హోటల్‌ గదిలో అత్యాచారం.. వీడియో తీసి.. | Bank Manager Molested Minor And Recorded Video Blackmail After | Sakshi

మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ అత్యాచారం

Published Mon, Jan 25 2021 5:13 PM | Last Updated on Mon, Jan 25 2021 8:03 PM

Bank Manager Molested Minor And Recorded Video Blackmail After - Sakshi

భోపాల్‌ : మైనర్‌ బాలికపై అత్యాచారం జరిపిన ఓ బ్యాంక్‌ మేనేజర్‌ దాన్ని వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మొహాలీకి చెందిన ఓ మైనర్‌కు స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల ఓ బ్యాంక్‌ మేనేజర్‌తో పరిచయమైంది. అతడు మైనర్‌ను అప్పుడప్పుడు షాపింగ్‌ తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు హోటల్‌ గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటనంతా వీడియో తీశాడు. ( దారుణం: భార్య, పిల్లలు చూస్తుండగానే..)

ఆ తర్వాత నుంచి వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు. దీంతో విసుగుచెందిన మైనర్‌ పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్‌ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ తన స్నేహితురాలిపై కూడా కేసు పెట్టడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement