Truck auto
-
ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాహోహ్ జిల్లాలో మంగళవారం ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్నాయి, ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. సామాన్న గ్రామ సమీపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని జబల్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దామోహ్ ఎస్పీ శృతికీర్తి సోమవంశీ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, అతడు మద్యం సేవించి వాహనం నడిపాడా లేదా అని విచారిస్తున్నట్లు చెప్పారు.మృతులను గుర్తించే పని జరుగుతోందని తెలిపారు. ఆటో డ్రైవర్‌కు కూడా గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు ట్రక్ డ్రైవర్‌పై దేహత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగం, పోలీసులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి ఆర్థిక సాయం కింద రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
పాట్నా: బిహార్ కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఆటో ఢీకొట్టి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. సోమవారం రాత్రి 8:30 గంటలకు జాతీయ రహదారి-81 పై ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఓవర్టేక్ చేయిబోయిన ట్రక్కు దాన్ని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం చెందిన స్థానికులు రోడ్డుపై టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిని దిగ్బంధించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి వాళ్లను శాంతింపజేశారు. ట్రక్కు, డ్రైవర్‌ను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. చదవండి: రోడ్డును కమ్మేసిన పొగమంచు.. ట్రక్కు-బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
గంగూరు పెట్రోలు బంకు వద్ద ఘటనలో ఇద్దరు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు జూపూడి వద్ద ట్రక్ ఆటో ఢీకొని మహిళ.. పెనమలూరు మండలం గంగూరు, ఇబ్రహీపట్నం మండలం జూపూడిలో శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాద ఘటనల్లో ముగ్గురు మరణించారు. గంగూరు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జూపూడి మినీ ట్రక్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యవసాయ కూలీ మృతిచెందింది. గంగూరు(పెనమలూరు), న్యూస్‌లైన్ : గంగూరు పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాయ్యాయి. పెనమలూరు పోలీసులు తెలి పిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కొందరు వ్యక్తులు గురువారం పొక్లెయిన్‌ను లారీపై లోడ్ చేసి కానూరుకు బ యలుదేరారు. లారీని వడుగు వీర్రాజు నడుపుతుండగా విజయనగరం జిల్లా పాంచాలి గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ ఉద్దంటి సత్యనారాయణ(25), హెల్పర్ రేపల్లి రామారావు(రేపల్లె), సాలాది సూర్య అనే వ్యక్తులు అందులో ఉన్నారు. లారీ శుక్రవారం వేకువజామున నా లుగు గంటల సమయంలో విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు పెట్రోల్ బంకు వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న కొబ్బరికాయల లోడు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో పొక్లెయిన్ ఆపరేటర్ సత్యనారాయణ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హెల్పర్ రేపల్లె రామారావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వీర్రాజు, సూర్యను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బందరురోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళా కూలీ ఉసురు తీసిన ట్రక్ ఆటో జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ మహిళా కూలీని గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది. శుక్రవారం సా యంత్రం జూపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణిం చింది. సేకరించిన వివరాల ప్రకారం.. జూపూడి భీమేశ్వర కాలనీకి చెందిన కన్నా వెంకటేశ్వరమ్మ(45) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె భర్త కొంతకాలం కిందట మరణించాడు. శుక్రవారం సాయంత్రం తన పాడిగేదెకు గడ్డిని తీసుకువస్తూ జాతీయ రహదారి దా టుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న ట్రక్ ఆటో ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడకుండానే.. వెంకటేశ్వరమ్మ పెద్దకుమారుడు ప్రైవేటు ఎలక్ట్రీషియన్. ఈ ప్రాంతంలోని ప్రైవేటు ఇంజి నీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేశ్వరమ్మ తన కాయకష్టంతో చిన్నకుమారుడిని ఇంజినీరింగ్ చదివిస్తోంది. తల్లి మృతదేహం వద్ద కుమారులు రోదిస్తున్న తీరు స్థానికుల కంటతడి పెట్టించింది. పిల్లలు చేతికంది వస్తున్న తరుణంలో వారి ఉన్నతిని చూడకుండానే వెంకటేశ్వరమ్మ అకాల మరణం చెందిందని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేశారు.