భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాహోహ్ జిల్లాలో మంగళవారం ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్నాయి, ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. సామాన్న గ్రామ సమీపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని జబల్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దామోహ్ ఎస్పీ శృతికీర్తి సోమవంశీ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, అతడు మద్యం సేవించి వాహనం నడిపాడా లేదా అని విచారిస్తున్నట్లు చెప్పారు.
మృతులను గుర్తించే పని జరుగుతోందని తెలిపారు. ఆటో డ్రైవర్‌కు కూడా గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు ట్రక్ డ్రైవర్‌పై దేహత్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగం, పోలీసులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి ఆర్థిక సాయం కింద రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment