ఆమని హత్యకేసులో సంచలన విషయాలు | Bank of Baroda Manager Wife Murder Case Reveals Madanapalle Police | Sakshi
Sakshi News home page

భర్తే విషమిచ్చి హతమార్చాడు

Published Mon, Feb 3 2020 9:01 AM | Last Updated on Fri, Jul 30 2021 12:08 PM

Bank of Baroda Manager Wife Murder Case Reveals Madanapalle Police - Sakshi

మదనపల్లె టౌన్‌: రోజుకో మలుపు తిరిగిన మదనపల్లె బరోడా బ్యాంకు మేనేజర్‌ చేబోలు రవిచైతన్య భార్య ఆమని(27) అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడింది. సైనైడ్‌ తాగడంతోనే ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టమ్‌ నివేదికలో తేలడం, నిందితుడు రవిచైతన్యను అరెస్టు చేసి విచారించడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడు రవిచైతన్య (35)ను, అతని తల్లిదండ్రులను అరెస్టు చేశారు.

డీఎస్పీ రవిమనోహరాచారి, ఎస్‌ఐ వెంకటేష్‌ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం మేరకు..మదనపల్లె శేషప్పతోటలో నివాసం ఉంటున్న బరోడా బ్యాంకు మేనేజర్‌ చేబోలు రవిచైతన్య భార్య సీహెచ్‌ ఆమని గత నెల 27న ఉదయం ఇంట్లో మృతి చెందింది. స్పృహ లేకుండా ఉన్న ఆమనిని ...రవిచైతన్య ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాత్రూమ్‌లో కిందపడి పోయి ఉందని పొరుగింటి వారు ఫోన్‌ చేయగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు డాక్టర్లకు చెప్పాడు.

డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా కోలుకోకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. ఆమని మరణవార్త తెలియగానే కృష్ణా జిల్లా ఒంటిమిట్ట మండలం ఇందులూరు నుంచి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, జోగి నాగేంద్రరావు మదనపల్లెకు చేరుకున్నారు. తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చారని, బాత్‌రూంలో పడి చనిపోయినట్లు చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వారి ఫిర్యాదు మేరకు ఆమనిది అనుమానాస్పద మృతి, అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మరుసటి రోజు పోస్టుమార్టమ్‌ నివేదికలో సైనైడ్‌ ఇవ్వడంతోనే చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో  నిందితుడు రవిచైతన్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు విచారణలో తానే సైనైడ్‌ తాగించినట్లు నిందితుడు అంగీకరించాడు. భార్యకు సైనైడ్‌ ఇచ్చి చంపినందుకు రవి చైతన్యను, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడినందుకు రేణిగుంటకు చెందిన రవిచైతన్య తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ, ఎస్‌ఐ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement