గుంటూరు: గుంటూరు జిల్లా కారంపూడిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (వ్యవసాయ అభివృద్ధి శాఖ)లో శుక్రవారం రాత్రి దుండగులు చోరీకి యత్నించారు. దుండగులు బ్యాంకు తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి...లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు.
అది విఫలం కావటంతో బ్యాంకులోనే ఉన్న ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించి.. విఫలం కావడంతో ఏటీఎం మిషన్‌ను పగులగొట్టారు. ఆ ప్రయత్నము విఫలమైంది. దీంతో దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బ్యాంకు మేనేజర్ ఆ విషయాన్ని గమనించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.