దేవుడు వరమిచ్చినా.. | bank willing to loan manager had not signed CC | Sakshi
Sakshi News home page

దేవుడు వరమిచ్చినా..

Published Mon, Jun 1 2015 11:23 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

bank willing to loan manager had not signed CC

బ్యాంకు మేనేజర్ రుణం ఇస్తామన్నా సంతకం చేయని సీసీ
         వెన్స్‌సెల్‌కు 186 అర్జీలు
 
 విజయనగరం కంటోన్మెంట్: బ్యాంకు మేనేజర్ డ్వాక్రా సంఘానికి రుణం ఇస్తామన్నా వెలుగు సీసీ సంబంధిత ఫైల్‌పై సంతకం చేయడం లేదని బాడంగి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరా డ్వాక్రా మహిళా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు దళాయి లక్ష్మి, ఆవు రమణమ్మలు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ప్రతి వారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌కు సోమవారం 186 అర్జీలు, ఫిర్యాదులు వచ్చాయి. బాడంగి మండలం డొంకినవలస ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో తమకున్న పాత రుణం తీర్చేసి కొత్త రుణానికి ధరఖాస్తు చేసుకుంటే రుణమిస్తామని బ్యాంకు మేనేజర్ ఫైల్‌తీసుకురమ్మన్నారనీ, కానీ సంబంధిత ఫైల్‌పై వెలుగు సీసీ సంతకం చేయడం లేదని మహిళలు ఆవేదన చెందారు. ఇప్పటికే తలా రూ.50 పోగేసి ఇచ్చామనీ, కానీ ఏడు నెలలుగా తాను సంతకం చేయకుండా తిప్పుతున్నాడని తమకు అత్యవసరం ఉన్నప్పటికీ ఏడు నెలలుగా ఆయన చుట్టూ తిరుగుతున్నామనీ అధికారులు చర్యలు తీసుకుని తమకు రుణం వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
 
 ప్రత్యామ్నాయ భూమి చూపితేనే తోటపల్లికి భూమి ఇస్తాం...
 తోటపల్లి ప్రాజెక్టు కోసం అదనంగా తీసుకున్న 9.81 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా సాగు భూమి ఇస్తేనే మేం భూములు ఇస్తామని కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన రేగాపు గవరన్న దొర, ఉరమల సత్తెమ్మ, బండి దాలెందొర, నందేడ గంగమ్మలు అర్జీ ఇచ్చారు. మూడు గ్రీవెన్స్‌సెల్‌ల నుంచీ తాము తిరుగుతున్నామని వారు వాపోయారు. వెంటనే తమకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని వారు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు.
 
 రేషన్ ఇవ్వమని చెబుతున్నారు.
 విజయనగరంలోని తెలకల వీధి రామమందిరం వద్ద గల రేషన్ షాపులో ప్రతీ నెలా రేషన్ తీసుకుంటున్నామనీ, ఈనెల రేషన్ కోసం వెళితే కార్డులో మీ బయోమెట్రిక్, ఐరిష్ ముద్రలెవరివీ లేవని చెబుతున్నారని తమ్మిన రవికుమార్ అనే వ్యక్తి అర్జీ పెట్టుకున్నారు. తమకు రేషన్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 మైనింగ్ అనుమతులు రద్దు చేయండి
 కొత్తవలస మండలం పెదరావు పల్లిలో రాక్ టెక్ శాండ్ కంపెనీ నిర్మిస్తున్న క్రషర్, మైనింగ్ లీజులను రద్దు చేయాలని పెదరావుపల్లి, చినరావుపల్లి గ్రామాల రైతులు ఫిర్యాదు చేశారు. 1996లో ప్రభుత్వం ఇచ్చిన మొక్కలను అందులో పెంచుతున్నామని, ప్రభుత్వమే సుదర్శనరావు అనే వ్యక్తికి మైనింగ్ లీజు ఇవ్వడం వలన తాము జీవనాధారం కోల్పోతున్నామని, వెంటనే ఆ లీజులను రద్దు చేసి మా మొక్కలను కాపాడాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement