
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : ఇంట్లో నిద్ర పోతున్న బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛాతార్పూర్ జిల్లా ఖజురహో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక స్వగృహంలో నిద్రపోతుండగా.. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఎవరూ గమనించకపోవటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.
మరుసటి రోజు బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని బాలిక బంధువులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఛాతార్పూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment