
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్న భక్తుల ఆటో రిక్షా ఛతర్‌పూర్ జిల్లాలో వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి039 (ఝాన్సీ-ఖజురహో హైవే)పై కడారి ప్రాంతంలో తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఆటో రిక్షాలో 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారు మహోబా రైల్వే స్టేషన్ నుంచి భాాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment