chhatarpur
-
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్న భక్తుల ఆటో రిక్షా ఛతర్పూర్ జిల్లాలో వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి039 (ఝాన్సీ-ఖజురహో హైవే)పై కడారి ప్రాంతంలో తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఆటో రిక్షాలో 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారు మహోబా రైల్వే స్టేషన్ నుంచి భాాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని ఆయన తెలిపారు. -
మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ నేత దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత హతమయ్యాడు. సాగర్ రోడ్డులోని మ్యారేజ్ గార్డెన్ సమీపంలో బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా తలపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ మీడియాకు తెలిపారు. మహేంద్ర గుప్తా ఘటనా స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఈ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇషానగర్ పట్టణానికి చెందిన మహేంద్ర గుప్తా 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజావర్ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. 10,400 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుప్తా ఛతర్పూర్కు వచ్చినట్లు తెలుస్తోంది. బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు అబ్దుల్ మన్సూరీ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి, కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలమయ్యిందన్నారు. తాను దాడి చేసిన వ్యక్తిని చూశానని, అతనిని గుర్తించగలనని అన్నారు. -
శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో 3 వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు తయారు చేశారు. ఇందులో 100 సాక్ష్యాలతో కూడిన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలున్నాయి. దీని నుంచి తుది చార్జిషీట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గత మేలో గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు ముందుగా వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఛతర్పూర్ అటవీ ప్రాంతంలో లభించిన ఎముకలు శ్రద్ధవేనని డీఎన్ఏ నివేదికల్లో తేలింది. ఇవే కీలక ఆధారాలు కానున్నాయి. -
వైరల్ వీడియో: పోలీస్‌పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి
-
Viral Video: పోలీస్ అధికారిపై కర్రలతో గ్రామస్తుల దాడి
భోపాల్: విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిపై స్థానికులు విచక్షణ రహితంగా దాడికి తెగబడిన ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్‌పూర్‌లోని జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూని ఉల్లంఘించి కొంతమంది వ్యక్తులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన గ్రామంలోని కొంతమంది మూకుమ్మడిగా పోలీస్ దగ్గరకు వెళ్లి అతనిపై దాడికి తెగబడ్డారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను జాతీయ మీడియా సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరలవుతోంది. 7 సెక్షన్ల నిడివిగల ఈ వీడియోలో గాయాలతో పోలీస్ కిందపడిపోయి లేవడానికి ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతేగాక పోలీస్‌ను కొట్టడానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తికి తలపై గాయాలయి ఉన్నాయి. కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్థానికులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అయితే, ఈ దాడికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరూ కూడా మాస్క్ ధరించలేదు. దీనికితోడు వారంతా అసభ్య పదజాలంతో మాట్లాడటం కెమెరాలో రికార్డయ్యింది. కాగా పోలీస్ ఓ వ్యక్తి తలపై పోలీస్ గట్టిగా కొట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. కానీ పోలీసుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తను కేవలం షాప్‌లు మూసేయాలని చెప్పినందుకు కోపంతో తనపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై డీఎస్పీ శశాంక్ విలేకరులతో మాట్లాడుతూ.. జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూ ఉల్లంఘించబడుతోందని తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులు బృందం అక్కడికి వెళ్లిందని, దుకాణాలను మూసివేయమని చెప్పడంతో కొంతమంది కోపం తెచ్చుకొని సిబ్బందిని కొట్టారని వెల్లడించారు. తామింకా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు, పూర్తి వివరాలు సేకరించగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
గొంతులో ఇరుక్కున్న 14 సెం.మీ. కత్తి
భోపాల్: కంట్లో నలుసు పడితేనే కొద్ది క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది గొంతులో ఓ కత్తి దిగితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా అనిపిస్తోంది కదూ! కానీ మధ్యప్రదేశ్‌లో అచ్చంగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛత్తర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగు సెంటిమీటర్ల పొడవున్న కత్తిని గుటుక్కుమని మింగేశాడు. దాన్ని మింగేటప్పుడు ఎక్కడా గుచ్చుకోలేదు కానీ, తిన్నగా ఆహారనాళంలోకి ప్రవేశించాక మొదలైంది అసలు సమస్య. (చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి) గుటక వేస్తే చాలు కత్తి కొన త్రిశూలంలా గొంతును పొడుస్తోంది. ఈ బాధను తాళలేకపోయిన సదరు వ్యక్తిని భోపాల్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు జనవరి 26న అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆహార నాళంలో ఉండిపోయిన కత్తిని తీసివేశారు. ఈ విషయాన్ని వైద్యులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. అయితే అతడు ఇలా ఏది పడితే దాన్ని గుటకాయ స్వాహా అనిపించడం కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం కూడా అతడు పలు వస్తువులను మింగేయగా ఎయిమ్స్ వైద్యులు వాటిని పొట్టలో నుంచి బయటకు తీశారు. (చదవండి: సమ్మర్ స్పెషల్: చిరిగినదానికి ఇంత ఖరీదా?) -
పెళ్లికూతురి నిర్వాకం, పెళ్లైన 18 రోజులకే..
భోపాల్ : మనసులు కలిశాయో, లేదో చూడకుండానే ఇద్దరికీ పెళ్లి చేశారు. అమ్మాయిని అత్తారింటికి సాగనంపారు. కానీ ఆమె మనసు కట్టుకున్న భర్త మీదకు పోలేదు, అంతకు ముందు తన చేయి పట్టుకుని ఊసులాడిన ప్రియుడి దగ్గరే ఆగిపోయింది. గుండెల్లో ప్రియుడి జ్ఞాపకాలను మోస్తూ మరొకరితో ఉండలేననుకుంది. అలా అనుకుందో, లేదో.. పెళ్లైన 18 రోజులకే చెప్పా పెట్టకుండా ప్రియుడితో పారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూర్తి రైక్వార్ అనే 20 ఏళ్ల యువతికి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తితో డిసెంబర్ 6న వివాహమైంది. కానీ అప్పటికే ఆమె భజ్జు యాదవ్ అనే అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో ఉంది. పెళ్లయినా కూడా అతడి తలపుల్లో నుంచి బయటకు రాలేకపోయింది. మరోవైపు పెళ్లి తర్వాత జరిగే తంతు కోసం నూతన వధువు పుట్టింటికి పంపించారు. (చదవండి: ఆ కోరికే విద్యార్థులను లేచిపోయేలా చేసింది...) అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఆమె డిసెంబర్ 24న మెట్టినింటికి తిరుగు పయనమైంది. ఇక దొరికిందే ఛాన్సని భావించిన సదరు యువతి తన మెడలో మూడు ముళ్లు పడ్డాయన్న విషయాన్ని మర్చిపోయి ప్రియుడితో పరారైంది. లక్షలు ఖరీదు చేసే బంగారు నగలు, డబ్బును కూడా వెంటపెట్టుకుని ఉడాయించింది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తన భార్య దారిలోనే ఎవరితోనే జంప్ అయిందని తెలుసుకున్న భర్త అమ్మాయి ఇంటికి వెళ్లి నానా రభస చేశాడట. ఈ విషయం గురించి వధువు తండ్రి రామ్‌పాల్ మాట్లాడుతూ.. కూతురు కోసం అల్లుడు గాలిస్తున్నాడని తెలిపాడు. ఆమె రూ.5 లక్షలు విలువ చేసే నగలతో పాటు, రూ.20 వేలు పట్టుకెళ్లిందని పేర్కొన్నాడు. (చదవండి: చికెన్ లేదన్నాడని ఎంత పని చేశారు..) -
చనిపోయాడనుకున్నారు.. కానీ తిరిగి వచ్చాడు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా దిల్వారీ గ్రామానికి చెందిన ఉదయ్ మూడు సంవత్సరాల క్రితం పారిపోయాడు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో చనిపోయాడనుకున్న కొడుకు తిరిగి రావడంతో అతని కుటుంబసభ్యుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ విషయమై బీజవర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సీతారాం మాట్లాడుతూ.. ' 2017లో ఉదయ్ తప్పిపోయాడంటూ అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. కాగా మా విచారణలో అతడి వయస్సు ఉన్న శవం ఒకటి దొరికింది. దీంతో ఉదయ్ తల్లిదండ్రులను పిలిచి శవాన్ని గుర్తించమని అడిగాం. చనిపోయిన వ్యక్తి ముఖం సరిగా కనపడకపోవడంతో అతను వేసుకున్న దుస్తులు, వయస్సు అదే కావడంతో తమ కొడుకు చనిపోయాడని భావించిన తల్లిదండ్రులు ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారంటూ' పేర్కొన్నాడు. ('వాడంటే నాకు ఇష్టం లేదు.. అందుకే చంపేశా') అయితే లాక్డౌన్ కారణంతో కాలినడకనే ఉదయ్ ఇంటికి చేరుకున్నాడు. ' మూడేళ్ల క్రితం మా ఊర్లో దొంగతనం చేశానంటూ కొందరు నాపై ఆరోపించి కేసు పెడతామని భయపెట్టారు. దీంతో నేను గ్రామం వదిలి ఢిల్లీ పారిపోయాను. లాక్డౌన్ కారణంగా తప్పని సరి మళ్లీ గ్రామానికి రావాల్సి వచ్చింది. నేను చనిపోయానని బాధపడుతున్న తల్లిదండ్రులకు నా రాక ఎంతో సంతోషం కలిగించింది. గ్రామానికి చేరుకున్న వెంటనే అందరూ నన్ను గుర్తుపట్టారంటూ' ఉదయ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు 4426 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 237కు చేరుకుంది. -
కొత్త జంటకు కరోనా; గ్రామానికి సీల్
లక్నో: పెళ్లి చేసుకున్న జంటకు కరోనా షాకిచ్చింది. తాజా పరీక్షల్లో వధూవరులిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఆ కొత్త జంటను రాజస్థాన్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వివాహానికి వేదికగా నిలిచిన అజంఘడ్‌లోని చత్తర్‌పూర్ గ్రామానికి అధికారులు సీల్ వేశారు. వివరాలు.. రాజస్థాన్‌కు చెందిన యువకుడు ఉత్తర ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ యువతిని మార్చి 23న వివాహమాడాడు. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల వారు అదే గ్రామంలో చిక్కుకుపోగా ఏప్రిల్ 14న అక్కడ నుంచి రాజస్థాన్‌కు పయనమయ్యారు. (లాక్డౌన్ నుంచి నిష్క్రమణ ఎలా?) నాలుగు రోజులు ప్రయాణించిన అనంతరం వారు రాజస్థాన్ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే సరిహద్దు సిబ్బంది వారిని అక్కడే ఆపేసి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పెళ్లి జరిగిన చత్తర్‌పూర్ గ్రామాన్ని మూసివేశారు. వారి కుటుంబీకులను క్వారంటైన్‌కు తరలించారు. గ్రామస్థులకు స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు ఆ ప్రాంతాన్నంతటినీ శానిటైజింగ్ చేయనున్నారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) -
నిద్ర పోతున్న బాలికను లాక్కెళ్లి..
భోపాల్ : ఇంట్లో నిద్ర పోతున్న బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛాతార్పూర్ జిల్లా ఖజురహో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక స్వగృహంలో నిద్రపోతుండగా.. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఎవరూ గమనించకపోవటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని బాలిక బంధువులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఛాతార్పూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్కూల్ బస్సుకు ప్రమాదం, 20 మందికి గాయాలు
ఛాతార్పూర్: మధ్యప్రదేశ్ లోని ఛాతార్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఇరవై మంది చిన్నారులకు గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.