ తేదీన బ్యాంక్ ప్యూన్ మనోజ్ చవాన్ ఆమెకు ఫోన్ చేసి.. మేనేజర్ కోరిక తీరిస్తే రుణం ఎక్కువ మంజూరవుతుందంటూ మాట్లాడాడు. అయితే, ఆ మహిళ వీరిద్దరి ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ సంభాషణలతో కలిపి ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బ్యాంకుకు వెళ్లగా మేనేజర్‌తోపాటు ప్యూను వారిని చూసి పరారయ్యారు. అయితే, ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వందలాది మంది బ్యాంకుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ కనిపిస్తే చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బ్యాంక్ మేనేజర్‌తోపాటు ప్యూన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మేనేజర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును జిల్లా కలెక్టర్ నిరుపమా దాంగే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. -
‘ప్లీజ్.. నా కోరిక తీర్చు’
నిస్సహాయ స్థితిలో పంట రుణం కోసం వచ్చిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. కోరికలు తీర్చాలంటూ బ్యాంక్ మేనేజర్ వేధించాడు. ఏకంగా ఇంటికే రాయబారం పంపటంతో సహనం నశించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగు చూసింది. సాక్షి, ముంబై: బుల్దానా జిల్లా మల్కాపూర్ మండలంలో నివసిస్తున్న రైతు దంపతులు.. లోన్ కోసం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. అయితే బ్యాంక్ మేనేజర్ రాజేష్ హివాసె సదరు మహిళపై కన్నేశాడు. లోన్ దరఖాస్తులోని ఆమె ఫోన్ నంబర్‌కు ఫోన్‌కాల్ చేసి ‘కోరిక తీర్చాలంటూ’ వేధించాడు. అయితే లోన్ జారీఅయ్యే సమయంలో గొడవ కావటం ఇష్టం లేని ఆమె విషయాన్ని భర్తకు చెప్పలేదు. ఈ దశలో లోన్‌ను హోల్డ్‌లో పెట్టిన రాజేష్.. తన అటెండర్‌ను సదరు మహిళ ఇంటికి పంపి రాయబారం నడపాలని యత్నించాడు. రుణంతోపాటు అదనంగా లాభాలు, కొంత ప్యాకేజీ కూడా మేనేజర్ ద్వారా ఇప్పిస్తానని సదరు ప్యూన్ ఆమెతో చెప్పాడు. అతని మాటలు వినగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటబడి రోకలిబండతో అతన్ని తరిమి కొట్టింది. స్థానికులు గుమిగూడటంతో ఆ అటెండర్ అక్కడి నుంచి దౌడుతీశాడు. రాజేష్ కాల్ రికార్డింగ్స్‌తోసహా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ దళితురాలు కావటంతో అట్రాసిటీ కేసు, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మేనేజర్ రాజేశ్, అటెండర్ల కోసం గాలింపు చేపట్టారు. -
విశ్రాంత జీవనం.. ఆకుపచ్చని లోకం!
వ్యవసాయంలో ఎమ్మెస్సీ చదువుకున్న గుడిపాటి జీవన్‌రెడ్డి 35 ఏళ్లు బ్యాంకు ఉద్యోగం చేసిన తర్వాత.. తన ఇంటిపైనే ఆధునిక వసతులతో సేంద్రియ ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇనుప చువ్వల పందిరిపై గ్రీన్ షేడ్‌నెట్ వేసి.. 250కి పైగా కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్‌లో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా పండించుకొని తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సింగాపురానికి చెందిన జీవన్‌రెడ్డి ఆంధ్రా బ్యాంక్‌లో 35 ఏళ్లు సేవలందించి సీనియర్ మేనేజర్‌గా రిటైరైన తర్వాత.. హన్మకొండ బ్యాంక్ కాలనీలో 2012లో మూడంతస్థుల ఇల్లు నిర్మించుకున్నారు. తమ ఇంటిపైనే ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగుకు రెండేళ్ళ క్రితం శ్రీకారం చుట్టారు. విశ్రాంత జీవితంలో పచ్చని మొక్కలతోనే సహచర్యం చేస్తున్నారు. ఇంటిపంటల సాగు చక్కని వ్యాపకంతో పాటు రోజుకు 3 గంటల పాటు ఆనందదాయకమైన వ్యాయామంగా కూడా మారిందని ఆనందంగా చెబుతున్నారు.. కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శిగా ఉంటూ.. నలుగురిలోనూ సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 250కి పైగా కుండీలు, డ్రమ్ములు.. మొదట్లో కొంచెం ఎక్కువ ఖర్చయినా పుష్కలంగా నిరంతరం ఆకుకూరలు, కూరగాయల దిగుబడి వచ్చేలా అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ఇంటిపంటలను సాగు చేస్తుండడం జీవన్‌రెడ్డి ప్రత్యేకత. ఎత్తుల వారీగా ఇనుప బెంచీలను తయారు చేయించి, వాటిపైన కుండీలను, డ్రమ్ములను ఉంచి ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. 40 కుండీల్లో టమాటాలు, 10 కుండీల్లో మిరపకాయలు, 30 కుండీల్లో వంకాయలు, 20 కుండీల్లో గోరుచిక్కుడు, 4 కుండీల్లో బంగాళదుంపలు, రెండు కుండీల్లో అల్లం సాగు చేస్తున్నారు. చిన్న కంటెయినర్లు, గ్రోబాగ్స్‌లో క్యాబేజి, కాలీఫ్లవర్ వేశారు.మార్కెట్లో దొరికే వాటర్ డ్రమ్ములు 15 తెచ్చి.. వాటిని నిలువుగా కోసి 30 కుండీలుగా మార్చి.. ఆకుకూరలు వేశారు. నీరు నిలబడకుండా అదనపు నీరు కిందికి వెళ్లిపోవడం కోసం డ్రమ్ము అడుగున ఒక చిన్న బెజ్జం పెట్టి.. దానిపైన చిప్స్, గండ్ర ఇసుక వేసి దానిపైన ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపారు. పాలకూర 4, మెంతికూర 3, గోంగూర 3, ఉల్లి కాడలు 4, కొత్తిమీర 3 డ్రమ్ముల్లో వేశారు. ఆకుకూరల విత్తనాలు వేసిన నెలరోజుల్లో కోతకు వస్తాయి. 12–15 రోజుల వ్యవధిలో విత్తనాలు వేస్తూఉండటం వల్ల ఆకుకూరలు, కూరగాయలు సంవత్సరం పొడవునా లోటు లేకుండా చేతికి అందివస్తున్నాయని జీవన్‌రెడ్డి తెలిపారు. ఉదాహరణకు.. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు టమాటా నారు 3 దఫాలుగా పోసి, మొక్కలు నాటుకున్నారు. డ్రమ్ముల్లో ప్రతి సారీ ఆకుకూర పంటల మార్పిడి పాటించడం వల్ల చక్కని పంట దిగుబడులు వస్తున్నాయన్నారు. మట్టిలో రసాయనిక అవశేషాలతో తిప్పలు.. హైబ్రిడ్ విత్తనాల కన్నా సేంద్రియ సాగులో దేశీ విత్తనాలే మంచి దిగుబడినిస్తున్నాయన్నారు. రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టి తెప్పించి.. సగం మట్టి, సగం వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, పెరిలైట్ కలిపి తయారు చేసుకున్న మట్టిమిశ్రమంలో జీవన్‌రెడ్డి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడిన పొలాల్లో మట్టి తేవడం వల్ల తొలి ఏడాది ఇంటిపంటలు సక్రమంగా రాక నీరసం వచ్చిందన్నారు. మట్టి ఆరోగ్యం బాగుపడిన తర్వాత రెండో ఏడాది పంటలు బాగా వస్తున్నాయని ఉత్సాహంగా చెప్పారు. రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకునే కంపోస్టు, వేపపిండిని నెలకోసారి కొంచెం కొంచెంగా వేస్తున్నారు. 10–12 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన లేదా మొలిచిన 2–3 రోజుల్లోనే వేపనూనె చల్లితే చీడపీడల బెడద అంతగా ఉండదన్నది తన అనుభవమని తెలిపారు. మొదట్లోనే ఆకులు తెంపెయ్యాలి.. జీవన్‌రెడ్డి మొక్కలకు రోజూ ఉదయం వేళలో స్వయంగా నీరు పోస్తుంటారు. డ్రిప్ ద్వారా నీరిస్తే ఐదు నిమిషాల్లో పని పూర్తవుతుందని, అయితే ఏ మొక్క ఎలా ఉందో మనకు తెలియదన్నారు. గోరుముద్దలు తినిపించే తల్లికి, బిడ్డకు మధ్య పెరిగే అనుబంధం, ఆనందం వంటిదే ఇది కూడానని జీవన్‌రెడ్డి మురిపెంగా చెప్పారు. ఉదయపు నీరెండలో అదే వ్యాయామంగా భావిస్తున్నారు.పురుగూ పుట్రా కనిపిస్తే ఏరోజుకారోజు చేతులతో ఏరేయడమే ఇంటిపంటలకు ఉత్తమ మార్గమని ఆయన అంటున్నారు. టమాటాకు ఆకుమచ్చ(లీఫ్‌మైనర్) సమస్య కనిపించిన తొలిదశలోనే ఆకులను తెంపి, నాశనం చేయడం ఉత్తమం. బెండలో పేనుబంకను గమనించిన వెంటనే వేళ్లతో తీసి నేలమీద వేయాలి. గట్టి వత్తిడితో నీటిని పిచికారీ చేసినా పేనుబంక పోతుంది. అంతగా అయితే వేపనూనె పిచికారీ చేయాలన్నారు. పాలకూరను ఆశించే గొంగళిపురుగులు సాయంత్రం 5 గంటల తర్వాత మట్టిలో నుంచి బయటకు వస్తాయని, ఆ వేళలో కాచుకొని చూస్తూ పురుగులను ఏరేయాలని సూచిస్తున్నారు. హన్మకొండలో జీవన్‌రెడ్డి ఇంటిపైకనువిందు చేస్తున్న ఇంటిపంటలు ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ ఇస్తా.. బెంగళూరుకు చెందిన సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు డా. విశ్వనాథ్ స్ఫూర్తితో నేను ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాను. నాకు ఇంటిపంటల పనులు, కాలనీ అభివృద్ధి తప్ప మరే వ్యాపకమూ లేదు. గాఢమైన ఆసక్తి ఉంటే ఇంటిపంటల సాగు కష్టమనిపించదు. నాలా అందరూ ఇంత ఖర్చు పెట్టనక్కరలేదు. తక్కువ ఖర్చుతోనూ ప్రారంభించవచ్చు. మా కాలనీవాళ్లకు కూడా ఇదే చెప్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మా ఇంటితోటలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వదలచాను. ఆసక్తి ఉన్న వారెవరైనా ముందు నాకు ఫోన్ చేసి రావచ్చు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశాను. – గుడిపాటి జీవన్‌రెడ్డి (99630 99830), బ్యాంక్ కాలనీ, హన్మకొండ పాడితోనే బాగుపడ్డాం.. క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కుటుంబ నికరాదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహిళా రైతు నాగిరెడ్డి విజయగౌరి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలం రాజుపేట గ్రామానికి చెందిన విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా.. పాడి పశువుల పోషణకు సంబంధించి తెలుసుకున్న ప్రతి విషయాన్నీ ఆసక్తిగా నోట్స్ తయారు చేసుకుంటూ.. ఆ పనిని ప్రణాళికాయుతంగా చేపడుతూ ఉత్తమ పాడి రైతుగా పలు అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 18 పాడి çపశువులను పెంచుతూ రోజూ విశాఖడైరీ పాలకేంద్రానికి 80 నుంచి 100 లీటర్ల పాలు పోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి కుటుంబాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఆమె మాటల్లోనే విందాం. ‘ఎనిమిదేళ్ల క్రితం కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పశువుల పెంపకంపై దృష్టిసారించాను. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పశుక్రాంతి పథకం ద్వారా మూడు ఆవులతో డైరీ పెట్టాను. నా భర్త రామారావు సహకారంతో ప్రస్తుతం మొత్తం 15 ఆవులు 5 దూడలు పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నాను. రోజుకు సాధారణ స్థితిలో అయితే 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డైరీ పాలకేంద్రానికి అందిస్తున్నాం. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని వాడుకుంటున్నాం. భర్తతో కలసి ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 గంటల వరకు పనులు చేసుకుంటున్నాం. డైరీలో లీటరుకు రూ. 23, బయట రూ. 30 వస్తున్నది. పశువుల పెంపకం వలన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా కుమారుడు నాగేంద్రకుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కుమార్తె యశోద ఇంజనీరింగ్ చదువుతున్నది’ అన్నారామె. – రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ – కొల్ల కృష్ణకుమార్, సాక్షి, హన్మకొండ -
ఏపీజీబీలో నిధుల గోల్మాల్
కోవూరు/కొడవలూరు/విడవలూరు: జిల్లాలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నార్తురాజుపాళెం, వేగూరు, వావిళ్ల, అల్లూరు శాఖల్లో నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరుగుతోంది. నాలుగు శాఖల్లో దాదాపు రూ.3 కోట్ల మేర నిధుల స్వాహా జరిగినట్లు ప్రాంతీయ కార్యాలయానికి ఫిర్యాదులందాయి. నకిలీ పాసుపుస్తకాలు పెట్టి పంట రుణాల పేరిట అక్రమార్కులు ఆయా శాఖల్లో పనిచేసిన మేనేజర్లతో కలిసి నిధులు స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిరుపేదలను అడ్డుపెట్టుకుని వారి ఆధార్‌కార్డులు తదితరాలతో ముద్ర రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు శాఖల్లో జరిగిన నిధుల స్వాహాపై బ్యాంక్ కడప ప్రాంతీయ కార్యాలయం విచారణాధికారులతో తనిఖీ చేపట్టింది. విచారణాధికారులు రంగంలోకి దిగి బ్యాంక్‌ల్లో విచారణ జరుపుతున్నారు. బుధవారం నార్తురాజుపాళెం ఏపీజీబీలో విచారణ జరిపారు. బ్యాంక్ రికార్డులను పరిశీలించారు. రుణాల మంజూరు, అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై విచారణాధికారి సుబ్రహ్మణ్యంను అడుగగా తొలుత నార్తురాజుపాళెం శాఖలో విచారణ జరుపుతున్నామన్నారు. మిగతా శాఖలను పరిశీలించి, విచారణ పూర్తిగా జరిపిన అనంతరం ఏ మేరకు నిధుల స్వాహా జరిగిందో తెలుస్తుందన్నారు. విచారణ అనంతరం స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. నకిలీ పత్రాలతో రుణాలు అల్లూరు: నకిలీ పత్రాలతో రుణాలు పొందిన వైనం అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో బుధవారం వెలుగుచూసింది. అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతాదారుడైన ఇందుపూరుకు చెందిన కాలేషా క్రాప్ లోనుకు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.3 లక్షలు రుణం పొందాడు. ఇదే పత్రాలను నకలీవి సృష్టించి ఇతర బ్రాంచ్‌ల్లోనూ రుణాలు పొందించినట్లు గుర్తించి ఖాతాదారుడిపై చీటింగ్ కేసు పెట్టామని అల్లూరు ఆంధ్రప్రగతి బ్యాంక్ మేనేజర్ మోహన్‌రెడ్డి తెలిపారు. -
బరితెగించిన శాడిస్ట్ భర్త
అనుమానంతో భార్యను వేధించాడు. విభేదాలు వచ్చి ఆమెతో విడిపోయాడు. అయినా అతనిలోని శాడిజం చల్లారలేదు. భార్య ఫొటోలను అశ్లీల వెబ్సైట్లలోకి పోస్ట్ చేశాడు. ఆమె పేరుతో చాటింగ్ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. సాక్షి, సిటీబ్యూరో: వృత్తిరీత్యా బ్యాంక్ మేనేజర్ అయినప్పటికీ శాడిస్ట్‌గా మారి బరితెగించాడు. భార్యను వేధించాలనే ఉద్దేశంతో ఆమె ఫొటోలను అశ్లీల వెబ్సైట్లలో పోస్ట్ చేయడంతో పాటు ఆమె మాదిరిగానే చాటింగ్స్ చేయడం మొదలెట్టాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని బుధవారం శ్రీకాకుళంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని ఓ గ్రామీణ బ్యాంకులో ఓ వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా కొన్నాళ్లపాటు అక్కడే మరో బ్యాంకులో పని చేసి, ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఆమెను వేధిస్తుండటంతో ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అదును చూసుకుని ఆమె సెల్‌ఫోన్ తీసుకుని అందులో ఉన్న ఆమె ఈ–మెయిల్ ఐడీ సంగ్రహించాడు. దీనిని వినియోగించి కొన్ని అశ్లీల వెబ్సైట్లలో ఖాతాలు తెరిచి అందులో తన భార్య ఫొటోలు పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఆమె మాదిరిగానే చాటింగ్స్ చేస్తున్నాడు. ఈ పంథాలో ఆమెకు పరిచయం ఉన్న వారికి మేసేజ్‌లు పంపిస్తూ... ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాడు. తన పేరుతో ఎవరో ఈ పని చేశారని భావించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి భర్తే నిందితుడిగా గుర్తించి అరసవెల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ శాడిస్ట్ మొగుడిని నగరానికి తరలించనున్నారు. -
బ్యాంకు మేనేజర్‌పై చీటింగ్ కేసు
కర్నూలు : నకిలీ డాక్టర్లతో కర్నూలు, ఆదోనిలో ఆసుపత్రులు నిర్వహిస్తున్న నాగేంద్రప్రసాద్‌తో పాటు కర్నూలు కిడ్స్ వరల్డ్ పక్కనున్న కెనరా బ్యాంక్ మేనేజర్‌పై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయ్యింది. నాగేంద్ర ప్రసాద్ బీటెక్ చదువుకున్నాడు. ఆయన భార్య వాణికుమారి ఇంటర్మీడియట్ చదువుకుంది. అయితే కర్నూలు, ఆదోనిలో ఆసుపత్రుల నిర్వహణకు రెడ్డిపోగు విజయభాస్కర్ సహాయం కోరాడు. ఆసుపత్రి నిర్వహణలో భాగస్వామిగా ఉంటే నెలకు రూ.లక్షన్నర జీతం ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. నకిలీ వైద్యులతో ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ నెల 20వ తేదీన అధికారులు దాడులు నిర్వహించి ఆదోని, కర్నూలులో ఉన్న ఆసుపత్రులను సీజ్ చేశారు. దర్యాప్తులో నాగేంద్ర ప్రసాద్ మోసాలు మరిన్ని బయటపడ్డాయి. డాక్టర్ రెడ్డిపోగు విజయభాస్కర్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి కర్నూలు కిడ్స్ వరల్డ్ పక్కనున్న కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టి కోటిన్నర రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ విషయం విజిలెన్స్ తనిఖీల్లో బయటపడటంతో డాక్టర్ విజయభాస్కర్‌ను విజిలెన్స్ అధికారులు విచారించారు. రుణంతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తాను చదువుకున్న సర్టిఫికెట్లను నకిలీ చేసి ఫోర్జరీ సంతకాలతో నాగేంద్రప్రసాద్, ఆయన భార్య వాణి కుమార్ రుణం తీసుకుని మోసం చేశారంటూ శనివారం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నాగేంద్రప్రసాద్‌తో పాటు ఆయన భార్య వాణికుమారి, బావమరిది రమేష్, అప్పటి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్, మేనేజర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ డేగల ప్రభాకర్ తెలిపారు. -
పింఛన్ కోసం వెళ్తే కర్రతో కొట్టాడు
బ్యాంక్ మేనేజర్‌పై ఫిర్యాదు ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ తమపై దురుసుగా ప్రవర్తిస్తూ కర్రతో కొట్టాడని పింఛన్‌దారులు అల్లె లక్ష్మి, ఎండీ. నస్రీం, శాగ దేవవ్వ, ఒడ్డె మల్లవ్వ తెలిపారు. సోమవారం పింఛన్ దారులు, ఖాతాదా రులు పెద్ద సంఖ్యలో బ్యాంక్ వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో క్యూలైన్లో ఉన్న తమను మేనేజర్ కర్రతో కొట్టాడని విలపిం చారు. అక్కడే ఉన్న ఖాతాదారులు, మహి ళలు మేనేజర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నాయకులకు సమాచారం అందించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తిరుపతి, రాములు, రాజేశం, మహేష్‌రెడ్డి, రాం గోపాల్ బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారులతో కలసి బైఠా రుుంచారు. గంటకు పైగా బ్యాంకు ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీసులు వారిని సముదారుుంచారు. తాను ఎవరిపై దాడి చేయలేదని, దురుసుగా ప్రవర్తించలేదని బ్యాంక్ మేనేజర్ రాజేంద్రకుమార్ అన్నారు. బ్యాంకు మేనేజర్‌పై ఎస్సై ప్రవీణ్‌కు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రేణుక బ్యాంక్ వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. ధాన్యం డబ్బుల కోసం బ్యాంక్‌కు వచ్చిన తనను మేనేజర్ కర్రతో నడుముపై కొట్టాడని, నొప్పితో నడవ రావడం లేదని దేవవ్వ తెలిపింది. -
ఆదేశాలు రాలేదంటే అరెస్ట్ చేయిస్తా
పెళ్లిళ్లకు రూ.2.50 లక్షల నగదు ఇవ్వాల్సిందే నా సిఫార్సు అవసరం లేదు బ్యాంక్ మేనేజర్‌పై కలెక్టర్ ఆగ్రహం ఏలూరు (మెట్రో) : వివాహాలకు అవసరమైన డబ్బును డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ఎవరికైతే పెళ్లి కోసం డబ్బు కావాలో శుభలేఖను పరిశీలించి, బ్యాంకు మేనేజర్ రూ.2.5 లక్షలు బ్యాంక్ ఖాతా నుంచి డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని, ప్రతి విషయానికి కలెక్టర్ సంతకం కావాలని కలెక్టర్ వద్దకు పంపించవద్దని కలెక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామానికి చెందిన రావూరి నాగ వెంకటసత్యనారాయణ తన కుమార్తె నాగలక్ష్మి వివాహం డిసెంబర్ 8న నిర్వహించనున్నామని, పెళ్లి ఖర్చుల కోసం బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళితే తమకు అనుమతి లేదని చెబుతున్నారని, కలెక్టర్, ఎస్పీలతో సంతకం చేయిస్తే బ్యాంక్ మేనేజర్ డబ్బులిస్తామని చెబుతున్నారని కలెక్టర్ ధృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెళ్లిళ్లకు డబ్బు డ్రా చేసుకోవాలన్నా తన సంతకం కావాలనడం ఎంత వరకూ సమంజసమన్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉన్నా మేనేజర్లు సమస్య పక్కదారి పట్టిస్తున్నారని, తక్షణమే బ్యాంక్ మేనేజర్‌ను పిలిపించారు. బ్యాంకు మేనేజర్ శరవణ్ రాగానే పెళ్లికి కావాల్సిన డబ్బు డ్రా చేసుకునేందుకు తన సంతకం దేనికని కలెక్టర్ ప్రశ్నించారు. తమకు ఇంకా రిజర్వు బ్యాంకు నుంచి ఆదేశాలు రాలేదని మేనేజర్ సమాధానం చెప్పడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి డబ్బు డ్రా చేసి ఇచ్చేందుకు ఏమైందని కలెక్టర్ ప్రశ్నించారు. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు ఆదేశాలు రానందున తానేమీ చేయలేనని శరవణ్ చెప్పడంతో రిజర్వు బ్యాంకు ఆదేశాలు ఆన్లైన్లో ఉన్నాయని వాటిని చూసి తక్షణమే ఖాతాదారునికి డబ్బు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. అయినప్పటికీ మేనేజర్ వినకపోవడంతో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. దీంతో స్పందించిన బ్యాంకు మేనేజర్ ఉన్నతాధికారులతో మాట్లాడి నగదు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పడంతో సమస్య పరిష్కారమైంది. జిల్లాలో ఏ ఒక్క పెళ్లి కూడా డబ్బుల్లేకుండా నిలిచిపోకూడదని, రిజర్వు బ్యాంకు విధానాలను అన్ని బ్యాంకులు పాటించాలని ఆదేశించారు. -
బ్యాంకులోనే పనిచేస్తూ.. మేనేజర్ మృతి
బ్యాంకుల లోంచి, ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోడానికి క్యూలైన్లలో నిల్చుని మరణించారంటూ ఇన్నాళ్లూ కథనాలు వచ్చాయి. కానీ కస్టమర్లకు డబ్బులు ఇవ్వడానికి మూడు రోజులుగా బ్యాంకులోనే ఉండిపోయి రోజుకు దాదాపు 24 గంటలూ పనిచేస్తున్న ఓ బ్యాంకు మేనేజర్.. తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. రోహ్తక్ సహకార బ్యాంకు మేనేజర్ అయిన రాజేష్ కుమార్ బుధవారం ఉదయం తన చాంబర్లోనే మరణించి కనిపించారు. అంతకుము మూడు రోజుల నుంచి ఆయన బ్యాంకు బయట కాలు పెట్టలేదని, విపరీతమైన పని ఒత్తిడి వల్లే గుండెపోటు వచ్చిందని సహోద్యోగులు అంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ఈనెల 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినప్పటి నుంచి బ్యాంకుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పనిచేశాయి. ఒక్క సోమవారం మాత్రం గురునానక్ జయంతి కారణంగా చాలావరకు బ్యాంకులకు సెలవు ఇచ్చారు. కానీ కొన్ని బ్యాంకులు ఆరోజు కూడా పనిచేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని క్యూలైన్లు ఉండటంతో.. రాజేష్ కుమార్ అలుపెరగకుండా పనిచేస్తూనే ఉన్నారు. రాత్రి పూట కూడా ఇంటికి వెళ్తే మళ్లీ పొద్దున్నే రావడం ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో రాత్రిళ్లు బ్యాంకులోనే నిద్రపోయారు. ఇప్పటికే ఆయనకు గుండెజబ్బు ఉందని, అందుకోసం మందులు వాడుతుంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేష్ కుమార్ మృతితో బ్యాంకును ఒకరోజు మూసేశారు. ఉదయం సెక్యూరిటీ గార్డు వచ్చి మేనేజర్ తలుపు తట్టినా తీయకపోవడంతో.. ఇతర ఉద్యోగులను పిలిచాడు. అంతా కలిసి తలుపు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే ఆయన మరణించి కనిపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆ నోట్లు.. కుళ్లుకంపు కొడుతున్నాయి!
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించడంతో బ్యాంకుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. వీళ్లంతా డిపాజిట్ చేస్తున్న దాంట్లోని నల్లడబ్బు కుళ్లిపోయిన తోలు వాసన వస్తోందట!! ఈ విషయాన్ని ఒక బ్యాంకు మేనేజర్ చెప్పారు. కొంతమంది రాత్రిపూట కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. డబ్బు రాగానే తామే ముందు తీసుకుని వెళ్లిపోవాలని ఇలా చేస్తున్నారు. బయట వేచి ఉన్నవాళ్లకు ఇన్ని ఇబ్బందులుంటే.. మరి లోపల బ్యాంకులో కూర్చుని ఇన్ని వేల మంది వస్తున్నా అందరికీ ఓపిగ్గా డబ్బులు ఇస్తూ, వాళ్ల వివరాలు నోట్ చేసుకుంటూ సెలవులన్నవి లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి ఏమంటున్నారు? ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల తమకు పనిభారం పెరిగిపోయిందని ఏమైనా చెబుతున్నారా.. కానే కాదు. సాధారణంగా రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు. కానీ గత వారాంతంలో అన్ని బ్యాంకులూ పనిచేశాయి. మిగిలిన రోజుల్లో కూడా అదనపు సమయం పనిచేస్తున్నాయి. దీనిపై ముంబైకి చెందిన 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఫేస్బుక్ పేజిలో ఒక బ్యాంకు మేనేజర్ తన అభిప్రాయాన్ని రాశారు. ఊపిరి పీల్చుకోడానికి కూడా ఖాళీ లేకుండా.. అసలు తిండి, తిప్పలన్న మాటే మర్చిపోయి బ్యాంకు ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో ఆమె వివరించారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ''కొన్ని సంవత్సరాల తరబడి పేరుకుపోయిన నల్లడబ్బు మా దగ్గరకు వస్తోంది. ఈ డబ్బు అంతా కుళ్లిపోయిన తోలు వాసన వస్తోంది. అందుకే మా క్యాషియర్లందరికీ మాస్కులు కావాలని మేం ఆర్డర్ చేశాం. అంత ఘోరంగా ఈ డబ్బు వాసన వస్తోంది. ఇక బ్యాంకులకు వచ్చేవాళ్లు ఎంత దారుణంగా ఉంటున్నారో, మమ్మల్ని ఎంత నీచంగా చూస్తున్నారో.. నాలుగు గంటల క్రితం నాకు నాందేడ్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. నామీద ఎడతెరిపి లేకుండా తిట్లవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మరాఠీలో శాపనార్థాలు పెట్టాడు. ఇలాంటివి ప్రతిరోజూ కొన్ని డజన్లు మాకు ఎదురవుతాయి. పొద్దున్న బ్యాంకుకు డ్యూటీ సమయం కంటే ముందే వస్తాం. డ్యూటీ ముగిసిపోయిన చాలా సేపటి వరకు అక్కడే ఉంటాం. తిండి తిప్పల మాట దేవుడెరుగు.. కనీసం మంచినీళ్లు తాగే తీరిక కూడా ఉండట్లేదు. ఇలా గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్నా.. రెండు గంటలు క్యూలో ఉన్నవాళ్లు మమ్మల్ని నానా తిట్లు తిట్టుకుంటూ మేమిచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నారు. మరి మా కష్టాలు పట్టించుకునేవాళ్లు ఎవరూ ఉండరా? మరికొందరైతే వాళ్లు కోరినంత డబ్బులు మార్చకపోతే మా విషయాన్ని మీడియాకు చెప్పి తేలుస్తామని బెదిరిస్తున్నారు. అక్కడ బోలెడంత సీన్ క్రియేట్ చేస్తున్నారు'' అని ఆమె అన్నారు. -
నేడే కూతురు పెళ్లి...వంద నోట్లు ఇప్పించండి
బ్యాంకు మేనేజర్‌కు వధువు తల్లిదండ్రుల వేడుకోలు సంగెం: పెద్ద నోట్ల రద్దు పేదింట్లో పెద్ద తిప్పలు తెచ్చిపెట్టింది. వరం గల్ రూరల్ జిల్లా సంగెం మండ లంలోని కాట్రపల్లి గ్రామానికి చెంది న చోల్లేటి రజిత, మల్లారెడ్డి దంప తులు తమ కుమార్తె మౌనిక పెళ్లిని 11న (నేడు) జరపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లికి అవసర మైన డబ్బు, ఇతర సామగ్రిని సమ కూర్చుకుంటున్నారు. బంధువులకు కార్డులు పంపిణీ చేశారు. అయితే రూ. 500, రూ. వెయి నోట్లను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో 9న పెళ్లి పనులకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం వరంగల్ నగరానికి వెళ్లిన మల్లారెడ్డికి ఏ షాపుకు వెళ్లినా రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని చెప్పారు. తన దగ్గర ఉన్నవన్నీ పెద్ద నోట్లే కావ డంతో ఏం చేయాలో పాలుపోలేదు. రోజంతా తిరి గి ఇంటికి చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో పెళ్లి వాయిదా వేయాల్సి వస్తుందేమేనని వారు మథన పడ్డారు. గురువారం ఉదయం సంగెం ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి మేనేజర్ రాజమోహన్‌రావును కలసి పెళ్లి కార్డు చూపించి తమ గోడు వెళ్లబో సుకున్నారు. తెల్లవారితే పెళ్లి.. ఏ పని చేయాలన్నా డబ్బులు లేనిదే చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫారాలు ఇస్తానని, ఒక్కొక్కరికి రూ.4 వేలు వందనోట్లు ఇస్తానని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో వధువరుల తల్లితండ్రులు రజిత, మల్లారెడ్డిలు తమ బంధులను పిలిపించి రూ.20 వేలకు వందనోట్లు మార్చుకుని వెళ్లి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. -
బ్యాంకు మేనేజర్‌కు మూడేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: ‘స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్’ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎన్ఎంఆర్ దీక్షితులుకు సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. మరో నిందితురాలు జయశ్రీకి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.75 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కేసులో నిందితుడు చక్కిలం రఘురామ్ తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన్ను అరెస్టు చేయాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చక్కిలం ఎస్టేట్స్ సంస్థను నిర్వహించే చక్కిలం రఘురామ్.. తప్పుడు పత్రాలతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ శివాజీనగర్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి రూ.2.5 కోట్లు రుణంగా తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్లు ఎన్ఎంఆర్ దీక్షితులు, ఉదయ్‌కుమార్ (కేసు విచారణ సమయంలో చనిపోయారు)లు నిందితులు రఘురామ్, చక్కిలం ఎస్టేట్స్ ఉద్యోగి జయశ్రీలతో కుమ్మక్కైనట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. -
బోగస్ రుణాలపై క్రిమినల్ కేసులు పెట్టారా...?
కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్‌ను కోరిన వైఎస్సార్ సీపీ నాయకులు... పార్వతీపురం: సీతానగరం మండలంలో ఇటీవల వెలుగు చూసిన నకిలీ 1–బి, బోగస్ రుణాలకు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టారా...? అని వైఎస్సార్ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ రమేష్‌ను కలిసిన ఆయన కార్పొరేషన్ బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు పొందిన లబ్ధిదారుల జాబితా కావాలని సమాచార హక్కు చట్టం ప్రకారం కోరారు. అనంతరం మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు, సీతానగరం తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులతో కుమ్మక్కై, అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో దాదాపు రూ.6కోట్ల వరకు పలు బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు ఆరోపణలు వెలుగు చూశాయన్నారు. ఆయనతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బ్యాంకు ముందు కాసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వాధికారులు, బ్యాంకులు స్పందించని పక్షంలో తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్లు గొల్లు వెంకట్రావు, ఓ. రామారావు, ఎంపీటీసీలు గండి శంకరరావు, చింతల జగన్నాధం, బడే రామారావు, సర్పంచ్‌లు యాండ్రాపు తిరుపతిరావు, బొమ్మి రమేష్ ,బైరిపూడి కరుణేశ్వరరావు, గణేష్‌లతో పాటు ఆపార్టీ నాయకులు చుక్క లక్షు్మంనాయుడు, పాలవలస గోవింద్, నరసన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
ఘట్కేసర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాద్రి టౌన్షిప్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నల్లకుంట శాఖ మేనేజర్ శ్రీనివాసాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన తన ఫ్లాట్‌లోని రూంలో ఉరివేసుకున్నాడు. మధ్యాహ్నం అయినా ఆయన తలుపులు తీయకపోయేసరికి అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ఆయన ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే ఆయన బలవ్మనరణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు సంఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి
నెల్లికుదురు : అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి చెందిన ఘటన మండలంలోని బంజర బస్టాండ్ వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్సై గోదరి రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన కార్పాకుల రవికాంత్(54) ఎస్బీహెచ్లో ఉద్యోగం చేస్తున్నాడు. గత సంవత్సరం తొర్రూర్ ఎస్బీహెచ్లో మేనేజర్‌గా పనిచేసి పదోన్నతిపై వైజాగ్‌లో జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొర్రూర్ ఎస్బీహెచ్లో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసేందకు బుధవారం వచ్చారు. బుధవారం 3 గంటల తర్వాత రవికాంత్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోందని భార్య సెలీనా ఫిర్యాదులో పేర్కొంది. అయితే బుధవారం అర్ధరాత్రి నుంచి బంజర స్టేజి వద్ద కారు ఉందని, గురువారం ఉదయం చూసేసరికి డ్రైవర్ సీట్లో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మృతుడి చొక్కా జేబులో ఉన్న ఐడీ కార్డు ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఎస్సై చెప్పారు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ కృష్ణారెడ్డి పరిశీలించారు. రవికాంత్ తొర్రూరులో పనిచేస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయని, ఆయన మృతికి అవే కారణమై ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కారంపూడి ఎస్బీఐలో చోరీకి యత్నం
గుంటూరు: గుంటూరు జిల్లా కారంపూడిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (వ్యవసాయ అభివృద్ధి శాఖ)లో శుక్రవారం రాత్రి దుండగులు చోరీకి యత్నించారు. దుండగులు బ్యాంకు తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి...లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావటంతో బ్యాంకులోనే ఉన్న ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించి.. విఫలం కావడంతో ఏటీఎం మిషన్‌ను పగులగొట్టారు. ఆ ప్రయత్నము విఫలమైంది. దీంతో దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బ్యాంకు మేనేజర్ ఆ విషయాన్ని గమనించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
‘హలో.. నేను బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా..’
బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని మీ ఏటీఎం బ్లాక్ అయింది. దాన్ని పునరుద్ధరించాలంటే పిన్ నెంబర్ చెప్పండి అని పిన్ తెలుసుకున్న ఓ అగంతకుడు యువతి అకౌంట్లో నుంచి రూ. 14 వేల నగదును కాజేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కాంతం రేవతికి ఫోన్ చేసి అజ్ఞాత వ్యక్తి మీ ఏటీఎమ్ బ్లాక్ అయిందని దాన్ని పునరుద్ధరించడానికని పిన్ నెంబర్ తెలుసుకొని అకౌంట్లోని రూ. 14 వేల నగదును కాజేశాడు. విషయం గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. -
బ్యాంక్ మేనేజర్‌పై రౌడీయిజం
రుణం చెల్లించమంటే రుబాబు పార్వతీపురం : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పార్వతీపురం పట్టణంలో ప్రస్తుతం రౌడీయిజం ఛాయలు కనిపిస్తున్నాయి. తీసుకున్న రుణం చెల్లించమన్నందుకు స్థానిక నవిరి కాలనీలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్‌ను కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్, అతని అనుచరులు బెదిరించారు. దీనికి సంబంధించి బ్రాంచి మేనేజర్ జె. బాలకృష్ణ, మెయిన్ బ్రాంచి మేనేజర్ ఎ. రవికుమార్ సోమవారం రాత్రి వివరాలు వెల్లడించారు. కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్ అనే వ్యక్తి పల్సర్ బైక్ కొనుగోలుకు 2015 మార్చిలో రూ.45 వేల రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించలేదు సరికదా...రుణం కూడా చెల్లించలేదు. ఈ విషయమై బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించాలని బీఎం బాలకృష్ణ కోరగా, సోమవారం సాయంత్రం పూటుగా మద్యం తాగిన మరో ఐదుగురు వ్యక్తులను బ్రాంచికి తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతనితో వచ్చిన వ్యక్తులు ఏ ఊరు నీది...ఎక్కడుంటున్నావ్...మీ ఇంటికి భోజనానికొస్తాం... బ్యాంకు ఎప్పుడు కడతావ్... బ్యాంకు కట్టి బయటికి రా...? నీ సంగతి చూస్తామంటూ...బెదిరించారు. ఈ విషయాన్ని ఎస్సై సురేంద్రనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. -
బ్యాంక్ మేనేజర్‌నంటూ ఘరానా మోసం
మంగపేట : తాను బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానంటూ ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకొని అకౌంట్లో ఉన్న రూ.10 వేలు డ్రా చేసుకుని ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన జాడి రవి సెల్‌ఫోన్‌కు మంగళవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో 8298328147 నంబర్ నుంచి 9 సార్లు ఫోన్ వచ్చింది. చివరిసారి ఫోన్ లిఫ్ట్ చేయగా తాను బ్యాంక్ మేనేజర్‌నని, మీ బ్రాంచ్ ఏటీఎం, ఆధార్, పాన్‌కార్డు నంబర్లు ఇవ్వమని అడిగాడు. ఎందుకని రవి ప్రశ్నిం చగా మీ పిన్ మార్చుతున్నామని చెప్పడంతో తన పిన్ నంబర్ చెప్పాడు. పిన్ నంబర్ చెప్పిన వెంటనే తన బ్యాంక్ ఆకౌంట్, తన పూర్తి వివరాలను వెల్లడించాడు. ఫోన్ కట్ కాగానే తన ఏటీఎం ద్వారా రూ.10 వేలు డ్రా చేసినట్లు రవి ఫోన్‌కు మెసేజ్ వచ్చిది. వెంటనే అతడు మంగపేటకు వచ్చి అసలు ఏమి జరిగిందని తెలుసుకునేసరికి ఎవరో అపరిచిత వ్యక్తి ఏటీఎం పిన్‌నంబర్ తెలుసుకుని మీ అకౌంట్లో ఉన్న రూ.10 వేల నగదును డ్రా చేశారని సిబ్బంది వివరించారు. జరిగిన విషయంపై విచారణ జరిపి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఉదయం పిర్యాదు చేసినట్లు బాధితుడు వివరించాడు. -
రూ.8 కోట్లు స్వాహా చేసిన మేనేజర్
-
హిప్నాటిజంతో.. రూ. 93 వేలు నొక్కేశాడు!
ఆయనో బ్యాంకు మేనేజర్. రోజూలాగే తన కేబిన్‌లో కూర్చున్నారు. తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తితో కాసేపు అలా మాట్లాడారో లేదో.. ఏదో మత్తులో ఉన్నట్లుగా క్యాషియర్ వద్దకు వెళ్లి, 90 వేల రూపాయలు అడిగి తీసుకున్నారు. తన జేబులో ఉన్న మరో రూ. 3వేలు కలిపి.. మొత్తం రూ. 93 వేలు ఆ వ్యక్తికి ఇచ్చేశారు. పది నిమిషాల తర్వాత గానీ ఏం జరిగిందో ఆయనకు తెలియలేదు. విషయం ఏమిటంటే, అవతల వచ్చిన వ్యక్తి మేనేజర్‌ను 'హిప్నటైజ్' చేశాడు! అవును.. హిప్నాటిజం ప్రభావంలో పడి సదరు బ్యాంకు మేనేజర్ అక్షరాలా 93 వేల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో జరిగింది. మేనేజర్ భూపేంద్ర కుమార్ మణిరామ్ (52) వద్దకు తన పేరు ఎంకే శర్మ అని చెప్పుకొని ఓ వ్యక్తి వచ్చాడు. తాను మహారాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. తన తమ్ముడు వికలాంగుడని, అతడి పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలని వచ్చానన్నాడు. ఎంహడాలో తక్కువ ధరకు ఫ్లాట్లు ఇప్పిస్తానని కూడా తెలిపాడు. తన పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా చెప్పి, పాన్ కార్డు ఇతర వివరాలు ఇవ్వాలన్నాడు. తర్వాత కాసేపటికి మేనేజర్ భూపేంద్ర కుమార్ క్యాషియర్ వద్దకు వెళ్లి 90 వేలు తీసుకున్నారు. తన జేబులోంచి మరో 3 వేలు తీసి, మొత్తం 93 వేలు అతడికి ఇచ్చేశారు. తానేదో ట్రాన్స్‌లో ఉన్నానని, తనకేమీ తెలియలేదని, పదినిమిషాల తర్వాత మాత్రమే పూర్తిగా తెలివి వచ్చిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. తీరా చూస్తే ఎంహడాలో ఎంకే శర్మ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని తెలిసింది. హిప్నాటిజంతో డబ్బులు దోచుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు కూడా అంటున్నారు. -
బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ కత్తి దాడి..
-
బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ కత్తి దాడి..
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం సెంటినరీ కాలనీలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌పై అటెండర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం సాయంత్రం బ్యాంకులో విధులు ముగించుకుని మేనేజర్ రామానుజాచార్యులు కారులో పెద్దపల్లిలోని తన నివాసానికి బయల్దేరారు. అదే బ్యాంకులో అటెండర్‌గా పనిచేసే శ్రీకాంత్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. పెద్దపల్లి సమీపంలో కారును ఆపిన శ్రీకాంత్ తన దగ్గరున్న కత్తితో మేనేజర్ రామానుజాచార్యులు పొట్టలో మూడు సార్లు పొడిచాడు. అనంతరం అటెండర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మేనేజర్‌కు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ఆదివారపు పేట పెన్షన్‌లైన్‌లో చోరీ జరిగింది. స్థానికంగా ఉండే ఇండియన్ బ్యాంకు మేనేజర్ బీవీ సుగుణ దాస్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ చోరీ జరిగింది. ఇంట్లో అంతా నిద్రపోతుండగా దొంగ వెనక వైపు నుంచి చొరబడ్డాడు. అలికిడి కావడంతో బ్యాంకు మేనేజర్ కుమార్తె నిద్ర లేచింది. దొంగను చూసి అరవడంతో పరారయ్యాడు. ఇంట్లో ఉన్న రూ.లక్షన్నర నగదు, పదికాసుల బంగారు గొలుసు చోరీకి గురైనట్టు బాధితులు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు మేనేజర్‌ను నిలదీసిన రైతులు
నిజామాబాద్: పంటరుణాలు రెన్యువల్ చేయాలంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని పచ్చలనరుకుడు గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక డీజీబీ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. త్వరగా రుణాలు రెన్యూవల్ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. -
హత్యచేసి గంగా నదిలోకి విసిరేసి..
షెరాపులి: పశ్చిమ బెంగాల్లో ఓ బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళను, ఆమె కూతురుని హత్య చేసి రెండు సూట్ కేసుల్లో వారి మృత దేహాలను ఉంచి గంగా నదిలో విసిరేసి పోలీసులకు చిక్కాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 45 ఏళ్ల సమరేశ్ సర్కార్ అనే వ్యక్తి షెరాపులి వద్ద బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతడికి అప్పటికే ఓ భార్య తిటాగఢ్ అనే చోట ఉండగా తాను విధులు నిర్వర్తిస్తున్న చోట సుచేత చక్రవర్తి అనే 34 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తుండగా ఆమె ఇటీవల తనను వివాహం చేసుకోవాల్సిందిగా సమరేశ్ ను డిమాండ్ చేసింది. దీంతో భార్యకు భయపడిన అతడు సుచేతను, ఆమెకు అప్పటికే ఉన్న ఐదేళ్లపాపను హతమార్చి ఇద్దరి మృతదేహాలను సూట్ కేసులలో పెట్టి గంగా నదిలో విసిరేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి వారి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. అతడిని 12 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. -
ఘరానా మోసం
43 బినామీ ఖాతాలతో రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్ ఆలస్యం వెలుగు చూసిన వైనం దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివమొగ్గ:బ్యాంక్‌లో బినామీ ఖాతాలు సృష్టించి రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... శివమొగ్గలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో మేనేజర్‌గా పనిచేస్తున్న గణపతి ముంగ్రి తన బంధువుల పేరుతో 43 బినామీ ఖాతాలు తెరిచి వీటి ద్వారా రూ. 2.16 కోట్లను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు మొత్తం బయటి వ్యక్తులకు రుణాలుగా ఇచ్చారని, వాటిని ఇప్పటి వరకు కట్టలేదని ఆడిట్ అధికారుల వద్ద బ్యాంక్ మేనేజర్ బుకాయించాడు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి బ్యాంక్ ఏజీఎం ఇటీవల జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని జిల్లా ఎస్పీ రవి.డి.చెణ్ణన్నవర్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందుకోసం జిల్లా ఏసీపీ ఎస్.విష్ణువర్ధన్‌ను ఆయన నియమించారు. కాగా, ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
పంటరుణాలు వెంటనే రెన్యూవల్ చేయాలి
సాక్షి, సంగారెడ్డి: రెండవ విడత రుణ మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగానే బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు రెన్యూవల్ చేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్ ఎస్.వి.రమణారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో బ్యాంకర్ల సమావేశం జరిగింది. రెండవ విడత రుణ మాఫీ, పంట రుణాల రెన్యూవల్, వివిధ సంక్షేమ పథకాల అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలోనే రెండవ విడత రుణ మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా బ్యాంకర్లు రైతులకు పంట రుణాలను రెన్యూవల్ చేయాలని సూచించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పంటరుణాలతోపాటు రైతులు పాలీహౌజ్, సోలార్ పంపుసెట్లు, ఫామ్ మెకనైజేషన్ పథకం కింద రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే వారికి బ్యాంకర్లు మంజూరు లేఖలు త్వరితగతిన అందజేయాలని సూచించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు 90 స్కీంలు అందజేశామని, మిగతా పదిశాతం ఈనెలాఖరులోగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం డెరైక్టర్ మేఘరాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వేల మంది యువకులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ఉచిత శిక్షణ అందజేసినట్లు వివరించారు. ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులకు బ్యాంకర్లు రుణాలు అందజేసి ప్రోత్సహించాలని కోరారు. స్వయం ఉపాధి పొందేందుకు రుణాలందించాలన్నారు. యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు వీలుగా రూ.50 వేల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ హుక్యానాయక్, డీఆర్డీఏ ఏపీడీ వెంకటేశ్వర్లు, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రుణాల రికవరీలో ముందంజలో వుండాలి సంగారెడ్డి మున్సిపాలిటీ : బ్యాంకు లింకేజీల ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ చేయడంలో ముందంజలో వుండాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో వుందని అన్నారు. వచ్చే నెలలో అదనంగా మరికొన్ని స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. సబ్సిడీ శాతాన్ని తగ్గించడం వల్ల రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదన్నారు. దాని వల్ల నిర్దేశించిన లక్ష్యాలను చేరలేకపోతున్నామన్నారు. దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో రికవరీ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. డీఆర్ డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దాని ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మహిళా సమాఖ్య ఖాతాలో జమ చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్వహించనున్న హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
దేవుడు వరమిచ్చినా..
బ్యాంకు మేనేజర్ రుణం ఇస్తామన్నా సంతకం చేయని సీసీ వెన్స్సెల్కు 186 అర్జీలు విజయనగరం కంటోన్మెంట్: బ్యాంకు మేనేజర్ డ్వాక్రా సంఘానికి రుణం ఇస్తామన్నా వెలుగు సీసీ సంబంధిత ఫైల్‌పై సంతకం చేయడం లేదని బాడంగి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరా డ్వాక్రా మహిళా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు దళాయి లక్ష్మి, ఆవు రమణమ్మలు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ప్రతి వారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌కు సోమవారం 186 అర్జీలు, ఫిర్యాదులు వచ్చాయి. బాడంగి మండలం డొంకినవలస ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో తమకున్న పాత రుణం తీర్చేసి కొత్త రుణానికి ధరఖాస్తు చేసుకుంటే రుణమిస్తామని బ్యాంకు మేనేజర్ ఫైల్తీసుకురమ్మన్నారనీ, కానీ సంబంధిత ఫైల్‌పై వెలుగు సీసీ సంతకం చేయడం లేదని మహిళలు ఆవేదన చెందారు. ఇప్పటికే తలా రూ.50 పోగేసి ఇచ్చామనీ, కానీ ఏడు నెలలుగా తాను సంతకం చేయకుండా తిప్పుతున్నాడని తమకు అత్యవసరం ఉన్నప్పటికీ ఏడు నెలలుగా ఆయన చుట్టూ తిరుగుతున్నామనీ అధికారులు చర్యలు తీసుకుని తమకు రుణం వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ప్రత్యామ్నాయ భూమి చూపితేనే తోటపల్లికి భూమి ఇస్తాం... తోటపల్లి ప్రాజెక్టు కోసం అదనంగా తీసుకున్న 9.81 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా సాగు భూమి ఇస్తేనే మేం భూములు ఇస్తామని కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన రేగాపు గవరన్న దొర, ఉరమల సత్తెమ్మ, బండి దాలెందొర, నందేడ గంగమ్మలు అర్జీ ఇచ్చారు. మూడు గ్రీవెన్స్సెల్ల నుంచీ తాము తిరుగుతున్నామని వారు వాపోయారు. వెంటనే తమకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని వారు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. రేషన్ ఇవ్వమని చెబుతున్నారు. విజయనగరంలోని తెలకల వీధి రామమందిరం వద్ద గల రేషన్ షాపులో ప్రతీ నెలా రేషన్ తీసుకుంటున్నామనీ, ఈనెల రేషన్ కోసం వెళితే కార్డులో మీ బయోమెట్రిక్, ఐరిష్ ముద్రలెవరివీ లేవని చెబుతున్నారని తమ్మిన రవికుమార్ అనే వ్యక్తి అర్జీ పెట్టుకున్నారు. తమకు రేషన్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ అనుమతులు రద్దు చేయండి కొత్తవలస మండలం పెదరావు పల్లిలో రాక్ టెక్ శాండ్ కంపెనీ నిర్మిస్తున్న క్రషర్, మైనింగ్ లీజులను రద్దు చేయాలని పెదరావుపల్లి, చినరావుపల్లి గ్రామాల రైతులు ఫిర్యాదు చేశారు. 1996లో ప్రభుత్వం ఇచ్చిన మొక్కలను అందులో పెంచుతున్నామని, ప్రభుత్వమే సుదర్శనరావు అనే వ్యక్తికి మైనింగ్ లీజు ఇవ్వడం వలన తాము జీవనాధారం కోల్పోతున్నామని, వెంటనే ఆ లీజులను రద్దు చేసి మా మొక్కలను కాపాడాలని కోరారు. -
నగల వేలంపై బ్యాంకు మేనేజర్ నిలదీత
గుంటూరు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం గొడవ జరిగింది. బ్యాంకు అధికారులు తాకట్టు పెట్టిన నగలను తమకు సమాచారం ఇవ్వకుండా వేలం వేశారంటూ ఖాతాదారులు బుధవారం సాయంత్రం బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. దీనిపై మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు. అతనిని బయటకు లాక్కొచ్చారు. సమాచారం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి..రెండు వర్గాల వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. -
బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంతో నష్టం
గంట్యాడ: మండలంలోని లక్కిడాం ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శంకర సూర్యారావు నిర్య్లక్షం కారణంగా నష్టపోయామంటూ బ్యాంక్ పరిధిలో గల సుమారు 10గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు. తొలివిడత రైతు రుణమాఫీ ఎస్బీఐ బ్రాంచ్పరిధిలో 497మందికి వర్తించింది. ఇందులో 300మందికి పైగా రైతులకు రూ.10లోపు రుణమాఫీ రావడం బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యమేనని రైతులు ఆందోళనవ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం వల్లనే రుణమాఫీ వర్తించలేదని వాపోయారు. బ్యాంకులో లోను పెట్టుకున్నప్పుడు పాస్‌పుస్తకాలతోపాటు మీసేవ కార్యాలయంలో తీసిన అడంగల్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు జతచేశామని తెలిపారు.ప్రస్తుతం వచ్చిన రుణమాఫీలో పాస్‌పుస్తకంలో చూపిన విస్తీర్ణం ఇప్పుడు లేదని 0నుంచి 5సెంట్లవరకు మాత్రమే విస్తీర్ణం ఉన్నట్లు చూపారన్నారు. సెంట్ల భూమి ఉంటే వేలకొద్దీరుణం ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు,సిరిపురం ఎంపీటీసీ సభ్యుడు పి.జైహింద్‌కుమార్ మాట్లాడుతూ రైతులపట్ల బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. లోనుకోసం బ్యాంకు చుట్టూ తిప్పి రుణమాఫీ వచ్చేసరికి నిలువునా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మేనేజర్‌ను వివరణ అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదన్నారు.ఇంత అన్యాయం జరుగుతున్నా అధికారులు, అధికార పార్టీ నాయకులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిరిపురం,చంద్రంపేట,రావివలస,లక్కిడాం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
అప్పు తీర్చమని బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మాహత్యాయత్నం కుకునూరు: అప్పు తీర్చమని బ్యాంకు మేనేజర్ చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కుక్కునూరులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... స్థానిక ఏపీజీవీబీ బ్యాంకులో పరాంకుశం అనే వ్యక్తి వేణు ఫ్యాన్సీ దుకాణం కోసం ఆ బ్యాంకులో రూ.25 వేలు రుణం తీసుకున్నాడు. గతేడాది జనవరిలో తీసుకున్న రుణాన్ని ఇంతకుముందు ఉన్న బ్యాంకు అధికారులు ఈ ఏడాది రెన్యువల్ చేశారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న మేనేజర్ తాతా అంకాల్ తరచూ వేణును పిలిచి రుణం తీర్చమని, లేకుంటే నోటీసులు పంపిస్తానని, ఇల్లు, దుకాణం జప్తు చేస్తానని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వేణు మంగళవారం బ్యాంకు వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పటించుకునే సమయంలో అక్కడే ఉన్న పలు పార్టీల నాయకులు, రైతులు అడ్డుకున్నారు. స్థానికులు మేనేజర్‌తో వాదనకు దిగారు. -
ఖాతాదారుల సొమ్ము మింగిన బ్యాంక్ మేనేజర్!
ఏలూరు: తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు తణుకు బ్రాంచ్ మేనేజర్ ఖాతాదారుల సొమ్ము మింగేశాడు. ఆ బ్రాంచ్ మేనేజర్ వినోద్ రాజన్ కోటి 35 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. 22 మంది ఖాతాదారుల సంతకాలు ఫోర్జరీ చేసి వినోద్ ఈ డబ్బు నొక్కేసినట్లు వెల్లడైంది. ఉన్నతాధికారుల తనిఖీలో వినోద్ రాజన్ బండారం బయటపడింది. బ్యాంకు అధికారులు వినోద్ రాజన్‌ను సస్పెండ్ చేసి తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పంట రుణాల్లో జాప్యం వద్దు
చంద్రశేఖర్‌కాలనీ: బ్యాంక్‌కు రుణమాఫీ పథకం మొదటి విడతగా విడుదల చేసిన నిధులను రైతుల అకౌంట్లకు జమ చేసి ఖరీఫ్ పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డి. రొనాల్డ్ రోస్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జవహార్రోడ్డు(పుసలగల్లి)లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులక పంట రుణాల మంజూరు, రుణ మాఫీ పథకం అమలుతీరును, బ్యాంక్ కార్యకలాపాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పంట రుణాలు మంజూరు విషయంలో ప్రభుత్వ సూచనలు, నిబంధనలు పాటించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఎంతైన ఉందన్నారు. బోగస్ పట్టాదారు పాస్బుక్ల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 286 మంది రైతులకు రుణ మాఫీ పథకం కింద కొత్త పంట రుణాలు ఇస్తున్నామని బ్యాంక్ మేనేజర్ మిశ్రా వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ నర్సింహ, ఇన్చార్జి డీఆర్ఓ యాదిరెడ్డి, డిప్యూటీ ఎల్డీఎం రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల్లో మంజూరు.. ప్రభుత్వం రైతులకు రుణ మాఫీతో పాటు ఖరీఫ్ పంట రుణాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24 గంటల్లోగా మంజూరు చేస్తానని మేనేజర్ హామీ ఇచ్చారని కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. కొత్త రుణాలను ఇవ్వడం లేదనే ఫిర్యాదు రావడంతో బ్యాంక్‌ను సందర్శించానన్నారు. కొత్తగా 400 మందికి 24 గంటల్లో రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పడం జరిగిందన్నారు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని ఇప్పటికే ఆదేశించడం జరిగిందని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
బ్యాంకు మేనేజర్‌నంటూ మోసం
కమ్మర్పల్లి : బ్యాంకు మేనేజర్‌నని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకున్నాడు. క్లోనింగ్ చేసిన కార్డుతో వివిధ దుకాణాల్లో షాపింగ్ చేసి రూ. 15,630 డ్రా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ పవార్ బాలాజీకి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆయన ఫోన్‌కు ఆదివారం రాత్రి 70338 71737 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. నీ ఏటీఎం పిన్ నంబర్ మారిందని తెలిపాడు. పాత నంబర్ చెప్పాలని కోరాడు. దీంతో బాలాజీ తన కార్డు నంబర్ తెలిపాడు. అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ పెట్టేశాడు. అనుమానం వచ్చిన బాలాజీ.. వెంటనే కమ్మర్‌పల్లిలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే ఏటీఎం బంద్ ఉండడంతో మెట్పల్లి ఎస్బీహెచ్ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని చూశాడు. అనేబుల్ టు ప్రాసెస్ అని రిసిప్ట్ రావడంతో నివ్వెరపోయాడు. సోమవారం కమ్మర్పల్లి ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లి తన ఖాతాకు సంబంధించి లావాదేవీలు చూడగా ఆదివారం ఒక్కరోజే ఏడు దఫాలుగా రూ. 15,630 డ్రా అయినట్లు తేలింది. కార్డు తన వద్ద ఉండగానే ఖాతాలోని నగదు ఎలా విత్‌డ్రా అయ్యిందని బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు. పిన్ నంబరు చెప్పడం వల్ల అజ్ఞాత వ్యక్తి షాపింగ్ ద్వారా డబ్బులు డ్రా చేసి ఉంటాడని మేనేజర్ పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు.