
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నేత హతమయ్యాడు. సాగర్ రోడ్డులోని మ్యారేజ్ గార్డెన్ సమీపంలో బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా తలపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ మీడియాకు తెలిపారు.
మహేంద్ర గుప్తా ఘటనా స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఈ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇషానగర్ పట్టణానికి చెందిన మహేంద్ర గుప్తా 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజావర్ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. 10,400 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుప్తా ఛతర్‌పూర్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు అబ్దుల్ మన్సూరీ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి, కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలమయ్యిందన్నారు. తాను దాడి చేసిన వ్యక్తిని చూశానని, అతనిని గుర్తించగలనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment